Thanksgiving 2023: ఈ రోజు మీ స్పెషల్ థ్యాంక్స్ ఎవరికి చెప్తున్నారు? థ్యాంక్స్ గీవింగ్ డే ఈరోజే..-happy thanksgiving 2023 know best wishes images messages whatsapp status quotes ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Happy Thanksgiving 2023, Know Best Wishes, Images, Messages, Whatsapp Status, Quotes

Thanksgiving 2023: ఈ రోజు మీ స్పెషల్ థ్యాంక్స్ ఎవరికి చెప్తున్నారు? థ్యాంక్స్ గీవింగ్ డే ఈరోజే..

Koutik Pranaya Sree HT Telugu
Nov 23, 2023 11:19 AM IST

Happy Thanksgiving 2023: నవంబర్ 23 వ తేదీన థ్యాంక్స్ గీవింగ్ డే జరుపుకుంటారు. ఈ రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు కొన్ని మెసేజీలు, ఫొటోలు మీకోసం ఇక్కడ ఇస్తున్నాం.

హ్యాపీ థ్యాంక్స్ గీవింగ్ డే 2023
హ్యాపీ థ్యాంక్స్ గీవింగ్ డే 2023 (HT Photo)

Thanksgiving 2023: ఈ సంవత్సరం థ్యాంక్స్ గీవింగ్ నవంబర్ 23, గురువారం రోజున జరుపుకుంటున్నారు.ఈ రోజున కుటుంబ సభ్యులు, స్నేహితులంతా ఒక్కచోట చేరి వేడుకలా జరుపుకుంటారు. రుచికరమైన విందులు, డ్రింకులు, సినిమాలతో హడావుడిగా ఉంటుందంతా. ఈ రోజున మన చుట్టూ ఉన్నవాళ్లకి కృతజ్ఞతలు చెప్పుకోవడం కూడా వేడుకలో భాగమే. ప్రియమైన వారికి లేదా అపరిచితులకు ఎలాంటి సహాయం లేదా సహకారం అందించినందుకు ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు ఈరోజు చెప్పవచ్చు. మీకిష్టమైన వాళ్లకి, స్నేహితులకి, కుటుంబ సభ్యులకు మీ థ్యాంక్స్ గీవింగ్ శుభాకాంక్షలు ఈ కింది ఫొటోలు, మెసేజీల ద్వారా తెలియజేయండి.

ట్రెండింగ్ వార్తలు

మీకూ మీకిష్టమైన వాళ్లకి హ్యాపీ థ్యాంక్స్ గీవింగ్ 2023
మీకూ మీకిష్టమైన వాళ్లకి హ్యాపీ థ్యాంక్స్ గీవింగ్ 2023 (HT Photo)

థ్యాంక్స్ గీవింగ్ 2023 విషెస్:

ఈ థ్యాంక్స్ గీవింగ్ సందర్భంగా, మనమంతా కలిసి ఒకరికొకరం ప్రేమను చాటుకుందాం.. మంచి జీవితం దొరికినందుకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. మీకూ, మీకిష్టమైన వాళ్లకి హ్యాపీ థ్యాంక్స్ గీవింగ్ డే.

ఏటా నవంబర్ లో నాల్గవ గురువారాన్ని థ్యాంక్స్ గీవింగ్ డే గా జరుపుకుంటారు.
ఏటా నవంబర్ లో నాల్గవ గురువారాన్ని థ్యాంక్స్ గీవింగ్ డే గా జరుపుకుంటారు. (HT Photo)

మీకూ మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ థ్యాంక్స్ గీవింగ్ డే. మీ ఆరోగ్యం ఎప్పుడూ బాగుండాలనే, అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను.

ఈ ప్రపంచంలో నీ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. నా జీవితంలో ఆనందం, వెలుగు అన్నీ నువ్వే. హ్యాపీ థ్యాంక్స్ గీవింగ్ డే.

ఈ సంవత్సరం నవంబర్ 23 న థ్యాంక్స్ గీవింగ్ డే జరుపుకుంటున్నారు
ఈ సంవత్సరం నవంబర్ 23 న థ్యాంక్స్ గీవింగ్ డే జరుపుకుంటున్నారు (HT Photo)

నాకున్న మంచి ఆరోగ్యానికి, నాకు శ్వాసను అందిస్తున్నా నా ఊపిరితిత్తులకు, నిరంతరం కొట్టుకుంటూ నన్ను కాపాడుతున్న నా గుండెకు, నా పూర్తి శరీరానికి నేను కృతజ్ఞుడను. హ్యాపీ థ్యాంక్స్ గీవింగ్.

ఈ రోజు కలుసుకుని సాంప్రదాయ వంటలతో వేడుకలా చేసుకుందాం. ఈ రోజును అందమైన అనుభూతిగా మార్చేద్దాం. హ్యాపీ థ్యాంక్స్ గీవింగ్ డే.

ఈ రోజును కుటుంబం, స్నేహితులు కలుసుకుని వేడుకలా జరుపుకుంటారు.
ఈ రోజును కుటుంబం, స్నేహితులు కలుసుకుని వేడుకలా జరుపుకుంటారు. (HT Photo)

నువ్వు నాకోసం చేసిన ప్రతి పనికీ, నువ్వు నా జీవితంలో ఉన్నందుకు నీకు థ్యాంక్స్. ఈ రోజు నీతో కలిసి రుచికరమైన విందు ఆరగించేందుకు ఎదురు చూస్తున్నా. హ్యాపీ థ్యాంక్స్ గీవింగ్ డే.

నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటను నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. కానీ వాటిలో అత్యంత ముఖ్యమైన సంఘటన నువ్వు నాకు దొరకడమే. హ్యాపీ థ్యాంక్స్ గీవింగ్.

ఈ థ్యాంక్స్ గీవింగ్ రోజు చాలా మంది కుటుంబ సభ్యులను కలుస్తారు. కొంతమంది బయట స్నేహితులతో వేడుకలా జరుపుకుంటారు.
ఈ థ్యాంక్స్ గీవింగ్ రోజు చాలా మంది కుటుంబ సభ్యులను కలుస్తారు. కొంతమంది బయట స్నేహితులతో వేడుకలా జరుపుకుంటారు. (HT Photo)

ప్రియమైన వాళ్లందరినీ ఒక్కచోటకి చేర్చే ఈ థ్యాంక్స్ గీవింగ్ డే అంటే నాకు చాలా ఇష్టం. ఈ రోజు నీతో సమయం గడిపే అవకాశం దొరకబోతున్నందుకు ఆనందంగా ఉంది. హ్యాపీ థ్యాంక్స్ గీవింగ్.

థ్యాంక్స్ గీవింగ్ మెసేజీలు
థ్యాంక్స్ గీవింగ్ మెసేజీలు (HT Photo)

మిఠాయి తియ్యదనం కన్నా నేను మీతో గడిపిన క్షణాలే మధురమైనవి. మీ అందరినీ నేనప్పటికీ మర్చిపోను. హ్యాపీ థ్యాంక్స్ గీవింగ్ డే.

WhatsApp channel

టాపిక్