Radhika Merchant: నవ వధువు రాధికా మర్చెంట్ బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్ చూశారా?-have you seen the new bride radhika merchants budget friendly dress ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Radhika Merchant: నవ వధువు రాధికా మర్చెంట్ బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్ చూశారా?

Radhika Merchant: నవ వధువు రాధికా మర్చెంట్ బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్ చూశారా?

Haritha Chappa HT Telugu
Aug 04, 2024 09:30 AM IST

Radhika Merchant: అనంత్ అంబానీతో కలిసి పారిస్ లో విహారయాత్రకు రాధికా మర్చంట్ రంగురంగుల మ్యాక్సీ డ్రెస్ లు ధరిస్తోంది. ఆమె వేసే ప్రతి డ్రెస్ కూడా నేటి యువత ఆలోచనలను ప్రతిబింబించేలా ఉంది.

అనంత్ అంబానీతో రాధికా మర్చంట్
అనంత్ అంబానీతో రాధికా మర్చంట్ (Instagram )

నూతన వధూవరులు రాధికా మర్చంట్, అనంత్ అంబానీ పెళ్లి తరువాత విదేశాల్లో జంటగా షికారు చేస్తున్నారు. తమ కుటుంబంతో కలిసి పారిస్ లో విహరిస్తున్నారు. సిటీ ఆఫ్ లవ్‌గా పిలుచుకునే పారిస్‌లో విహారయాత్ర సందర్భంగా రాధిక రంగురంగుల మ్యాక్సీ డ్రెస్ ధరించింది. ఆమె వేసుకునే డ్రెస్‌లు యువతకు చాలా నచ్చేవిలా ఉన్నాయి. వీటి ధరలు అంబానీల స్థాయిలో చూస్తే అవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్పుకోవాలి. నెలకు యాభై వేలు, లక్ష రూపాయలు సంపాదించే వారికి మాత్రం వీటి ధర ఎక్కువనే అనిపిస్తుంది.

రాధికా మర్చంట్ వేసుకున్న డ్రెస్ ధర ఎంత?

తన భర్త అనంత్ అంబానీతో కలిసి పారిస్ విహారయాత్రకు రాధికా మర్చంట్ ధరించిన మ్యాక్సీ డ్రెస్ ఎంతో మంది యువతకు నచ్చింది. ఇది సాండ్రో పారిస్ అనే దుస్తుల లేబుల్ నుంచి కొనుగోలు చేశారు. రెడీ-టు-వేర్ డ్రెస్ ఇది. ఈ బృందాన్ని ప్యాచ్ వర్క్ మ్యాక్సీ డ్రెస్ అని పిలుస్తారు. దీని ధర అక్షరాలా రూ.18,675. ఈ ధర అంబానీలకు చాలా తక్కువనే చెప్పాలి. చూడడటానికి సింపుల్‌గా ఉన్న ఈ మ్యాక్సీ డ్రెస్ ఇంత ఖరీదని తెలిస్తే సామాన్యులు ఆశ్చర్యపోతారు. కానీ అంబానీలకు మాత్రం ఇది చాలా సాధారణ ఖర్చుతో సమానం.

రాధికా మర్చంట్ కొన్న డ్రెస్ ఇదే
రాధికా మర్చంట్ కొన్న డ్రెస్ ఇదే (eu.sandro-paris.com)

రాధిక మర్చంట్ వేసుకున్న స్లీవ్ లెస్ మ్యాక్సీ డ్రెస్ పర్పుల్, పింక్, ఎల్లో, బ్లూ రంగుల్లో ప్యాచ్ వర్క్ డిజైన్ ను కలిగి ఉంది. షర్ట్ స్టైల్ కాలర్ నెక్లైన్, పిన్ స్ట్రిప్ ప్యాటర్న్స్, శరీరంపై బిగించే బటన్, టై నాట్ డీటెయిల్స్, ఫ్లేర్డ్ టైర్డ్ స్కర్ట్, ఎలాస్టెడ్ నడుము, రిలాక్స్డ్ సిల్హౌట్ వంటి లక్షణాలను ఈ డ్రెస్ కలిగి ఉంది. 

ఈ డ్రెస్ కు జోడీగా రాధిక ప్రింటెడ్ డయోర్స్లిప్ ఆన్ చెప్పులు, డైమండ్ హూప్ చెవిపోగులు, ఉంగరంతో సహా తక్కువ యాక్సెసరీలతో ఆమె తయారైంది.   సింపుల్ పోనీటెయిల్ లో తన జుట్టును కట్టుకుని, నో మేకప్ లుక్ లో కూడా ఆమె చాలా అందంగా ఉంది. 

రాధిక, అనంత్ తమ వివాహం తరువాత  విహారయాత్రలను ఆస్వాదిస్తున్నారు. హెర్మెస్ స్టోర్ నుంచి బయటకు వచ్చి ఒలింపిక్ వేదికను సందర్శించి ఓ గేమ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. అనంతరం పారిస్‌లోని తమ హోటల్ బయట నీతా అంబానీ, ముఖేష్ అంబానీలను ఆలింగనం చేసుకున్నారు.

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహం

రాధికా మర్చంట్, అనంత్ అంబానీల వివాహం ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలకు బాలీవుడ్, అంతర్జాతీయ సెలబ్రిటీలు, గ్లోబల్ లీడర్లు, రాజకీయ నాయకులతో సహా పలువురు సెలెబ్రిటీలు హాజరయ్యారు. అతిథుల జాబితాలో షారుఖ్ ఖాన్, కిమ్ కర్దాషియాన్, సల్మాన్ ఖాన్, నరేంద్ర మోడీ, ప్రియాంక చోప్రా, టోనీ బ్లెయిర్, జాన్ సీనా, దీపికా పదుకొణె, బోరిస్ జాన్సన్ ఉన్నారు.

 

టాపిక్