Happy Navaratri 2022 : మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఇలా మహానవమి విషెష్ చెప్పండి
Happy Navaratri 2022 : నవరాత్రి పండుగ చివరి రోజున.. ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం తొమ్మిదవ రోజున మహా నవమిని జరుపుకుంటారు. ఈరోజు చాలా పవిత్రమైనదిగా చెప్తారు. అయితే మీ ప్రియమైన వారికి మహా నవమి శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి.
Happy Navaratri 2022 : నవరాత్రుల్లో చివరిరోజును మహా నవమిగా జరుపుకుంటారు. చెడుపై మంచి.. ప్రతికూలతపై సానుకూలత సాధించిన విజయానికి గుర్తుగా దుర్గా పూజ చేస్తారు. అయితే నవరాత్రుల్లో చివరిది అయిన మహా నవమి రోజు దుర్గాదేవి రూపం.. అమ్మవారి పరిపూర్ణతను సూచిస్తుంది. ఈ మహా నవమి శుభ సందర్భంగా మీ కుటుంబం, స్నేహితులతో కలిసి పండుగ జరుపుకోండి. కుదరని పక్షంలో వారికి మహానవమి సందేశాలను సోషల్ మీడియా లేదా.. WhatsApp ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి. వారిపై మీ ప్రేమను తెలుపుతూ.. అమ్మవారి ఆశీర్వాదాలు అందజేస్తూ.. ఇలా విష్ చేయండి.
ట్రెండింగ్ వార్తలు
* చెడుపై మంచి గెలిచినట్లు.. మీ జీవితంలోని యుద్ధాలను కూడా సులభంగా ఎదుర్కొనే శక్తిని, బలాన్ని అమ్మవారు నీకు ప్రసాదించాలని కోరుకుంటూ.. నవమి శుభాకాంక్షలు.
* దుర్గా నవమి శుభ సందర్భంగా.. మీ జీవితం శ్రేయస్సు, విజయాలతో నిండిపోవాలని కోరుకుంటున్నాను. మహా నవమి శుభాకాంక్షలు.
* నవరాత్రి మొత్తం ఉపవాసాలు, పూజలు చేసే శక్తిని మాకు అనుగ్రహించినందుకు దుర్గా మాతకు జై. అందరికీ మహా నవమి శుభాకాంక్షలు.
* దుర్గాదేవి ఆశీస్సులతో మీ కోరికలన్నీ నెరవేరతాయి. నవమి శుభాకాంక్షలు.
* ఈ ప్రత్యేక సందర్భంలో పండుగ స్ఫూర్తి మిమ్మల్ని, మీ ప్రియమైన వారికి దగ్గర చేయాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు మహా నవమి శుభాకాంక్షలు.
* జీవితంలో మీకు శక్తిని ఇవ్వడానికి దుర్గా దేవి ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. మీరు అన్ని సవాళ్లను.. ధైర్యంగా ఎదుర్కోవాలని ఆశిస్తూ.. మహానవమి శుభాకాంక్షలు.
* దుర్గమ్మ ఆశీర్వాదం మీపై ఉంటుంది. అదే మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. మీ అన్ని ప్రయత్నాలలో మీకు సహాయం చేస్తుంది. అందరికీ మహా నవమి శుభాకాంక్షలు.
* ఈ పవిత్రమైన మహా నవమి రోజున.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నా శుభాకాంక్షలు. మీకు ఆనందం, అభివృద్ధి రావాలని కోరుకుంటున్నాను.
టాపిక్