Mothers day 2024 Wishes in Telugu: అమ్మ ప్రేమకు ఇవే మా నీరాజనాలు, మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పేందుకు అందమైన కోట్స్ ఇదిగో
Mothers day 2024 Wishes in Telugu: మాతృ దినోత్సవం రోజు తల్లి ప్రేమను అందించిన ప్రతి స్త్రీకి శుభాకాంక్షలు చెప్పవలసిన అవసరం ఉంది. అందుకోసం తెలుగులోనే కొన్ని శుభాకాంక్షలు ఇచ్చాము.
Mothers day 2024 Wishes in Telugu: ఒక్కరోజే కాదు ప్రతిరోజూ మాతృ దినోత్సవం నిర్వహించుకోవాల్సిందే. ఆమె షరతులు లేని ప్రేమ... బిడ్డలకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పుతుంది. ఒక బిడ్డకు అమ్మే తొలి ఉపాధ్యాయురాలు. ఓదార్పును మార్గదర్శకత్వాన్ని విలువలను నేర్పేది అమ్మే. అలాంటి అమ్మకు అందంగా తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి. కేవలం అమ్మకే కాదు, అమ్మ స్థానంలో ఉండి మీ ఉన్నతికి కృషి చేసిన ప్రతి స్త్రీకి శుభాకాంక్షలు చెప్పవలసిన అవసరం ఉంది. ఇక్కడ మేము కొన్ని కోట్స్‌ను తెలుగులో అందించాము. వీటిని ఫోన్లో మెసేజ్‌ల రూపంలో, వాట్సాప్ స్టేటస్‌లుగా, ఫేస్‌బుక్‌లో సందేశాలుగా పెట్టి మీ అమ్మ ప్రేమను చాటుకోండి.

మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుగులో...
1. అమ్మా... నువ్వే నాకు ఈ అందమైన జీవితాన్ని ఇచ్చావు.
దానికి నేను ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను.
నా జీవితంలో నీవు చేసిన ప్రతి పనికి ధన్యవాదాలు.
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
2. నీ షరతులు లేని ప్రేమ
నువ్వు నాపై చూపించిన శ్రద్ధ
విజయవంతమైన మనిషిగా తీర్చిదిద్దాయి.
నేను ఎప్పటికీ నీకు కృతజ్ఞతుడినే
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
3. మన కుటుంబం కోసం
నువ్వు చూపించే ప్రేమ, శ్రద్ధా, త్యాగం కొలవలేనివి.
నా ప్రియమైన అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు.
4. నీ ఆకలిని చంపుకొని మా పొట్టలు నింపావు.
మేము ఏడుస్తుంటే నువ్వు ఏడ్చావు.
మా కోసం బాధను దాచుకొని నవ్వులు పంచావు.
ఏమిచ్చి మేము నీ రుణం తీర్చుకోగలం
హ్యాపీ మదర్స్ డే అమ్మ.
5. నా అందమైన, అద్భుతమైన, ప్రేమ గల తల్లికి
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.
6. నీలాంటి తల్లిని కలిగి ఉన్నందుకు
నేను ఎంతో అదృష్టవంతుడిని.
మీకు మంచి ఆరోగ్యం సిద్ధించాలని కోరుకుంటున్నాను.
మీరు మాతో ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.
హ్యాపీ మదర్స్ డే.
7. ప్రపంచంలో ఉన్న అన్ని ఆనందాలకి అర్హత గల వ్యక్తి అమ్మ.
అలాంటి అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
8. అమ్మ నువ్వే మా కుటుంబానికి గుండె చప్పుడు.
మీ ప్రేమ బలమే మన కుటుంబానికి రక్ష
హ్యాపీ మదర్స్ డే
9. నేను చూసిన అత్యంత బలమైన వ్యక్తి మా అమ్మ.
ఆమె నా దేవత
నా రోల్ మోడల్
హ్యాపీ మదర్స్ డే అమ్మ
10. నాకు జీవితాన్ని ఇచ్చింది అమ్మ
ఎలా జీవించాలో నేర్పించింది అమ్మ
షరతులు లేని ప్రేమను పంచింది అమ్మ
అలాంటి స్త్రీ మూర్తికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను
హ్యాపీ మదర్స్ డే
11. అమ్మా...
మీరు నా జీవితంలో అత్యుత్తమ మహిళ
ఎల్లప్పుడూ నా మనసులో మీది మొదటి స్థానమే
హ్యాపీ మదర్స్ డే
12. అమ్మ మనం కొన్నిసార్లు వాదించుకోవచ్చు, గొడవ పడవచ్చు.
కానీ అవేవీ మీ పట్ల నాకున్న ప్రేమను మార్చవని చెబుతున్నాను.
మీరు ఎల్లప్పుడూ నాకు ఉత్తమ తల్లి.
హ్యాపీ మదర్స్ డే
13. అమ్మ నువ్వు ఒక ప్రత్యేక ప్రపంచం.
ఆ ప్రపంచంలో ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు.
అందుకే నువ్వే నా ప్రపంచం
హ్యాపీ మదర్స్ డే
14. అమ్మ నీ చిరునవ్వుతోనే...
నా ప్రపంచాన్ని అందంగా తీర్చిదిద్దారు
నువ్వు లేకుండా నేను లేను
హ్యాపీ మదర్స్ డే
15. మాతృత్వం అంటే కేవలం జన్మనివ్వడమే కాదు
అపరిమితమైన ప్రేమను పంచడం
జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండడం
ఇలాంటి లక్షణాలు ఉన్న తల్లివి నువ్వు.
హ్యాపీ మదర్స్ డే
16. అమ్మ నువ్వు చేసే ప్రతి పని మా ఆనందం కోసమే
మా ఆనందంలోనే నీ ఆనందాన్ని వెతుక్కున్నావు
నిన్ను జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటానని
ప్రమాణం చేస్తున్నాను
హ్యాపీ మదర్స్ డే
17. నీ ప్రాణాలను పణంగా పెట్టి
నాకు ప్రాణం పోసావు
అందుకే నువ్వే నా దేవత
హ్యాపీ మదర్స్ డే
18. అమ్మంటే ఏంటో తెలపడానికి భాష చాలదు
నాకు మరో జన్మంటూ ఉంటే
నీకు అమ్మగా పుట్టాలని ఉంది
నువ్వు నాకు పెంచిన ప్రేమను నీకు పంచాలని ఉంది
హ్యాపీ మదర్స్ డే
19. అమ్మ గురించి చెప్పమంటే ఏం చెబుతాం?
ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి.
అయినా చెప్పాలన్న కోరిక చావదు
నాకు మరో జన్మంటూ ఉంటే
నీకు అమ్మగా పుట్టి మీరు రుణం తీర్చుకుంటాను అమ్మ
హ్యాపీ మదర్స్ డే
టాపిక్