Diabetes: డయాబెటిస్ ఉందా? మీ గుండెను ఇలా రక్షించుకోండి, లేకుంటే ప్రమాదం
Diabetes: డయాబెటిస్ ఉన్నవారు గుండె విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి గుండె సమస్యలు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఎలాంటి పనులు చేయకూడదో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. డయాబెటిస్ ఉన్న వారు గుండె కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు డయాబెటిస్ ఉంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో తెలుసుకోండి.
శరీర బరువు
అధిక శరీర బరువు, ముఖ్యంగా మీ పొత్తికడుపు చుట్టూ ఉన్న అదనపు కొవ్వు మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతారు. మీరు మీ బరువులో 5 నుండి 10 శాతం తగ్గితే మీ గుండె ప్రమాదం తగ్గుతుంది. మీ గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో ఉంటుంది.
రోజూ వ్యాయామం
ప్రతిరోజూ వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది. రోజులో అరగంట పాటూ వాకింగ్ నుంచి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. రక్తపోటును తగ్గించుకోవాలనుకున్నా, బరువు తగ్గాలన్న వ్యాయామాన్ని దినచర్యగా మార్చుకోవాలి. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని కూడా పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి ప్రతిరోజూ అరగంటపాటూ వ్యాయామం చేయడం దినచర్యగా చేసుకోండి. అది నడక లేదా స్విమ్మింగ్ కావచ్చు.
ఆరోగ్యకరమైన ఆహారం
తృణధాన్యాలు, ప్రోటీన్లు, తాజా పండ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, గింజలు, ఆలివ్ ఆయిల్ మొదలైనవి తినండి. సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్, సోడియం, చక్కెర వంటివి ఆరోగ్యానికి ప్రమాదకారులుగా మారుతాయి. మంచి ఆరోగ్యం, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి.
ఒత్తిడిని తగ్గిస్తుంది
గుండె ఆరోగ్యానికి భంగం కలిగించడంలో ఒత్తిడి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు వ్యతిరేకంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి, మీరు ధ్యానం, శ్వాస వ్యాయామాలు, యోగా వంటి ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించే వాటిని ప్రాక్టీసు చేయాలి. ఇది మీ మనస్సు, శరీరం రెండూ బాగా పనిచేయడానికి సహాయపడుతుంది.
బ్లడ్ షుగర్ స్థాయిలు
బ్లడ్ షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవడం వల్ల రక్తనాళాలు దెబ్బతినకుండా నివారిస్తుంది. తద్వారా గుండె జబ్బులు, గుండె సమస్యలను నివారిస్తుంది.
ధూమపానం మానేయండి
ధూమపానం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. దీనితో పాటు, మీకు డయాబెటిస్ కూడా ఉంటే, ఇది మరింత నష్టాన్ని కలిగిస్తుంది. మీరు ధూమపానం మానేసినప్పుడు అది మీ శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. మొత్తం గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.
తక్కువ రక్తపోటు
డయాబెటిస్ ఉన్నవారికి తరచుగా అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉంటాయి. కాబట్టి మీరు సరైన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకుని అవసరమైన మందులు తీసుకోవాలి. కొన్ని జీవనశైలి మార్పులు కూడా మీ శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. మీ గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
రెగ్యులర్ మెడికల్ చెకప్స్
డయాబెటిస్ ఉన్నవారు గుండె జబ్బులును అదుపులో ఉంచుకోవడానికి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. ఎప్పటికప్పుడు మెడికల్ చెకప్స్ చేయించుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటు, లిపిడ్ ప్రొఫైల్, కొవ్వు స్థాయిలు ఎలా ఉన్నాయో చెక్ చేయించుకుంటూ ఉండాలి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
కాబట్టి దీర్ఘకాలిక లేదా తీవ్రమైన సమస్యలకు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.అందువల్ల మీ శరీర రకాన్ని బట్టి అవసరమైన సమస్యలకు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.ఇవన్నీ ప్రథమ చికిత్స వంటి వాటికి సహాయపడతాయి.ఇక్కడ ఇచ్చిన వైద్య సూచనలను పాటించండి.
సంబంధిత కథనం