Valentine's Day Wishes: ప్రేమికుల రోజున మీ ప్రియమైన వారిని ఇలా ప్రేమగా విష్ చేయండి.. ఇవిగో ఫేమస్ కవితలు!-happy valentines day 2025 wishes greetings facebook messages whatsapp status ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Valentine's Day Wishes: ప్రేమికుల రోజున మీ ప్రియమైన వారిని ఇలా ప్రేమగా విష్ చేయండి.. ఇవిగో ఫేమస్ కవితలు!

Valentine's Day Wishes: ప్రేమికుల రోజున మీ ప్రియమైన వారిని ఇలా ప్రేమగా విష్ చేయండి.. ఇవిగో ఫేమస్ కవితలు!

Ramya Sri Marka HT Telugu
Published Feb 13, 2025 12:00 PM IST

Valentine's Day Wishes: ప్రేమను ప్రతిసారి చేతల్లో మాత్రమే చూపించడం కాదు.. మాటల్లో చెప్పడం కూడా చాలా ముఖ్యం. మీర ముఖ్యంగా ప్రేమికుల రోజున మీ ప్రియమైన వారిని ప్రేమగా విష్ చేయడం మర్చిపోకండి. ఇవిగో ఇక్కడ కొన్ని ఫేమస్ కవితలను మీకోసం తీసుకొచ్చాం.

ప్రేమికుల రోజున మీ ప్రియమైన వారిని ఇలా ప్రేమగా విష్ చేయండి.. ఇవిగో ఫేమస్ కవితలు!
ప్రేమికుల రోజున మీ ప్రియమైన వారిని ఇలా ప్రేమగా విష్ చేయండి.. ఇవిగో ఫేమస్ కవితలు!

ప్రపంచమంతా వాలెంటైన్స్ వీక్ జరుపుకుంటుంది. మరి మీ ప్రియతమమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి రెడీ అయిపోయారా..? ఎటువంటి గిఫ్ట్‌ ఇవ్వాలనుకున్నా సరే, ప్రత్యేకమైన మెసేజ్ లేకుంటే అది పరిపూర్ణం కాదు. అందుకే ప్రేమతో కూడిన కవితలను మీ ముందుంచుతున్నాం. మీ ప్రత్యేకమైన మెసేజ్ లో ఈ కవితలను జత చేసి పంపేయండి. హ్యాపీ వ్యాలెంటైన్స్ డే అని చెప్పి, మీ ప్రేయసి/ప్రియుడి మనసుగెలుచుకోండి.

  1. ఎవరూ లేని ఆ ప్రదేశంలో ఏకాంతంగా ప్రయాణిద్దాం,

ఎవరికీ తెలియని భాషను మనం మాత్రమే మాట్లాడుకుందాం.

గోడలు లేని ఇంట్లో, తలుపులు లేని మనసులతో తియ్యటి బాసలు చేసుకుందాం

కాపలా ఎవరూ వద్దు, పొరుగువారితో అస్సలు పనిలేదు

జబ్బు వస్తే పట్టించుకునే వాడు లేకున్నా,

ప్రాణం పోయిందని దిగులు చెందే మనిషే అవసర్లేకుండా బతికేద్దాం

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ప్రియతమా!

_ గాలిబ్ కవితకు అనువాదం

2. మద్యం ఇవ్వలేని మత్తు నీ ప్రేమలో చూశా

పద్యం పలకలేని భావం నీ కళ్లలో చూశా

సేద్యం తెలియని మనసులో నీ గురించి కొత్త కలలను చూశా

హ్యాపీ వాలెంటైన్స్ డే మై లవ్!

3. నువ్వు లేకుండా నవ్వలేను

నువ్వు లేకుండా తినలేను

నువ్వు లేకుండా పలకలేను

నువ్వు లేకుండా బతకలేను

ఒక్కసారి సమ్మతించు

ఈ జన్మంతా నీకు దాసుడినై పోతా

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ప్రియా!

4. నీ కోసం ఎదురుచూడటమే తప్పు

నిన్ను కలవడమే తప్పు

నీతో మాట్లాడటమే తప్పు

నీతో కలిసి కలలు కనడమే తప్పు

ఇవన్నీ అబద్దాలైతే బాగుండు,

ఈ సమస్యలేమీ మన మధ్యలోకి రాకుండు

హ్యాపీ వాలెంటైన్స్ డే మై లవ్!

5. నీ వియోగమే నరకం

నీ సమీపమే సువాసన భరితం

జన్మజన్మల నా ప్రేమ నీ సొంతం

అడిగితే ఇచ్చైనా నా తనువును ఆసాంతం

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ప్రియతమా!

6. 7నా చూపులను తప్పించుకోవచ్చు

నా మనస్సును కాదు

నా మాటలతో భ్రమ కలిగించవచ్చు

నీ కళ్లతో కాదు

ఇప్పటికి మౌనంగా ఊరుకోవచ్చు

రేపటికి కాదు హ్యాపీ వాలెంటైన్స్ డే మై లవ్!

7. పున్నమి రాతిరి వెన్నెల వెలుగుల్లో..

నిశి రాతిరి చీకట్లలో..

మిట్ట మధ్యాహ్నాపు వెలుగుల్లో..

సంధ్యా సమయపు కిరణాల్లో...

క్షణమేదైనా.. ధ్యాసంతా నీ మీదనే

చోటేదైనా.. ప్రేమంతా నీ కోసమే

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ప్రియా!

8. ప్రపంచంలో ఒక్క మనిషి నా కోసం ఉండాలి

ఆ ప్రపంచమే తనదైపోవాలి

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ప్రియతమా!

9. ప్రతి క్షణం నీతో ఉండాలి

ప్రతి క్షణంలోనువ్వుండాలి

హ్యాపీ వాలెంటైన్స్ డే మై లవ్!

10. నా మనసులోని మాటలను నీతో చెప్పడానికి ఈ ఒక్క రోజు మాత్రమే సరిపోదు,

నా ప్రేమను నీకు చూపించడానికి ఈ జన్మంతా కావాలి,

ప్రతిరోజూ ప్రతిక్షణం నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను,

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ప్రియతమా!

11. నిన్ను కలిసేంత వరకూ ప్రేమికుల రోజును నేను ఎప్పుడూ ఇష్టపడలేదు,

నిన్ను కలిసిన తర్వాత నుంచీ ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నాను,

ఈ రోజును నేను ఎప్పుడూ మరిచిపోలేను

హ్యాపీ వాలెంటైన్స్ డే మై లవ్!

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం