New Year 2025: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో పాల్గొంటున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
New Year 2025: కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సెలబ్రేషన్స్ పేరిట పార్టీలు చేసుకోవడం కామన్ అయిపోయింది. అయితే ఈ పార్టీల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ తప్పక చూడండి.
కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పే సమయంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలనుకుంటారు. అభిరుచులకు తగ్గట్టుగా ఒక్కొక్కరు ఒక్కో అలవాటును ఎంచుకుంటారు. అయితే ప్రస్తుత జనరేషన్‌లో, ఎక్కువ మంది ఏ సందర్భాన్నైనా ఎంజాయ్ చేసేందుకు, ఆల్కహాల్ తీసుకోవడాన్నే ఆప్షన్‌గా తీసుకుంటున్నారు. ఆల్కహాల్ తీసుకోవడం ప్రమాదమని తెలిసీ తాగుతున్న వారు కొద్ది చిట్కాలు పాటిస్తే ఆరోగ్యం విషయంలో సేఫ్‌గా ఉండొచ్చు.
ఏం తీసుకోవాలి?
ఆల్కహాల్ తీసుకుంటున్నప్పుడు, మీరు ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరమైనవి తీసుకోవడంతో పాటు ప్రతికూల ప్రభావాలను తగ్గించే వాటిని కూడా తీసుకోవాలి
1. నీరు:
హైడ్రేట్ అవ్వండి. ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా శరీరంలో నీటి లోపం కలుగుతుంది. కాబట్టి నీటిని పర్యాయంగా తీసుకోవడం ముఖ్యం. హ్యాంగోవర్‌ను తగ్గించడంలో, శరీరానికి హైడ్రేషన్‌ను అందించడంలో సహాయపడుతుంది.
2. ఆహారం:
ఆల్కహాల్ తీసుకోవడానికి ముందు లేదా తీసుకునే సమయంలో ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఇది ఆల్కహాల్ తీవ్రతను తగ్గిస్తుంది. శరీర వ్యవస్థను రక్షిస్తుంది. ఆల్కహాల్ తో పాటు తీసుకోవాల్సిన ఆహారాలు:
ప్రోటీన్లు : చికెన్, చేప, గుడ్లు.
ఆరోగ్యకరమైన కొవ్వులుండే ఆహారం : ఆవకాడో, మామిడి, ఆలివ్ ఆయిల్, పన్నీర్
కార్బోహైడ్రేట్లు : గోధుమలతో చేసిన రోటీ, పాస్తా, అన్నం
ఫలాలు & కూరగాయలు : ఎక్కువ నీరు కలిగి ఉన్న పండ్లు ఉత్తమం. హైడ్రేషన్ పోషకాలు అందించే పుచ్చకాయ, నారింజలు, ఆవకాడో, క్యాబేజి వంటి వాటిని తీసుకోవచ్చు.
3. సిట్రస్ జ్యూసులు:
ఆల్కహాల్‌తో నిమ్మకాయ, నారింజ వంటి సిట్రస్ పండ్ల రసాలను మిక్స్ చేయడం వల్ల రుచి మెరుగవుతుంది. విటమిన్ C సమపాళ్లలో అంది, హ్యాంగోవర్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడవచ్చు.
4. హెర్బల్ టీలు:
ఆల్కహాల్ జీర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. కాబట్టి అల్లం టీని తీసుకుంటే జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
5. సోడా వాటర్ లేదా టానిక్ వాటర్:
ఆల్కహాల్‌లో కలుపుకునేందుకు షుగరీ డ్రింక్స్‌కు బదులుగా సోడా వాటర్ లేదా టానిక్ వాటర్ ఉపయోగించడం మంచిది. ఇవి శరీరంలోకి చేరిన కేలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రిఫ్రెషింగ్ ఫీలింగ్ కలిగిస్తుంది.
తీసుకోకూడని ఆహార పదార్థాలు:
అత్యధిక చక్కెర మిక్సర్లు : షుగరీ డ్రింక్స్ లేదా ఫేవర్డ్ డ్రింక్స్‌తో కూడిన కాక్‌టెయిల్స్ హ్యాంగోవర్‌ని పెంచుతాయి.
ఆకలితో ఉన్న సమయంలో ఆల్కహాల్ : ఇటువంటి సమయంలో శరీరం ఆల్కహాల్ ను త్వరగా గ్రహిస్తుంది. ఇది మీరు త్వరగా మద్యం మత్తులో పడిపోవడానికి కారణమవుతుంది.
మితంగా తీసుకుంటే
మితమైన ఆల్కహాల్ వినియోగం, ప్రత్యేకించి రెడ్ వైన్ వంటివి గుండె ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. రెడ్ వైన్‌లో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయట. అవి మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచి చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గిస్తాయట.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం