Happy friendship day Wishes: అందమైన అనుబంధం స్నేహం, మీ ప్రాణస్నేహితులకు ఇలా తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి-happy friendship day wishes messages in telugu to celebrating friendship ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happy Friendship Day Wishes: అందమైన అనుబంధం స్నేహం, మీ ప్రాణస్నేహితులకు ఇలా తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి

Happy friendship day Wishes: అందమైన అనుబంధం స్నేహం, మీ ప్రాణస్నేహితులకు ఇలా తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి

Haritha Chappa HT Telugu
Aug 04, 2024 08:25 AM IST

Happy friendship day Wishes: మీ ప్రాణ స్నేహితులకు మరిచిపోలేని బహుమతిని అందించడానికి ఫ్రెండ్షిప్ డే వచ్చేసింది. వారి కోసం మీరు ఒక అందమైన మెసేజ్ ను పంపించండి. అది వారి గుండెకు హత్తుకునేలా ఉండాలి. ఇక్కడ కొన్ని ఫ్రెండ్‌షిప్ డే విషెస్ ఇచ్చాము.

ఫ్రెండ్‌షిప్ డే విషెస్
ఫ్రెండ్‌షిప్ డే విషెస్ (Pixabay)

Happy friendship day Wishes: జీవితంలో అత్యంత అందమైన సంబంధాలలో స్నేహం ఒకటి. ఎలాంటి రక్తసంబంధం లేకుండా ఒకరి కోసం ఒకరు అన్నట్టు జీవించేలా చేసేదే స్నేహబంధం. ప్రతి ఏడాది ఆగస్టు మొదటి ఆదివారంలో స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. స్నేహితులు ఒకరిపై ఒకరికి ఉన్న శ్రద్ధను, ప్రేమను చూపించుకుని రోజు వారీ అమూల్యమైన బంధాన్ని మరింత పటిష్టంగా పరుచుకునే రోజు. అమ్మా నాన్నని మనం ఎంపిక చేసుకోలేం, కానీ స్నేహితులను మాత్రం మనం ఎంపిక చేసుకోగలం. మనం నవ్వినా, ఏడ్చినా, గొడవ పడినా అది స్నేహంలో అందమైన అనుభవాలే. స్నేహమంటే ఒక నమ్మకం. మీకు నచ్చిన ప్రాణ స్నేహితులకు తెలుగులోనే విషెస్ చెప్పండి.

ఫ్రెండ్‌షిప్ డే విషెస్

1. స్నేహం అనేది రెండు హృదయాలను కలిపే బంధం

మన హృదయాలు ఏనాడో కలిసిపోయాయి

వాటిని విడదీయడం అసాధ్యం

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే... మై ఫ్రెండ్

 

2. నా గురించి బాగా తెలిసినా

నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్న స్నేహితుడివి నీవే

ఇందుకు నేను నీ జీవితాంతం రుణపడి ఉంటాను

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రమా

 

3. నీ స్నేహం నా ఆనందానికి మూలం

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

 

4. నా ప్రపంచాన్ని ఆనందం, నవ్వుతో నింపినందుకు

మీకు ధన్యవాదాలు మిత్రమా

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

 

5. మన చిన్ననాటి జ్ఞాపకాలనే కాదు

భవిష్యత్తులో మరిన్ని జ్ఞాపకాలను మూట కట్టుకోవాలని

కోరుకుంటూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మిత్రమా

 

6. నువ్వు నా సాధారణమైన రోజులను

అందమైన సమయాలుగా మార్చావు

అందుకోసం నీకు ఎప్పటికీ నీకు రుణపడే ఉంటాను

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

 

7. నా జీవితంలోని హ్యాపీ మూమెంట్స్‌లో మాత్రమే కాదు

బాధా సమయంలో కూడా నా వెన్నంటే ఉన్నందుకు

నీకు ధన్యవాదాలు

హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే మిత్రమా

 

8. నీలాంటి నిజమైన స్నేహితుడు

నాతో ఉండడం వల్లే

నా జీవితం ఇంత ఆనందంగా ఉంది

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు

 

9. దూరం ఎప్పుడూ స్నేహాన్ని విడగొట్టలేదు

మన స్నేహం కూడా అంతే

మనం భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ

మన మనసులు కలిసే ఉన్నాయి

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

 

10. ప్రతి ఒక్కరికీ వారి జీవితంలో

మీలాంటి నిజమైన స్నేహితుడు

లభించాలని కోరుకుంటున్నాను

మీరు నాకు లభించినందుకు ఆనంద పడుతున్నాను

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

 

11. నవ్వడం కూడా కష్టంగా ఉన్న సమయంలో

నువ్వు నన్ను నవ్వించావు

అందుకు నీకు ధన్యవాదాలు

హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

 

12. నన్ను ఎప్పుడు జడ్జ్ చేయని వ్యక్తివి

నన్ను మరింత ఉన్నతంగా మార్చాలని ప్రయత్నించిన వ్యక్తివి

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే డియర్ ఫ్రెండ్

 

13. నీతో ఉన్న ఏ క్షణం కూడా

ఎప్పుడూ నేను ఒంటరిగా, బాధగా ఫీల్ అవ్వలేదు.

హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే మిత్రమా

 

14. జీవితానికి గొప్ప బహుమతి మంచి స్నేహితుడు

నేను ఆ గొప్ప బహుమతిని నీ రూపంలో పొందాను

హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

 

15. నాకు ఆనందం, నవ్వు,

మరపురాని జ్ఞాపకాలను అందించినందుకు ధన్యవాదాలు

హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే మై డియర్ ఫ్రెండ్

 

16. మన స్నేహం రోజు రోజుకి

మరింత బలపడాలని కోరుకుంటూ

హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే మిత్రమా

 

17. నా జీవితంలో నీ ఉనికితో

ప్రతిరోజును ప్రకాశవంతంగా మార్చావు

అందుకు నేను నీకు ఎప్పుడూ కృతజ్ఞతుడినే

హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే మిత్రమా

 

18. స్నేహంలో భాగంగా

నువ్వు నాకు ఇచ్చిన అంతులేని మద్దతుకు

ప్రేమతో ధన్యవాదాలు

హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

 

19. నీ స్నేహం నాకు ఒక ఆశీర్వాదం

ఇందుకు ప్రతిరోజు నేను ఆ దేవునికి కృతజ్ఞత చెబుతూనే ఉంటాను

హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే

 

20. నువ్విచ్చిన లెక్కలేనన్ని జ్ఞాపకాలకు

అంతులేని నవ్వులకు ధన్యవాదాలు

హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే మై డియర్ ఫ్రెండ్

21. స్నేహితుడుంటే మన గతాన్ని అర్థం చేసుకునే వ్యక్తి

భవిష్యత్తును అందంగా మార్చే బంధం

ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అలాగే మిమ్మల్ని స్వీకరించే వ్యక్తి

అలాంటి వ్యక్తి నీ రూపంలో నాకు దొరికినందుకు

నేను అదృష్టవంతుడిని

హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే మై డియర్ ఫ్రెండ్

టాపిక్