Independence day wishes: గుండె ఉప్పొంగేలా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఇలా తెలుగులోనే చెప్పండి
Independence day wishes: స్వాతంత్య్ర దినోత్సవం వచ్చేసింది. ఇండిపెండెన్స్ డే రోజున మీలో ఉన్న దేశ భక్తిని, ప్రేమను ఇతరులకు శుభాకాంక్షల రూపంలో పంపండి. ఇక్కడ మేము తెలుగులోనే స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను ఇచ్చాము. వాటిని మీరు బంధువులకు, స్నేహితులకు మెసేజులు, వాట్సాప్ స్టేటస్ రూపంలో పంపించవచ్చు.
ఆగస్టు 15, 2024న భారతదేశం తన 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. ఈ స్వాతంత్య్ర వేడుకల ఉత్సాహం ప్రతి భారతీయుడి గుండెలో ఉప్పొంగుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేయడం, జాతీయ గీతం ఆలపించడం, మిఠాయిలు పంచుకుంటూ ప్రజలు తమ ఆనందాన్ని పది మందితో పంచుకుంటారు. అదే సమయంలో స్నేహితులు, బంధువులకు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. వాట్సాప్ లో మెసేజులు, సూక్తులు పంపుతూ ఉంటారు. ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలను తెలుగులోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా మీ సన్నిహితులు, స్నేహితులు లేదా బంధువులకు ఆగస్టు 15 శుభాకాంక్షలు పంపాలనుకుంటే, ఇక్కడ మేము ఇచ్చిన స్వాతంత్య్ర దినోత్సవ సూక్తులు, సందేశాలను ఎంపిక చేసుకోండి.
ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు
- మువ్వన్నల ఈ జెండా దేశానికి గర్వకారణం,
ప్రతి భారతీయుడి హృదయానికి గర్వకారణం,
ఇది మూడు రంగులలో చిత్రించిన భారతదేశం.
హ్యాపీ ఇండిపెండెన్స్ డే
2. త్రివర్ణ పతాకానికి వందనం చేయండి,
ప్రాణం ఉన్నంత కాలం, ఆ జెండాను కాపాడుతూనే ఉండండి
హ్యాపీ ఇండిపెండెన్స్ డే
3. ఈద్, దీపావళి, క్రిస్ మస్
ఈ మూడు పండుగల రంగులతో
మెరిసే భారతదేశం మనది
త్రివర్ణ పతాకం మన జీవితం కంటే ముఖ్యమైనది.
హ్యాపీ ఇండిపెండెన్స్ డే
4. స్వేచ్ఛ మీ ఉనికిని పెంచుతుంది,
స్వేచ్ఛ మీకు జీవితాన్ని నేర్పుతుంది.
హ్యాపీ ఇండిపెండెన్స్ డే 2024
5. మువ్వన్నెల జెండాకు సెల్యూట్ చేద్దాం
దేశభక్తిని చాటుదాం
అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
6. ఎందరో సమరయోధుల త్యాగంతో సాధించుకున్న
స్వాతంత్య్రం ఇది
వారందరికీ ఇవే మా నివాళులు
అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే
7. భారతదేశంలో పుట్టడం మన అదృష్టం
మనం భారతీయులం అయినందుకు గర్వపడదాం
అందరికీ 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
8. మనదేశం ఎల్లప్పుడూ శాంతి, శ్రేయస్సుతో వర్ధిల్లాలి
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
9. మన స్వేచ్ఛ కోసం చేసిన త్యాగాలను గౌరవిద్దాం
స్వాతంత్య్ర దీవెనలను ఆస్వాదిద్దాం
హ్యాపీ ఇండిపెండెన్స్ డే
10. ఈ స్వాతంత్య్ర దినోత్సవంనాడు
స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరులను గౌరవిద్దాం
వారి త్యాగాలను స్మరించుకుందాం
హ్యాపీ ఇండిపెండెన్స్ డే
11. మన దేశం మనకిచ్చిన స్వేచ్ఛ, ఐక్యత విలువలను గౌరవిద్ధాం,
ఈ ప్రత్యేకమైన రోజును సంబరంగా నిర్వహించుకుందాం
హ్యాపీ ఇండిపెండెన్స్ డే
12. వందలాది మంది వీరుల రక్తానికి బదులుగా
మనకు స్వాతంత్య్రం వచ్చింది
ఈ రోజున వారికి నివాళులర్పిద్దాం
హ్యాపీ ఇండిపెండెన్స్ డే
13. మనదేశం కోసం ప్రాణాలను అర్పిస్తున్న
వీర సైనికులు ఎందరో
దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు