Hair Transplantation: హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వల్ల లుక్ మార్చుకోవచ్చు, కానీ ఈ ఆరోగ్యప్రమాదాలు వచ్చే అవకాశం
Hair Transplantation: బట్టతల సమస్యతో బాధపడేవారు లుక్ మార్చుకునేందుకు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుంటూ ఉంటారు. మీరు కూడా ఈ ప్రక్రియతో జుట్టును పెంచాలనుకుంటే హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాలను కచ్చితంగా తెలుసుకోవాలి.
జుట్టు రాలే సమస్య ఆధునిక కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. కానీ జుట్టు రాలిన తర్వాత బట్టతలను బయటపెట్టేందుకు మాత్రం ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు జుట్టు రాలే సమస్య అధికంగా మారిపోవడంతో పాటూ ఎంతో మంది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. కొందరిలో ఈ సమస్య జన్యుపరమైన కారణాల వల్ల వస్తుంటే… మరికొందరిలో ఎక్కువ కెమికల్ వాడటం వల్ల మొదలవుతుంది. ఈ సమస్యను నివారించడానికి, ప్రజలు జుట్టు మార్పిడి అంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ఇలా హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయడం వల్ల ఎన్నో రకాల దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి.
హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోవాలనుకునే వారు… దాని వల్ల కలిగే అనర్థాలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తలపై ట్రాన్స్ ప్లాంటేషన్ చేయడం వల్ల అక్కడ సూదులు గుచ్చిన ప్రాంతంలో చాలా దురదగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ కు కారణం అవుతాయి.
జుట్టు రాలడం
అధిక జుట్టు రాలడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఫోలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంట్ (FUT) కంటే ఫోలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ (FUE) లో జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. అంతేకాక, ఎఫ్యుఇ శాశ్వత జుట్టు రాలడానికి కారణమవుతుంది, అయితే ఎఫ్యుటి శస్త్రచికిత్స తర్వాత జుట్టు రాలడాన్ని రివర్స్ చేస్తుంది.
ఇన్ఫెక్షన్
కుట్లు వేసిన ప్రదేశానికి సమీపంలో ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. ఇది ఎపిడెర్మల్ తిత్తులకు కూడా దారితీస్తుందని నివేదికలు చెబుతున్నాయి. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసిన వెంటనే ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
నొప్పి
హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనేది ఒక ఇన్వాసివ్ శస్త్రచికిత్స. దీనిలో సరైన మొత్తంలో అనస్థీషియా ఇవ్వకపోతే చాలా నొప్పి ఉంటుంది. శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్నప్పుడు, మీరు సాగదీయబడినట్లు కూడా అనిపించవచ్చు.
వాపు
హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న వారిలో వాపు చాలా సాధారణం. మీకు కళ్ళు, నుదిటి చుట్టూ వాపు అనిపించవచ్చు. ఇది కొన్నిసార్లు తీవ్రంగా ఉంటుంది. ఇది కళ్ల రంగు మారడానికి కారణమవుతుంది.
హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసేందుకు అనస్తీషియా ఇస్తారు. వీటి వల్ల కూడా అలెర్జీ వంటివి వస్తాయి. అలాగే అధిక రక్త స్రావం కూడా కావచ్చు. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకోవాలనుకుంటే శిక్షణ పొందినవారి చేత చేయించుకోవాలి. ఇది చేయించుకున్నవారికి యాంటీ బయాటిక్స్ మందులు, యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు సూచిస్తారు. వాటిని కచ్చితంగా వాడాలి. తలను తేమగా ఉండకుండా చూసుకోవాలి, తలస్నానం కొన్ని నెలల పాటూ చేయకూడదు. మూడు వారాల పాటూ ప్రత్యక్ష సూర్యరశ్మి పడకుండా చూసుకోవాలి. కఠినమైన వ్యాయామాలు చేయకూడదు, ఈత వంటివి కూడా చేయకూడదు. మందులు శారీరకంగా సెట్ అవడానికి, కొత్త జుట్టు రావడానికి ఎక్కువ సమయమే పడుతుంది. అందుకోసం ఓపికగా వెయిట్ చేయాలి.