Head Bath Mistakes: తలస్నానం చేసేటప్పడు మీరు చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లే.. మీ జుట్టు రాలడానికి కారణమని మీకు తెలుసా?-hair care tips these little mistakes you make while taking a head bath are the reason for your hair fall and dryness ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Head Bath Mistakes: తలస్నానం చేసేటప్పడు మీరు చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లే.. మీ జుట్టు రాలడానికి కారణమని మీకు తెలుసా?

Head Bath Mistakes: తలస్నానం చేసేటప్పడు మీరు చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లే.. మీ జుట్టు రాలడానికి కారణమని మీకు తెలుసా?

Ramya Sri Marka HT Telugu
Jan 28, 2025 07:30 PM IST

Head Bath Mistakes: జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే దాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. తలస్నానం చేసేటప్పుడు చాలా మంది చేసే చిన్న చిన్న పొరపాట్లు జుట్టు రాలిపోవడానికి, పొడిబారడానికి దారితీస్తాయని మీకు తెలుసా? అవేంటో తెలుసుకుని మీరు కూడా జాగ్రత్త పడండి.

తలస్నానం చేసేటప్పడు మీరు చేసే పొరపాట్లే.. మీ జుట్టు రాలడానికి కారణమవుతాయి
తలస్నానం చేసేటప్పడు మీరు చేసే పొరపాట్లే.. మీ జుట్టు రాలడానికి కారణమవుతాయి (Shutterstock)

జుట్టు అందంగా, ఆరోగ్యంగా మెరిసిపోవాలంటే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా జుట్టును శుభ్రం చేసే విషయంలో. జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, క్రమం తప్పకుండా తలస్నానం చేయడం చాలా అవసరం. జుట్టు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచి వృద్ధి ఉంటుంది. అలాగే మృదువుగా, మెరుస్తూ, ఆరోగ్యంగా ఉంటాయి. అయితే తలస్నానం చేసేటప్పుడు చాలామంది కొన్ని సాధారణ తప్పులు చేస్తారు, ఇవి జుట్టు ఆరోగ్యానికి చాలా హానికరం. ఇలా చేయడం వల్ల మీ జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి, జుట్టు రాలడం, పొడిబారడం, చుండ్రు, దురద, దద్దుర్లు వంటి సమస్యలు కూడా వస్తాయి. కనుక తలస్నానం విషయంలో సాధారణంగా చాలా మంది చేసే ఈ రోజు మనం తప్పుల గురించి తెలుసుకోండి. మీరూ వీటిని చేస్తున్నారో లేదో తెలుసుకుని జాగ్రత్త పడండి.

yearly horoscope entry point

మీరు మీ జుట్టును ఎక్కువగా కడుగుతున్నారా?

కొంతమంది ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు తలను కూడా శుభ్రపరుస్తుంటారు. మీరు కూడా ఇలాగే ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నట్లయితే ఇది చాలా ప్రమాదకరమని తెలుసుకోండి. జుట్టును శుభ్రం చేసుకునే ప్రయత్నంలో ఎక్కువగా కడుగుతుంటే ఇది మేలు కన్నా ఎక్కువ హాని చేస్తుందని తెలుసుకోండి. ఎక్కువ షాంపూ వాడటం వల్ల మీ తలపై ఉండే చర్మానికి సహజ నూనె ఉత్పత్తి తగ్గిపోతుంది, దీనివల్ల జుట్టు పొడిబారడం, ఎక్కువగా రాలిపోయే ప్రమాదం కూడా పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వారానికి రెండు నుండి మూడు సార్లు మాత్రమే అది కూడా మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.

చిక్కుబడ్డ జుట్టుకు షాంపూ వేయడం

మీరు జుట్టును విప్పకుండానే, చిక్కులు తీయకుండానే తలస్నానం చేస్తున్నట్లయితే ఈ అలవాటును వెంటనే మానుకోండి. ఇది మీ జుట్టుకు చాలా హానికరం. ఇలా చేయడం వల్ల చాలా జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. జుట్టును కడగడానికి ముందు బాగా దువ్వడం, వెంట్రుకల్లో చిక్కులు లేకుండా చేయడం మంచిది. ఇది మీ జుట్టును బాగా శుభ్రం చేస్తుంది, పొడిబారి చిట్లిపోకుండా ఆపుతుంది.

జుట్టుపై ఎక్కువ ఒత్తిడి పెట్టవద్దు

జుట్టును బాగా శుభ్రం చేసుకునే ప్రయత్నంలో మీరు షాంపూ రాసుకునేటప్పుడు బాగా గట్టిగా రుద్దడం కూడా మంచి అలవాటు కాదు. తలపై ఇలా ఎక్కువ ఒత్తిడి పెట్టడం మీ జుట్టుకు మరింత హాని కలిగిస్తుంది. ఎల్లప్పుడూ చాలా మృదువుగా షాంపూను రుద్దాలి. షాంపూతో గట్టిగా రుద్దకూడదు, ముఖ్యంగా కుదుళ్లకు షాంపూతో మసాజ్ చేయకూడదు. తేలికపాటి చేతులతో చర్మానికి షాంపూ రుద్ది చాలా మృదువుగా మసాజ్ చేయాలి.

నీటి ఉష్ణోగ్రత కూడా ముఖ్యం

చలికాలంలో ప్రజలు సాధారణంగా స్నానం చేయడానికి బాగా వేడి నీటిని ఉపయోగిస్తారు. అలాంటప్పుడు వారు జుట్టును కూడా అంతే వేడి నీటితో కడుగుతారు, ఇది జుట్టుకు మంచిది కాదు. వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలు మరింత పొడిబారుతాయి. విరిగిపోయే ప్రమాదం కూడా పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, జుట్టును కడగడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించడం ఉత్తమం. ఇది జుట్టును బాగా శుభ్రం చేస్తుంది, మృదువుగా, మెరుస్తూ ఉంచుతుంది.

Whats_app_banner