Happy Independence day 2024: మీ స్నేహితులు, బంధువులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను ఇలా తెలుగులోనే చెప్పండి
Happy Independence Day 2024: భారతీయుడికి స్వాతంత్య్ర దినోత్సవం ఒక ప్రత్యేకమైన పండుగ. ఏ పండుగకు విష్ చేసుకున్నా, చేసుకోకపోయినా… ఇండిపెండెన్స్ డే రోజున మాత్రం కచ్చితంగా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవాలి. ఇక్కడ శుభాకాంక్షలను తెలుగులోనే ఇచ్చాము. వాటిని మెసేజ్‌లు, వాట్సాప్ సందేశాల రూపంలో పంపించండి.
భారతదేశ చరిత్రలో మరపురాని రోజు ఇండిపెండెన్స్ డే. సుదీర్ఘ పోరాటం తర్వాత భారత ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్న రోజు. మన దేశం జెండా పండుగను ఎంతో వైభవంగా నిర్వహించుకుంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఆగస్టు 15న అవతరించింది. మన దేశం దాదాపు రెండు శతాబ్దాల పాటు బ్రిటీషర్ల చెరలోనే మగ్గిపోయింది. మన దేశం వారి అణిచివేత నుండి భారతీయుడి ఆవేశం పుట్టుకొచ్చింది. ఆవేశమే ఆగ్రహ జ్వాలగా మారి చివరకు సిపాయిల తిరుగుబాటుగా క్విట్ ఇండియా ఉద్యమంగా రూపు దాల్చి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టింది. ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్క భారతీయుడు పండుగలా నిర్వహించుకోవాల్సిన రోజు. ఈ రోజున మీ స్నేహితులకు, ప్రియమైన వారికి, బంధువులకు కచ్చితంగా శుభాకాంక్షలు చెప్పాల్సిందే. ఇక్కడ మేము స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుగులోనే ఇచ్చాము. మీకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకొని మీ ప్రియమైన వారికి పంపించండి.
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
1. మన స్వేచ్ఛా స్వాతంత్ర్యం కోసం
అసువులు బాసిన సమరయోధుల
దీక్షాదక్షతలను స్మరిస్తూ
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
2. మాతృభూమి కోసం తన ధన, మాన, ప్రాణాలను
త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలకు
వందనం అభివందనం
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
3. గగన సిగనా ఎగరాలి మన మువ్వన్నెల జెండా
దేశభక్తి ఎదగాలి మన గుండెల నిండా
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
4. భిన్నత్వంలో ఏకత్వమే మన గొప్పతనం
అందుకే మన మాతృభూమి ఎంతో గొప్పది
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
5. స్వేచ్ఛగా ఉండడం అనేది
ప్రపంచంలో అత్యంత అద్భుతమైన విషయం
ఆ స్వేచ్ఛను మనం దేశస్వతంత్రం ద్వారానే పొందాము
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
6. బానిస సంకెళ్లను తెంచి
స్వేచ్ఛా వాయువుల కోసం
వందల ఏళ్లు తెగించి పోరాడిన మన వీరత్వం
భరతమాతకు పట్టం కట్టిన త్యాగధనుల కర్మఫలం
ప్రతి ఒక్కరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
7. ఈ ప్రత్యేకమైన రోజున
మన వీరులను స్మరించుకుందాం
వారి పోరాటాన్ని కొనియాడుదాం
హ్యాపీ ఇండిపెండెన్స్ డే
8. మన స్వాతంత్ర్యం ఎల్లప్పుడూ
ఆనందం, ఐక్యతకు చిహ్నం
హ్యాపీ ఇండిపెండెన్స్ డే
9. ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కిన ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలపరా నీ జాతి నిండు గౌరవము
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
10. దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
నీతీ మనదే జాతీ మనదే
ప్రజల అండ దండా మనదే
హ్యాపీ ఇండిపెండెన్స్ డే
11. అన్ని దేశాల్లోకెల్లా
భారతదేశం మిన్న అని
చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ జరుపుకుందాం
ఈ స్వాతంత్య్రపు పండగను
మీ అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
12. అప్పుడు ఇప్పుడూ
నా దేశం సంపన్న దేశం
జైహింద్
హ్యాపీ ఇండిపెండెన్స్ డే
13. ఓ మువ్వన్నల జెండా
నీ పుట్టుకలో త్యాగం ఉన్నది
నీ పుట్టుకలో శాంతి మంత్రం ఉన్నది
నీ పుట్టుకలో పోరాటం ఉన్నది
నీ పుట్టుకలో సభ్యత ఉన్నది
నీ పుట్టుకలో సంస్కారం ఉన్నది
హ్యాపీ ఇండిపెండెన్స్ డే
14. సమరయోధుల పోరాట బలం
అమరవీరుల త్యాగఫలం
బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం
మన స్వాతంత్య్ర దినోత్సవం
సామ్రాజ్యవాదుల సంకెళ్లను తెంచుకొని
భరతజాతి విముక్తి పొందిన చారిత్రాత్మకమైన రోజు
హ్యాపీ ఇండిపెండెన్స్ డే
15. జాతులు వేరైనా
భాషలు వేరైనా
మనమంతా ఒక్కటే
కులాలు వేరైనా
మతాలు వేరైనా
మనమంతా భారతీయులం
హ్యాపీ ఇండిపెండెన్స్ డే
16. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన
భారత గడ్డమీద పుట్టినందుకు గర్విస్తున్నాను.
ఈ గొప్ప దేశంలో పుట్టి ఎందరో ధన్యులు అయ్యారు
హ్యాపీ ఇండిపెండెన్స్ డే
టాపిక్