సమ్మర్ స్పెషల్ స్నాక్స్, కీరదోసతో పొంగణాలు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇదిగోండి రెసిపీ!-have you ever tried summer special snacks ponganas with cucumber heres the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  సమ్మర్ స్పెషల్ స్నాక్స్, కీరదోసతో పొంగణాలు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇదిగోండి రెసిపీ!

సమ్మర్ స్పెషల్ స్నాక్స్, కీరదోసతో పొంగణాలు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇదిగోండి రెసిపీ!

Ramya Sri Marka HT Telugu

సమ్మర్ లో స్నాక్స్ ట్రై చేస్తున్న వారికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. అటు చలవదనంతో పాటు ఆరోగ్యంగా, రుచికరంగా కూడా ఉండే కీరదోస పొంగణాలు అందరికీ కచ్చితంగా నచ్చే వంటకం. దీని కోసం ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా సింపుల్‌గా రెడీ అయిపోయే వంటకాన్ని ట్రై చేయాలంటే, ఇలా చేయండి.

కీరదోసతో పొంగణాలు తయారుచేయడమెలా

కీరదోస వేసవి కాలంలో చలువదనం అందించే ఆహారపదార్థాలలో తక్కువ రేటులో దొరికే కూరగాయల్లో ఒకటి. చాలా మంది దీనిని ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పుతో కలిపి తింటుంటారు. అది కొందరికి నచ్చదు. అలాంటి వారిలో మీరూ ఒకరైతే, డైరెక్ట్‌గా తినకుండా ఇలా వంటకంలా తయారుచేసుకుని ఎంజాయ్ చేయండి. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించేలా స్పైసీగా, డెలిషియస్‌గా అనిపిస్తుంది. మరింకెందుకు ఆలస్యం, ఆరోగ్యకరమైన కీరదోసతో పొంగణాలు ఎలా తయారుచేయాలో, దానికి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దామా..

కీరదోస పొంగణాలకు కావలసిన పదార్థాలు:

  • కీరదోస – 1 మీడియం సైజులో ఉండేది (సన్నగా తరిగి ఉంచండి)
  • బేసన్ (సెనగపిండి) – 1/2 కప్పు
  • బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్లు (క్రిస్పీగా రావడానికీ)
  • ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
  • పచ్చిమిరపకాయలు – 2 (సన్నగా తరిగినవి)
  • కరివేపాకు, కొత్తిమీర – కొద్దిగా (సన్నగా తరిగి వేయాలి)
  • జీలకర్ర – 1/2 టీస్పూన్
  • మిర్చిపొడి – 1/2 టీస్పూన్ (అవసరమైతే)
  • ఉప్పు – రుచికి తగినంత
  • నూనె – తక్కువ (ఫ్ఱై చేయడానికి సరిపడినంత)

కీరదోస పొంగణాల తయారీ విధానం:

  1. ముందుగా కీరదోసను తీసుకుని దానిపై తోలును తీసేయాలి.
  2. ఆ తర్వాత కాయను మధ్యలోకి కోసి అందులో ఉండే విత్తనాలను వేరు చేయాలి.
  3. ఇప్పుడు కీరదోసను చిన్న చిన్న ముక్కలుగా (చిన్నగా తరిగి) ఉంచుకోవాలి.
  4. ఇది జ్యూసీ కూరగాయ కాబట్టి, నీరు ఎక్కువగా ఉండకుండా జాగ్రత్తపడండి.
  5. నీరు పూర్తిగా పోయేంత సమయం లేదనుకుంటే కీరదోస తరిగిన తర్వాత గుడ్డలో వేసి పిండి నీరు మొత్తం పోయేలా చేయవచ్చు.
  6. ఇప్పుడు ఆ కీరదోస ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, మిర్చిపొడి, ఉప్పు వేసి కలుపుకోండి.
  7. ఆ తర్వాత అదే గిన్నెలో సెనగపిండి, బొంబాయి రవ్వ వేసుకుని బాగా కలపండి.
  8. నీళ్లు చాలా తక్కువగా అంటే, కేవలం మిశ్రమం కలిసేంత మాత్రమే పోసుకోవాలి. మిశ్రమం మృదువుగా, ఉండలుగా చేసుకోగలిగేట్టు ఉండాలి.
  9. అలా చేసిన ఉండలను ఒక ప్లేటులో వేసి వేయించుకునేందుకు సిద్ధంగా ఉంచుకోండి.
  10. ఇప్పుడు నాన్‌స్టిక్ పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక, తక్కువ మంట మీద ఉండలను చిన్న చిన్న పొంగణాల మాదిరిగా ఒత్తుకుని నూనెలో వేయండి.
  11. ఆ పొంగణాలు రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు కాల్చాలి.
  12. అంతే, కీరదోస పొంగణాలు రెడీ అయిపోయినట్లే. వాటిని గ్రీన్ చట్నీ, టొమాటో సాస్ లేదా పెరుగు డిప్‌తో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి.
  13. టీ టైంకి ఇది మంచి స్నాక్.

కీరదోస పొంగణాలతో లాభాలు:

  • కీరదోస చల్లదనాన్ని ఇస్తుంది, వేసవిలో వేడి తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది.
  • తక్కువ నూనెతో చేస్తే ఆరోగ్యానికి హాని లేకుండా తినవచ్చు.
  • సెనగపిండి, బొంబాయి రవ్వ వల్ల కొంత ప్రొటీన్ + ఫైబర్ లభిస్తుంది.
  • చిన్న పిల్లలు కూడా తినదగిన రుచితో ఉంటుంది.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం