Worst Day of the Week : ఇది చెప్పడానికి గిన్నిస్‌కి ఇన్ని రోజులు పట్టిందా..
Gunnies World Records on Monday : గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఎట్టకేలకు వారంలో చెత్త రోజును ప్రకటించింది. Worst Day of the Week కింద.. సోమవారాన్ని ప్రకటించింది. అయితే దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Gunnies World Records on Monday : గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సోమవారాన్ని 'వారంలో చెత్త రోజు'గా గుర్తించింది. సోమవారం బ్లూస్‌పై చర్చల మధ్య.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సోమవారం 'వారంలో చెత్త రోజు'గా అధికారికంగా ప్రకటించింది. సంస్థ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. "we're officially giving Monday the record of the worst day of the week" అని పేర్కొంది.
అయితే ఈ విషయంపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఈ విషయం తెలియడానికి మీకు ఇన్నిరోజులు పట్టిందా? మాకు ఎప్పుడో ఈ విషయం తెలుసు.. ఇప్పుడే నిద్రలేచినట్లున్నారు.. అంటూ ఫన్నీగా మీమ్స్‌తో కామెంట్స్ చేస్తున్నారు.
సోమవారం మీద ఎందుకింత వ్యతిరేకత?
ఎందుకంటే.. చాలా కార్పోరేట్ కంపెనీలు శనివారం, ఆదివారం వీక్లీ ఆఫ్‌లు ఇస్తాయి. శుక్రవారం సాయంత్రం నుంచే సెలవు సందడి మొదలైపోతుంది. పైగా గవర్నమెంట్ కూడా ఆదివారాన్నే సెలవుగా ఇస్తుంది. చాలా మంది ఉద్యోగులు సండే ఇంట్లో ఉండేందుకు మొగ్గు చూపుతారు. అంతేకాకుండా పిల్లలకు కూడా సండే ఇంట్లో ఉండే ఆప్షన్ ఉంటుంది కాబట్టి.. సండే అంటేనే హాలీడేగా ఎప్పటినుంచో ఫిక్స్ అయిపోయాము.
అయితే సండే ఇంట్లో ఉంటూ.. సందడి చేస్తూ.. ఆడుకుంటూ.. నచ్చినది తింటూ.. ఉంటే సమయం త్వరగా అయిపోతుంది. అంతేనా దానికి తగ్గట్లు సినిమాలకు వెళ్లడం.. ఫ్రెండ్స్‌ని మీట్ అవ్వడం.. ఇంట్లోనే ఉంటే సండే మూవీస్, ప్రోగ్రామ్స్‌తో ఛానల్స్ ఆకట్టుకుంటాయి. ఓ రిలాక్స్ మోడ్‌లోకి తీసుకెళ్లిపోతాయి. దీనివల్ల సండే ఎంజాయ్ చేసిన ఫీలింగ్ నుంచి.. మళ్లీ అటెన్షన్ అంటూ మండే వచ్చేస్తుంది. జాలీ మూడ్ నుంచి.. స్కూల్‌కి వెళ్లడం, ఆఫీస్‌కు వెళ్లడం కాస్త కష్టంతో కూడిన పని అనే చెప్పాలి.
అంతేకాకుండా సండే నాన్‌వెజ్ ఎక్కువగా తీసుకుంటారు. లేట్‌నైట్ పడుకుంటారు. దీని ఎఫెక్ట్ కూడా సోమవారంపైనే పడుతుంది. నాన్‌వెజ్ తీసుకున్నప్పుడు శరీరం బద్ధకంగా మారిపోతుంది. సరైన నిద్రలేకపోవడం వల్ల మత్తు మత్తుగా ఉంటుంది. దీనివల్ల సోమవారం ఆఫీస్‌కి, స్కూల్‌కి వెళ్లే జోష్ ఉండదు. ఈ వ్యతిరేకతను ఎప్పటినుంచో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూనే ఉన్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని.. తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా సోమవారాన్ని వారంలోనే చెత్త రోజుగా ప్రకటించింది.
సంబంధిత కథనం
టాపిక్