Pomegranate Health Benefits : మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పండు దివ్యౌషధం-health benefits of pomegranate to diabetic patients details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Health Benefits Of Pomegranate To Diabetic Patients Details Inside

Pomegranate Health Benefits : మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పండు దివ్యౌషధం

HT Telugu Desk HT Telugu
Mar 15, 2023 04:02 PM IST

Health Benefits Of Pomegranate : మధుమేహంతో చాలామంది బాధపడుతున్నారు. అయితే వారు ఇష్టం వచ్చినట్టుగా ఫుడ్ తీసుకోవద్దు. సరైన ఆహారం తింటే.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది.

దానిమ్మపండు
దానిమ్మపండు

ప్రమాదకరమైన వ్యాధులలో మధుమేహం(diabetic) ఒకటి. మధుమేహంతో బాధపడేవారు చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. మధుమేహంతో బాధపడే వారికి ఆరోగ్యాన్ని(health) కాపాడుకోవడం అంత తేలికైన పని కాదు. కొంచెం నిర్లక్ష్యం చేసినా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అప్పుడు కిడ్నీ(Kidney), గుండె జబ్బులు రావచ్చు. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేసే పండు గురించి తెలుసుకుందాం.

'ఒక దానిమ్మ వంద రోగాలను నయం చేస్తుంది' అనే సామెత మీరు వినే ఉంటారు. ఈ పండు మనల్ని అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది. దానిమ్మ(Pomegranate) మధుమేహం మాత్రమే కాకుండా అనేక ఇతర సమస్యలను కూడా నయం చేస్తుంది. దానిమ్మలో పోషకాలకు లోటుండదు. విటమిన్ సి(Vitamin C), విటమిన్ బి, విటమిన్ కె, ఫైబర్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్స్, ఐరన్, పొటాషియం, జింక్ వంటివి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

దానిమ్మ గింజల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. ఇది డయాబెటిక్(Diabetic) రోగులకు ఔషధం. దానిమ్మ గింజలను నేరుగా తినడం వల్ల మంచి ఫైబర్ కంటెంట్ లభిస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో దానిమ్మ రసం చాలా సహాయపడుతుంది.

రక్తహీనత నుండి ఉపశమనం పొందుతారు. శరీరం(Body)లో రక్తం లేని వారు తరచుగా అలసట, బలహీనతను ఎదుర్కొంటారు. మీరు రక్తహీనతతో ఉన్నప్పుడు కచ్చితంగా దానిమ్మ తినండి. ఇది ఇనుము లోపాన్ని నయం చేయడమే కాకుండా ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. దానిమ్మలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. దీని ద్వారా గర్భధారణ సమయంలో ప్లాసెంటా రక్షించబడుతుంది. ఈ పండులోని ఫోలేట్ మహిళ కడుపులో పెరిగే శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

దానిమ్మ పండ్లలో అన్ని పండ్ల కంటే.. ఎక్కువగా పోషకాలు ఉంటాయి. హెల్త్ లైన్ ప్రకారం.. దానిమ్మపండు(Pomegranate)లో 7 గ్రాముల పైబర్, మూడు గ్రాముల ప్రోటీన్, ముప్పై శాతం విటమిన్ సి, పదహారు శాతం ఫోలేట్, పన్నెండు శాతం పొటాషియం ఉంటాయి. ఒక కప్పు దానిమ్మ గింజల్లో 24 గ్రాముల చక్కెర, 144 కేలరీల శక్తి కూడా ఉంటుంది. దానిమ్మలో విలువైన మూలకాలు ఉన్నాయి. పునికాలాగిన్స్, ప్యూనిసిక్ యాసిడ్ అవి. ప్యూనికుల్గిన్స్ లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ప్యూనిక్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. దానిమ్మలో యాంటీ ఇన్ఫ్లమేటరి లక్షణాలతో మధుమేహం, క్యాన్సర్, అల్జీమర్స్, ఊబకాయం వంటి వ్యాధులతో పోరాడగలవు.

WhatsApp channel

టాపిక్