తండ్రీ.. నిజానికి మనం తక్కువగా మాట్లాడే పదం. కానీ ఆయనపై అత్యంత లోతైన అనుభూతి ఉంటుంది. నాన్న తరచుగా చెమటతో తడిసిన దుస్తులలో కనిపిస్తారు. కానీ ఆయన కళ్ళలో మనం ఎదగాలి అనే కల ఎప్పుడూ ఉంటుంది. తండ్రి ప్రేమ మాటల్లో కాదు, ఆయన మన కోసం చేస్తున్న పోరాటంలో ప్రతిబింబిస్తుంది. నిజానికి ప్రతి ఒక్కరూ తల్లి ప్రేమను బాగా అనుభవించగలరు. కానీ తండ్రి అలా కాదు.. ఆయన తన బిడ్డతో తక్కువ సమయం గడుపుతాడు. నిరంతరం మన కోసమే ఆలోచిస్తాడు.
ప్రతి సంవత్సరం జూన్ నెలలో మూడో ఆదివారం ఫాదర్స్ డే జరుపుకొంటారు. ఈ సంవత్సరం జూన్ 15న ఫాదర్స్ డే వస్తుంది. ఈ రోజున మీ నాన్నగారిని సంతోషపెట్టాడానికి కింద ఇచ్చిన వాటితో శుభాకాంక్షలు చెప్పండి.
దేవుడు నాకు ఇచ్చిన బహుమతి నాన్న.. ఆయన లేకుంటే ఈ జీవితానికి అర్థమే లేదు.. హ్యాపీ ఫాదర్స్ డే!
తండ్రి పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ, దానిని ఎప్పుడూ ముఖంలో కనిపించకుండా చిరునవ్వుతో కప్పేస్తాడు.. Happy Fathers Day
మనల్ని ప్రపంచానికి పరిచయం చేసేది తల్లి అయితే.. మనల్ని ప్రపంచం ముందుకు తీసుకెళ్లేది నాన్న.. హ్యాపీ ఫాదర్స్ డే
మన జీవితాలను మెరుగుపర్చడానికి.. తన జీవితాన్ని వదులుకొనే గొప్ప వ్యక్తి తండ్రి.. Happy Fathers Day 2025
ప్రియమైన నాన్న, నాకు ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు ఎల్లప్పుడూ నాకు ఉత్తమమైన వాటిని మాత్రమే ఇచ్చారు. ఫాదర్స్ డే శుభాకాంక్షలు 2025
ప్రియమైన నాన్న, నేను కొన్నిసార్లు మిమ్మల్ని బాధపెట్టి ఉండవచ్చు. మిమ్మల్ని గర్వంగా, సంతోషంగా ఉంచడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తానని మీకు మాట ఇస్తున్నాను.. Happy Father's Day
బాల్యంలో నా వేళ్లను పట్టుకుని నడవడం నేర్పించావు.. ప్రతి కష్టంతోనూ పోరాడటం నేర్పావు.. నేను పడిపోయినప్పుడల్లా నన్ను ప్రోత్సహించి ముందుకు నెట్టావు.. నీ వల్లనే నా జీవితం అందంగా మారింది.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న
మీరు నన్ను చిన్నప్పటి నుంచి నీడలో ఉంచి.. ఎండలో మండుతూనే ఉన్నారు. నా తండ్రి రూపంలో దేవుడిని నేను చూశాను. హ్యాపీ ఫాదర్స్ డే
కుటుంబం కోసం మీరు చేసిన త్యాగాలన్నింటికీ నేను చాలా కృతజ్ఞుడను, మీరే నా మొదటి హీరో. హ్యాపీ ఫాదర్స్ డే ప్రియమైన నాన్న.
నాకేదైనా అవసరం ఉంటే జేబులు ఖాళీగా ఉన్నా.. ఎప్పుడూ కనిపించనివ్వడు.. అప్పుడు అనిపిస్తుంది నాకు.. నా తండ్రి కంటే ధనవంతుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నారు అని.. Happy Father's Day 2025