ఆయుర్వేదం ప్రకారం ప్రకృతిలో లభించే ప్రతి మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. కొన్ని రకాల మొక్కలు ఆరోగ్యానికి వరంగా పని చేస్తాయని భావిస్తారు. అనేక రకాల వ్యాధులను నయం చేయగల శక్తి పలు రకాల వేర్లు, కాండం, మొక్కల్లో ఉంటుందని నమ్ముతారు. అలాంటి ఒక ఆయుర్వేద ఔషధ మొక్క ఆస్పరాగస్. దీన్నే శతావరి, పిల్లితేగ అని పిలుస్తారు.
ఆస్సరాగస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, రోగనిరోధక శక్తిని బలపరిచే లక్షణాలు ఉంటాయి. ఇవి హార్మోన్లను సమతుల్యం చేయడం ద్వారా ప్రత్యుత్పత్తి ఆరోగ్యం, చర్మంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ మొక్కలోని వేరు, కాండం, ఆకులు అన్ని భాగాలు ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. వీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి, ఆస్పరాగస్‌ను ఎలా ఉపయోగించాలి తెలుసుకుందాం రండి..
శతావరిని సేవించడం వల్ల ప్రత్యుత్పత్తి(Reproduction) సామర్థ్యం మెరుగుపడుతుంది. NCB వారి అధ్యయనం ప్రకారం ఆస్పరాగస్ లోని సారం వీర్య సంఖ్యను పెంచడం ద్వారా పురుషులలో వంధ్యత్వ సమస్యను తగ్గిస్తుంది. దీనివల్ల ప్రత్యుత్పత్తి సామర్థ్యం మెరుగుపడుతుంది. అలాగే, స్త్రీల ప్రత్యుత్పత్తి అవయవాలకు పోషణను అందించి, వారి గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలు పుట్టక ఇబ్బంది పడుతున్న వారు ఈ మొక్కను తినడం వల్ల గర్భం దాల్చడం సులభం అవుతుంది. పాలిచ్చే తల్లులు దీన్ని సేవించడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది.
ఆస్పరాగస్ ను మితంగా సేవించడం వల్ల ఋతు చక్రం సక్రమంగా ఉంటుంది. ఈ సమయంలో వచ్చే కడుపు నొప్పి, నడుము నొప్పి వంటివి తగ్గుతాయి. ఈ సమయంలో హార్మోన్ల మార్పు వల్ల వచ్చే అనేక రకాల మానసిక సమస్యలను తగ్గించడంలో సహాయపడతుంది.
శతావరిలో విటమిన్ సి, విటమిన్ -ఈ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మానికి హాని కలిగించే వృద్ధాప్య ఛాయలను పెంచే ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడతాయి. అలాగే చర్మం ఆరోగ్యానికి అవసరం అయే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. చర్మం స్థితిస్థాపకతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఆస్పరాగస్ ను సరైన పద్ధతిలో తినడం వల్ల చర్మంపై వచ్చే ముడతలు, గీతలు, మచ్చలు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఆస్పరాగస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డిప్రెసెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి. శతావరిని అశ్వగంధతో కలిపి తీసుకోవడం వల్ల ఒత్తిడిని పెంచే హార్మోన్ కార్టిసాల్ తగ్గుతుంది. ఇది అడ్రినల్ గ్రంథుల నుండి విడుదలయ్యే హార్మోన్. ఒత్తిడికి ప్రతిస్పందనగా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.
శతావరిని సేవించడం వల్ల జీర్ణవ్యవస్థ సమతుల్యంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల అరుగుదలతో పాటు ప్రేగలు ఆరోగ్యం కూడా బాగుంటుంది. మల విసర్జనను పెంచడానికి కూడా ఇది సహాయపడుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం