Ram charan Luxury Watch: రామ్ చరణ్ లగ్జరీ వాచ్ చూశారా? దానితో ముంబైలో ఒక ఫ్లాట్ కొనవచ్చు
Ram charan Luxury Watch: టాలీవుడ్ లో విజయవంతమైన హీరోల్లో రామ్ చరణ్ ఒక్కరు ఈయన. ఆస్తులు కూడా తక్కువ ఏమీ కాదు. రామ్ చరణ్ పెట్టుకున్న ఒక వాచీ ఇప్పుడు వైరల్ గా మారింది.

రామ్ చరణ్ తెలుగు టాప్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఆస్తులు విషయంలో కూడా తక్కువేమీ కాదు. రామ్ చరణ్ ఫ్యాషన్ పరంగా కూడా ఒక అడుగు ముందుకే ఉంటారు. ఈ మధ్య ఆయన ధరించిన ఒక వాచ్ ఎంతోమందిని ఆకర్షించింది. అది రోలెక్స్ వాచ్. ఫ్యాషన్ ప్రియులకు ఈ రోలెక్స్ ఓయిస్టర్ పెర్పెచువల్ డే-డేట్ 36 వాచ్ అంటే ఎంతో ఆసక్తి ఉంది. ఎందుకంటే ఇది సాధారణమైన టైమ్ పీస్ కాదు. జిగ్సా పజిల్‌తో డయల్ ఎంతో బాగుంటుంది. అధునాతనమైన కొత్త రూపంతో ఇది ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తుంది.
రామ్ చరణ్ పెట్టుకున్న ఈ వాచ్ వెర్షన్ ఎవెరెస్ గోల్డ్. దీనిలో నీలం, ఎరుపు, నారింజ, ఆకుపచ్చ, పసుపు రంగుల శక్తివంతమైన షేడ్స్ ను కలిగి ఉన్నాయి. డయల్ డిజైను పజిల్‌లాగా అనిపిస్తుంది.
18 క్యారెట్ల అసలైన బంగారంతో దీన్ని తయారు చేశారు. అన్ని చేతివాచీల్లాగా ఇందులో అంకెలు ఉండవు. అంకెలకు బదులు అందమైన ఎమోజీలు ఉంటాయి. ఆ ఎమోజీలు హ్యాపీ (సంతోషం), ఎటెర్నిటీ (శాశ్వతత్వం), గ్రాట్యూటీ (కృతజ్ఞతలు), హోప్ (ఆశ) వంటి వాటిని సూచిస్తాయి.
ఈ వాచీ ధర ఎక్కువ?
ఈ వాచ్ కొనడం అంత సులభం కాదు. కేవలం మన దేశంలో ఉన్న కొందరు కోటీశ్వరుల దగ్గర మాత్రమే ఈ టైమ్ పీస్ ఉంది. దీని ధర రెండు కోట్ల రూపాయలు. రెండు కోట్లతో ముంబైలో చక్కటి అపార్ట్మెంట్ వచ్చేస్తుంది. రెండు కోట్ల రూపాయలతో ఒక కుటుంబం సంతోషంగా జీవితాంతం గడిపేయవచ్చు, ఇలాంటి అధునాతన వాచీలు రామ్ చరణ్ దగ్గర ఎన్నో ఉన్నాయి. కానీ ఈ వాచీ మాత్రం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది.
రామ్ చరణ్ దగ్గర ఖరీదైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. ఏడు కోట్ల విలువ చేసే రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఉంది. ఈ కారును తన తండ్రి చిరంజీవి 60వ పుట్టినరోజుకు బహుమతిగా అందించారు. అలాగే మూడు కోట్ల విలువైన బ్రిటిష్ స్పోర్ట్స్ కారు ఆ స్టోన్ మార్టిన్ v8 వాంటేజ్ కూడా ఉంది.
ముప్పై వాచీలు
రామ్ చరణ్ దగ్గర మరొక ఖరీదైన వాచ్ ఉంది. దీనికి ధర 80 లక్షలు. ఈయన దగ్గర కనీసం 30కి పైగా ఖరీదైన వాచీలు ఉన్నాయని చెప్పుకుంటారు. రామ్ చరణ్ ప్రస్తుతం ఉంటున్న ఇంటి ఖరీదు 30 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇది హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ఉంది. అతి ఖరీదైన బంగ్లాలో ఇది కూడా ఒకటి. ఈ ఇంటిని తరుణ్ తహిల్యాన్ని డిజైన్ చేశారు.
సంబంధిత కథనం