Harmful Kiss: ఆ ఒక్క ముద్దు వల్ల శ్వాసకోశ వ్యాధి నుంచి ప్రాణాంతక జబ్బు క్యాన్సర్ వచ్చే ప్రమాదముందట! అదెలా అంటారా?
Harmful Kiss: ప్రేమను వ్యక్తపరచడానికి ప్రస్తుత జనరేషన్‌లో లిప్ టు లిప్ కిస్ చేయడం సర్వ సాధారణం అయిపోయింది. కానీ, ఈ ముద్దు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధికి కూడా కారణమవుతుందట. ఇది లవర్స్ యే కాదు, దంపతులు కూడా తెలుసుకోవాల్సిన విషయం. రండి మరి తెలుసుకుందాం.

ప్రేమను దాదాపు అందరూ ముద్దు ద్వారానే వ్యక్తీకరిస్తారు. ఎదుటి మనిషిపై ప్రేమను ముద్దు పెట్టే గాఢతను బట్టి పసిగడతారు కూడా. అందుకే ప్రేమికుల మధ్య ముద్దుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అంతెందుకు చరిత్రలో చూసినా ఒక్క ముద్దు కోసం రాజ్యాలు రాసిచ్చిన రాజులున్నారు. ముద్దు ప్రాముఖ్యత అలాంటిది. దేనికైనా పాజిటివ్ ఎఫెక్ట్ ఉన్నట్లే, నెగెటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా. అలానే ముద్దు కూడా ప్రాణం కంటే ఎక్కువ అనే ప్రేమను తెలియజేయడమే కాదు, ప్రాణాలను తీసే సమస్యను కూడా కలుగజేస్తుంది. అవును ఇది నిజమే. కొన్ని సందర్భాల్లో ముద్దు పెట్టుకోవడం ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాదు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను కూడా కలిగిస్తుందట.
ముద్దు ఆరోగ్యానికి ఎలా హానికరమో తెలుసుకుందామా...
శ్వాసకోశ వైరస్‌లు, జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ వ్యాధులు సోకిన వ్యక్తి నుంచి జలుబు, ఫ్లూ వంటి వైరస్ వెంటనే వ్యాప్తి చెందుతాయి. అటువంటి వ్యక్తుల వల్ల కొద్ది గంటల్లోనే అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది.
చిగుళ్ల వ్యాధి
ముద్దు ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల్లో చిగుళ్ల వ్యాధి కూడా ఒకటి. చాలా మంది ఈ విషయాన్ని ఒప్పుకోరు. కానీ, ఎవరైతే డీప్ కిస్ ను ఎంజాయ్ చేసిన వాళ్లుంటే వాళ్లకు మాత్రమే ఈ విషయం అర్థం అవుతుంది. డీప్‌గా ముద్దు పెట్టుకున్నప్పుడు, చిగుళ్ళను దెబ్బతీసే బ్యాక్టీరియా బదిలీ అవుతుందట. ఈ బ్యాక్టీరియా దంతాలు, చిగుళ్ళలోకి కూడా ప్రవేశిస్తుందట. అందుకే మీరు ముద్దు పెట్టుకునే ఆలోచనలో ఉంటే, ముందుగా నోరు శుభ్రం చేసుకోండి. ముద్దు తర్వాత కూడా శుభ్రం చేసుకోవడం వల్ల బ్యాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉండకపోవచ్చు.
గొంతు క్యాన్సర్
గాఢమైన ముద్దులతో వచ్చే మరో సమస్య గొంతు క్యాన్సర్. పెదాలను చుంబించే సమయం కాస్త ఎక్కువై గాఢమైన ముద్దుల వరకు వెళ్లినప్పుడు ఒకరి నుంచి ఒకరికి సెలైవా బదిలీ అవుతుంది. ఒక వ్యక్తి చాలా మందితో ఓరల్ సెక్స్ చేస్తే, అతని గొంతు లేదా నాలుకపై హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఉండిపోతుంది. అలాంటి వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం వల్ల ఆ వైరస్ బదిలీ అయి గొంతు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
మెనింజైటిస్
ముద్దు ద్వారా వ్యాప్తి చెందే ప్రధాన బ్యాక్టీరియా మెనింజైటిస్. దీని వ్యాప్తి కారణంగా జ్వరం, తలనొప్పి, మెడ బిగుసుకుపోవడం వంటి సమస్యలు కనిపిస్తుంటాయి.
సిఫిలిస్ వైరస్
ఒక వ్యక్తి చాలా మందితో లైంగిక సంబంధం పెట్టుకుని ఉంటే వారిలో సిఫిలిస్ వైరస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం వల్ల ప్రమాదకరమైన వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది.
హెర్పెస్
హెర్పెస్ సమస్య ముద్దు ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. దీనివల్ల జలుబు, నోటి చుట్టూ పుండ్లు వచ్చే సమస్య ఉంటుంది.
ఇన్ఫ్లుయెంజా
ఇన్ఫ్లుయెంజా వైరస్కు కారణం ఏమిటంటే, ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉన్న వ్యక్తులు ఎవరైనా వారి లాలాజలం లేదా శ్లేష్మంతో ఇతరులను ముద్దుపెట్టుకుని ఉంటే వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ కారణంగా గొంతు బొంగురుపోవడం, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, జలుబు, తలనొప్పి, జ్వరం, కళ్లమంట, ఒళ్లునొప్పులు, సైనస్, కళ్లు, చెవి ఇన్ఫెక్షన్లు, కఫం, పొడి దగ్గు వంటి సమస్యలు కలుగుతాయి.
సంబంధిత కథనం