పండుగలకు, ప్రత్యేక దినాలకు అలంకరించుకునే సమయంలో జుట్టుకు ఉండే ప్రాాధాన్యతే వేరు. తల వెంట్రుకలను అలంకరించుకునే పద్ధతిని బట్టి పూర్తి స్టైల్ మారిపోతుంది. మీ రూపాన్నే మరోలా కనిపించేలా చేస్తుంది. చాలా మంది అభిప్రాయం ప్రకారం.. హెయిర్ స్టైల్ అనేది మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా చేస్తుందట. ఎందుకంటే, తమ ఇష్టాన్ని హెయిర్ స్టైల్ మీదే చూపిస్తుంటారు. కానీ, వేసవి కాలంలో అధిక వేడి కారణంగా జుట్టుపై దుష్ప్రభావం కనిపిస్తుంది. వేసవి వాతావరణానికి వేడి పెరిగి జుట్టు పొడిబారడం, చిక్కులుపడటం, తెగిపోవడానికి దారి తీస్తాయి.
వేసవిలో జుట్టు ఎదుర్కొనే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే, పూర్తి ఆరోగ్యంగా కనిపించేందుకు ఈ సలహాలు పాటించాలని డెర్మటాలజిస్టు చెబుతున్నారు. అవేంటో చూసేద్దామా..?
బలహీనమైన జుట్టు ఉన్న వాళ్లకు వేడి అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. హీట్ స్ట్రెయిటెనర్లు ఉపయోగించి ట్విస్టింగ్ వంటివి చేయడం వల్ల జుట్టు ఉపరితలాన్ని ప్రభావితం చేయవచ్చు. వీటితో పాటు ఎండకు ఎక్కువసేపు ఉండటం వల్ల జుట్టుపై మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే, UV కిరణాలు, ముఖ్యంగా UVA, UVB కిరణాలు జుట్టును తేమగా ఉంచడంలో సహాయపడే సహజ నూనెలను తొలగిస్తాయి. ఇవి జుట్టును పొడిగా, విరిగిపోయేలా, ఎండిపోయినట్లుగా మారుస్తాయి. ఒక్కోసారి వెంట్రుకలను సన్నగా కూడా మారుస్తాయి. ఎండ కారణంగా ఇంకా ఏయే నష్టాలు కలుగుతాయంటే..
వేడి స్టైలింగ్ పరికరాలను పదే పదే ఉపయోగించడం వల్ల సహజ నూనెలు తొలగిపోతాయి. జుట్టులో సాధారణ తేమ తగ్గిపోయి, పొడిబారడం మొదలువుతంది. ఇది చిక్కులు పడటం, వెంట్రుకలు చిట్లినట్లుగా మారడం, జుట్టు రాలిపోవడానికి దారితీయవచ్చు.
హీట్ స్ట్రెయినర్లు, హెయిర్ డ్రైయర్లు వాడి స్టైలింగ్ చేసుకోవడం జుట్టుకు సమస్యగా మారతాయి. UV కాంతి క్రమంగా ప్రోటీన్ బలహీనపడేలా చేస్తుంది. దీనివల్ల జుట్టు కాలక్రమేణా బలహీనపడుతుంది.
సూర్యకాంతికి ఎక్కువగా గురికావడం జుట్టు రంగు మసకబారడానికి కారణం కావచ్చు. ముఖ్యంగా వెంట్రుకలకు రంగు వేసుకునే వారిలో కాలక్రమేణా వెంట్రుకలలోని సామర్థ్యాన్ని తగ్గిపోయేలా చేస్తుంది.
సూర్యకాంతి, వేడి స్టైలింగ్‌లు ఎక్కువగా చేసుకోవడం వల్ల జుట్టు పొడిబారిపోతుంది. అంతేకాకుండా సహజ నూనెలు తొలగిపోయి గరుకుగా మారుతుంది. ఫలితంగా చిక్కులు పడటం, తెగిపోవడం వంటివి చూస్తూ ఉంటాం.
స్టైలింగ్‌కు సరైన విధానాన్ని అవలంబించడం ద్వారా, మీరు మీ స్టైల్‌తో రాజీపడకుండా జుట్టును రక్షించుకోవచ్చు.
జుట్టుపై పడే ఎండను తట్టుకునేందుకు స్ప్రేలను ఉపయోగించండి. ఇది వెంట్రుకలపై ఎండ ప్రభావం తక్కువగా పడేలా చేస్తుంది. ఇంకా తేమను నిలుపుకుంటుంది.
సాధ్యమైనంత వరకూ వేసవి కాలం హీట్ స్టైలింగ్‌ను పరిమితం చేయండి. బ్రెయిడింగ్ లేదా రోలర్లు వంటివి హీట్ తక్కువగా ఉంటాయి. వీటిని ఉపయోగించి స్టైల్ గా ఉండొచ్చు. దాంతో పాటు కేశారోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఎండలోకి వెళ్లే సమయంలో క్యాప్ లేదా స్కార్ఫ్ ధరించండి. ఇలా చేయడం వల్ల జుట్టుపై అధిక సూర్యకాంతి పడకుండా రక్షణ కల్పిస్తుంది.
UV ఫిల్టర్లు ఉన్న లీవ్-ఇన్ కండిషనర్లు లేదా సీరమ్‌లు సూర్యకాంతి ప్రభావాన్ని తగ్గించవచ్చు.
లోతైన కండిషనింగ్ చికిత్సలు, హెయిర్ మాస్క్‌లు లేదా తేలికపాటి సీరమ్‌లను (ఉదాహరణకు, ఆలోవేరా లేదా నారింజ నూనె) అప్లై చేసుకోవడం వల్ల తేమను నిలుపుకోవచ్చు.
వేడి నీటికి బదులుగా చల్లని నీటితో జుట్టును కడగడం వల్ల జుట్టు మృదుత్వం కాపాడుకున్నట్లు అవుతుంది.
కొన్ని హెయిర్ ప్రొడక్టులలో ఆల్కహాల్ కలిసి ఉంటాయి. ఇవి జుట్టు పొడిబారే సమస్యను మరింత పెంచుతాయి. ఆల్కహాల్ లేని వస్తువులను ఉపయోగించడం వల్ల తేమ కోల్పోకుండా కాపాడవచ్చు.
బ్రెయిడ్స్, బన్స్ లేదా పోనీటెయిల్స్ జుట్టు, తలకు నేరుగా ఎండ పడకుండా చేస్తాయి. తరచుగా వేడి స్టైలింగ్ అవసరాన్ని తగ్గిస్తాయి.
వేసవిలో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే, శరీరం హైడ్రేషన్ కోల్పోకుండా కాపాడుకోవాలంటే నీరు ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు/ద్రవాలను తీసుకోవాలని గుర్తుంచుకోండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం