Propose Day 2023। మీ ప్రేమను ప్రపోజ్ చేయాలా? ఇవిగో కొన్ని సరదా ప్రేమ ప్రతిపాదనలు, జోకులు!
Propose Day 2023: ప్రేమికుల వారం వరుసలో ఫిబ్రవరి 8 ప్రపోజ్ డే. మీరు ఫన్నీగా ప్రేమను వ్యక్తీకరించేందుకు ఇక్కడ కొన్ని జోక్స్, కొటేషన్లు ఉన్నాయి చూడండి.
Propose Day 2023: మీరు ప్రేమించే వ్యక్తికి మీ మనసులోని మాటను చెప్పేయాలనుకుంటున్నారా? మీలో సగంగా, మీ జీవిత భాగస్వామిగా పొందాలనుకుంటున్నారా? అయితే ఎందుకింక ఆలస్యం? వెంటనే చెప్పేయండి. వాలెంటైన్స్ వీక్‌లోని రెండవ రోజును ఫిబ్రవరి 8న ప్రపోజ్ డేగా జరుపుకుంటారు. మీ మనసులోని భావాలను మీకు ప్రియమైన వ్యక్తి వద్ద ప్రతిపాదించడానికి ఉద్దేశించిన రోజు ఇది.

ప్రేమను వ్యక్తం చేయాలంటే ధైర్యం ఉండాలి, లేదా ప్రేమలేఖ రాసేంత సాహిత్య సంపత్తి ఉండాలి, కవితల రూపంలా చెప్పేందుకు కవిత్వం తెలిసి ఉండాలి, లేదా కూసింత హాస్యం అయినా ఉండాలి. నిజానికి మీలో ఇవేవి లేకపోయినా గుండెల నిండా ప్రేమ ఉంటే, మీ ప్రేమ నిజమే అయితే మీరు ప్రేమలో ఓడిపోరు.
ప్రేమను వ్యక్తీకరించే సమయంలో ప్రపోజ్ చేసే వ్యక్తులు కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు, తనకు ప్రపోజ్ చేస్తారా లేదా అని వారిలో కూడా ఒత్తిడి ఉండవచ్చు. అయితే మిమ్మల్ని రిలాక్స్ చేసేందుకు, మీలోని ఒత్తిడి, భయాలను తొలగించి మీరు హాయిగా నవ్వుకునేలా చేసే కొన్ని ప్రేమ జోకులు, ప్రేమ కవితలు, సరదా ప్రేమ ప్రతిపాదనలు Propose Day Funny Quotes, Proposal Ideas, Love Jokes, Viral Memes ఇక్కడ కొన్ని అందిస్తున్నాం, వీటిని మీకు నచ్చిన వారికి షేర్ చేయండి, కాసేపు హాయిగా నవ్వుకోండి.
Propose Day- Funny Proposals- ప్రపోజ్ డే కోసం సరదా ప్రతిపాదనలు
ఒక్క మాటతో పెళ్లి పెటాకులు కావచ్చు, కానీ ఇక్కడ ఇచ్చే జోకులు చెప్తే మీ ప్రేమ పటాసులా పేలవచ్చు.
1. ప్రియా నువ్వు రాసుకోవడానికి నేను పౌడర్ అవుతా
గీసుకోవడానికి కళ్లకు కాటుకనవుతా
వేసుకోవడానికి కాళ్ల కింద చెప్పునవుతా
నువ్వు ఎత్తుకోవడానికి పిచ్చి కుక్క పిల్లనవుతా
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?
2. నువ్వు ఔనన్నా.. కాదన్నా, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా, చేసుకోకున్నా నా జీవితాంతం నీతోనే గడుపుతాను-- ఊ అంటావా ఊఊ అంటావా?
3. రమేష్: చూడు కల్పన నేను ఆ కార్తీక్ లాగా అందగాడ్ని కాకపోవచ్చు, ఆ కార్తీక్ లాగా నా దగ్గర కార్లు, బంగళాలు లేవు, కార్తీక్ లాగా నేను పెద్దగా చదువుకోలేదు, కార్తీక్ లాగా నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నా కల్పనా, నువ్వు ఏమంటావు?
కల్పన: నేను నిన్ను ప్రేమిస్తున్నాను రమేష్.. కానీ ఆ కార్తీక్ ఫోన్ నెంబర్ చెప్తావా?
4. సృజన తిన్నవారా? ఏంట్రా నన్ను వదిలేస్తున్నావా? నన్ను ప్రేమించడం లేదా? నీgfxgfsx టూ......
5. ప్రేమించి, లేచిపోయి పెళ్లి చేసుకున్న వారు కాదురా నిజమైన ప్రేమికులు అంటే.. పెళ్లయ్యాక లేచిపోయిన వారే నిజమైన ప్రేమికులు
అయితే ఒక్కమాట ఇక్కడ అందించిన ఈ జోక్స్ ప్రేమను అపహాస్యం చేసే ఉద్దేశం కాదు. కేవలం మీరు నవ్వుకోవడానికి మాత్రమే. ఈ ప్రపోజ్ డే రోజున అందరి ప్రేమ సఫలం కావాలని కోరుకుందాం.
సంబంధిత కథనం