Happy New Year : నా నీడలా నాతో ఉండే నీకు హ్యాపీ న్యూ ఇయర్.. ప్రియమైన వారికి ఇలా విష్ చెప్పండి
Happy New Year Wishes To Girl Friend : కొత్త సంవత్సరంలో మన ప్రియమైన వారితో ఉంటే ఆ ఆనందమే వేరు. కొత్త ఆశలతో కొత్త ఏడాదిలోకి సంతోషంగా అడుపెట్టేయెుచ్చు. అలాంటి వారికి ప్రత్యేకంగా విషెస్ చెప్పండి. మీకోసం HT Telugu అందిస్తున్న కొన్ని కోట్స్ ఇక్కడ ఉన్నాయి.
2023 చివరిలో ఉన్నాం. 2024 కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ఎదురుచూస్తున్నాం. నూతన సంవత్సరం రోజుల చాలా మందికి విష్ చేస్తూ ఉంటాం. కానీ మనం స్పెషల్‌గా శుభాకాంక్షలు చెప్పే ప్రత్యేకమైన వ్యక్తి మాత్రం ఒక్కరు ఉంటారు. వారికి విష్ చేసేందుకు ఏడది అంతా ఎదురుచూస్తాం. మరి అలాంటి వారికి ఎంత ప్రేమతో విష్ చేస్తే అంత బెటర్.

గతంలో అయితే గ్రీటింగ్ కార్డులు రాసి వ్యక్తిగతంగా అందించడంతోపాటు లేఖల ద్వారా విష్ చేసేవారు. కానీ నేడు మనం టెక్నాలజీ ప్రపంచంలో స్మార్ట్ లైఫ్ గడుపుతున్నాం. ఒక్క సందేశం చాలు.. మనలోని ఆలోచనలను ఇతరులకు చెప్పేందుకు. మీరు చెప్పే శుభాకాంక్షలు ఏడదంతా గుర్తుండేలా ఉండాలి. మీ ఆలోచనలను మీ ప్రియమైన వారు చదివినప్పుడు మళ్లీ మళ్లీ మీతో ప్రేమలో పడిపోవాలి. అలాంటి విషెస్ మీకోసం..
ఆశలు లేని నా జీవితంలో కొత్త కాంతులు తీసుకొచ్చిన నీకు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు
నా గతం ఏదైనా.. భవిష్యత్ మాత్రం నీతోనే.. హ్యాపీ న్యూ ఇయర్
గతం చెప్పేందుకు రెండే అక్షరాలు.. కానీ మోయలేనంత ప్రేమను ఇచ్చింది.. ఈ 2024 కూడా అంతే ప్రేమను ఇవ్వాలని కోరుకుంటున్నా.. happy new year
నీతో జ్ఞాపకాలు చెడ్డవైనా.. మంచివైనా మోయాలనిపిస్తుంది.. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయం కంటిన్యూ చేస్తా.. కొత్త సంవత్సర శుభాకాంక్షలు..
నువ్ పరిచయం కాకముందే ప్రతీ సంవత్సరం పాత సంవత్సరమే.. నీ పరిచయంతో ప్రతిరోజూ కొత్త సంవత్సరమే.. హ్యాపీ న్యూ ఇయర్ మై డియర్
కొత్త ఏడాది వస్తుంటే వయసు పెరుగుతుంది కదా అనుకుంటారు చాలా మంది.. కానీ నేను మాత్రం నా ప్రేమకు అనుభవం పెరుగుతుంది కదా అని మురిసిపోతా.. Happy New Year 2024
నన్ను నాకు కొత్తగా చూపిన నీకు.. కొత్త సంవత్సరంలోకి స్వాగతం..
నేను అనే రెండు అక్షరాలతో మెుదలయ్యా.. నువ్వు అనే రెండు అక్షరాల్లో కలిపి పోవాలనుకుంటున్నా.. హ్యాపీ న్యూ ఇయర్ మై లవ్..
ఈ ప్రపంచానికి 7 వింతలే.. కానీ నాకు నీ పరిచయం మరో వింత.. అందుకే నా 8 వింత నువ్వే.. Happy New Year 2024
కిందటి ఏడాది నీ పరిచయం.. ఈ ఏడాది కావాలి మనకు వివాహం.. హ్యాపీ న్యూ ఇయర్..
ఈ 2024 మెుదటి రోజున 2024 సార్లు నీకు ఐ లవ్ యూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు..
నా జీవితంలో నిన్ను నా ప్రేయసిగా పొందడం నా అదృష్టం. ప్రియతమా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నా నీడలా నాతో ఉండే నీకు.. Happy New Year
నువ్వు నాతో ఉన్నప్పుడు ప్రపంచాన్నే మర్చిపోతాను. నేను ప్రతి సెకను నీతో గడపాలనుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ప్రతి సంవత్సరం కలిసి నూతన సంవత్సరాన్ని జరుపుకొందాం.. ప్రియమైన నీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
సంవత్సరాలు రావచ్చు, పోవచ్చు, కానీ మన ప్రేమ ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నా ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా చేసినందుకు నీకు ధన్యవాదాలు. నిన్ను పువ్వులా చూసుకుంటా.. అదే నా నూతన సంవత్సర తీర్మానం. హ్యాపీ న్యూ ఇయర్.
సంవత్సరం కొత్తదే అయినా, మన బంధం పాతది.. ఇలాగే ప్రతి సంవత్సరం మనం బంధంలో కొత్తగా వేడుక చేసుకోవాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Happy New Year 2024