Health in Summer: వేసవిలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? ఈ ఆహారాలకు దూరంగా ఉండండి
Health in Summer: ఎండల వేడి పెరిగిపోతోంది. ఆరోగ్యం కోసం కొన్ని రకాల ఆహారాలను తినాలి. అలాగే కొన్ని రకాలా పదార్థాలకు దూరంగా ఉండాలి. వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలను తినకూడదో తెలుసుకోండి.
Health in Summer: వేసవికాలంలో వేడికి తగ్గట్టు మీ ఆహార నియమాలను మార్చుకోవాలి. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా ముఖ్యం. కొన్ని ఆహారాలు శరీరంలో హైడ్రేషన్ స్థాయిలను క్షీణించేలా చేస్తాయి. దీనివల్ల మీరు డీహైడ్రేషన్ సమస్యకు గురవుతారు. డీహైడ్రేషన్ సమస్య వల్ల అనేక అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే తాజా పండ్లు, కూరగాయలు, నీరు వంటివి అధికంగా తీసుకోవాలి. ఎలాంటి ఆహారాలను దూరంగా ఉండాలో తెలుసుకోండి.
ఉప్పగా ఉండే స్నాక్స్
స్నాక్స్ చాలా వరకు ఉప్పగానే ఉంటాయి. ఉప్పును అధికంగా వేయడం వల్ల అవి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. చిప్స్, క్రాకర్స్, జంతికలు వంటి వాటిలో ఉప్పును అధికంగా వేస్తారు. అధిక సోడియం కలిగిన వీటిని వేసవిలో తినకపోవడం మంచిది. అధిక సోడియం వినియోగం మీ శరీరంలో నీరు నిలిచిపోయాలా చేస్తుంది. ఇది నిర్జలీకరణానికి దారితీస్తుంది. ఉప్పగా ఉండే ఆహారాలు దాహాన్ని పెంచుతాయి. దీనివల్ల మీరు ఎక్కువగా పానీయాలను తాగాలనుకుంటారు. శరీరంలో నీరు నిలిచిపోతే పాదాలు వాపు, కాళ్ల వాపు లాంటి సమస్యలు వస్తాయి.
ప్రాసెస్ చేసిన ఆహారాలు
బార్బెక్యూ ఆహారాలను ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అలాగే హాట్ డాగ్, సాసేజ్, పిజ్జా, బర్గర్ వంటి వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు, మాంసాలను ఎక్కువగా తింటున్నారు. ప్రాసెస్ చేసిన మాంసాలలో అధిక సోడియం కంటెంట్ ఉంటుంది. ఇవి చాలా గొప్పగా ఉంటాయి. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. డీహైడ్రేషన్ ప్రమాదం కూడా పెరిగిపోతుంది.
చక్కెర
పంచదారతో చేసిన ఆహారాలు తినేవారి సంఖ్య ఎక్కువే. ఐస్ క్రీములు, స్వీట్లు తగ్గించుకోవాలి. తిన్నప్పుడు తీయని పదార్థం కాస్త ఉపశమనంగా అనిపించవచ్చు. కానీ ఇది డీహైడ్రేషన్ ప్రభావాలను పెంచుతుంది. అధిక చక్కెరను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. శరీరంలో అదనపు నీటిని తొలగించడానికి మూత్రపిండాలు అధికంగా కష్టపడాల్సి వస్తాయి. అప్పుడు పదే పదే మూత్ర విసర్జనకు వెళ్తారు. అలాగే దాహం పెరుగుతుంది. డీహైడ్రేషన్ సమస్య బారిన కూడా పడతారు.
మద్యం
కాక్టైల్స్ చల్లని బీరు వంటి ఆల్కహాల్ ఆధారిత పానీయాలను ప్రతిరోజు తాగేవారు ఉన్నారు ఇలాంటి తాగడం వల్ల మూత్ర ఉత్పత్తి పెరుగుతుంది శరీరంలో నుంచి ద్రవాన్ని ఎక్కువగా కోల్పోతారు దీనివల్ల డిహైడ్రేషన్ బారిన పడతారు అలాగే ఆల్కహాల్ పానీయాలు అధిక స్థాయిలో చక్కెర లేదా ఉప్పును కలిగి ఉంటాయి ఇవి కూడా ఆరోగ్యానికి కీడే చేస్తాయి
కెఫీన్
ఉదయాన్నే టీ, కాఫీలతో రోజును మొదలుపెట్టే వారి సంఖ్య ఎక్కువే. టీ, కాఫీ, సోడా వంటి పానీయాలలో కెఫీన్ అధికంగా ఉంటుంది. ప్రతిరోజూ శరీరంలోకి కెఫిన్ పంపించడం వల్ల మూత్ర విసర్జన అధికంగా వెళ్లాల్సి వస్తుంది. మూత్ర ఉత్పత్తి పెరుగుతుంది. ఇది నిర్జలీకరణానికి కారణం అవుతుంది. కాబట్టి వేసవిలో కాఫీ, టీ, సోడా వంటి వాటికి దూరంగా ఉండాలి.
స్పైసీ ఫుడ్స్
కారం నిండిన పదార్థాలను తినడం తగ్గించుకోవాలి. స్పైసీ ఫుడ్స్ చెమట అధికంగా పట్టేలా చేస్తాయి. అధిక చెమట వల్ల శరీరం నుంచి ద్రవాలను కోల్పోతారు. ఇది డీహైడ్రేషన్ కు దారితీస్తుంది. మసాలా ఆహారాలు, సోడియం అధికంగా ఉండే ఆహారాలు, ఉప్పు నిండిన ఆహారాలు, మసాలా మిశ్రమాలు వంటివి దాహాన్ని పెంచుతాయి. ఎక్కువ నీటి వినియోగాన్ని పెంచుతాయి. డిహైడ్రేషన్ బారిన పడేలా చేస్తాయి.