Brain Teaser: ఆ కుండను ఎవరు పగులగొట్టారో కనిపెట్టి చెప్పండి, ప్రపంచంలో ఒక శాతం మంది మాత్రమే దీనికి సమాధానం చెప్పగలిగారు
Brain Teaser: ఇక్కడ ఒక బ్రెయిన్ టీజర్ ఇచ్చాము. ఇందులో కుండీని పగలగొట్టిన వారెవరో చెప్పాలి. ఇది కూడా ఒక రకమైన ఆప్టికల్ ఇల్యూషన్. ప్రయత్నించి చూడండి.

బ్రెయిన్ టీజర్లు, ఆప్టికల్ ఇల్యుషన్లు మెదడుకు మంచి శిక్షణను అందిస్తాయి. మెదడు సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి. అందుకే అప్పుడప్పుడు కొన్ని రకాల బ్రెయిన్ టీజర్లు, ఆప్టికల్ ఇల్యూషన్లను సాల్వ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఒక బ్రెయిన్ టీజర్ ఇచ్చాము. అందులో ముగ్గురు వ్యక్తులు నిల్చుని ఉన్నారు. వారి వెనక ఒక పగిలిపోయిన కుండీ లేదా జాడీ ఉంది. దాన్ని ఎవరు పగలగొట్టారో కనిపెట్టి చెప్పడమే మీ పని.
ఎక్కువ సమయం ఇస్తే దీనికి జవాబును ఎవరైనా కనిపెట్టేస్తారు. కేవలం 10 సెకన్లలో మాత్రమే కనిపెట్టి చెప్పండి. ఈ బ్రెయిన్ టీజర్ ను సాధించిన వారి ఐక్యూ చాలా ఎక్కువ అని ఒప్పుకోవాల్సిందే. ప్రపంచంలో కేవలం ఒక శాతం మంది మాత్రమే దీనికి సమాధానాన్ని సరైన సమయంలో కనిపెట్టగలిగారు. మీరు కూడా అంత తెలివైన వారైతే జవాబును చెప్పగలరు.
బ్రెయిన్ టీజర్లో నిలుచుని ఉన్న ముగ్గురి శరీర భాషను, భావాలను, శరీరాన్ని బాగా గమనించండి. మీకు ఖచ్చితంగా ఒక క్లూ దొరికి తీరుతుంది. వారి ఒక కవలికలు వారి చేతులు చూపు అన్నీ కూడా మీకు జవాబును చెప్పేస్తాయి. జవాబును కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఇక జవాబును వెతుకుతున్న వారి కోసం మేమిక్కడ జవాబును చెప్పేస్తున్నాము.
బ్రెయిన్ టీజర్ జవాబు ఇదిగో
ఈ బ్రెయిన్ టీజర్ కు జవాబు చెప్పడం చాలా సులువు. కాస్త తెలివి ఉపయోగిస్తే చాలు ఆ ముగ్గురిలో మూడో వ్యక్తి అంటే ఎల్లో డ్రెస్ వేసుకున్న వ్యక్తి ఆ కుండీని పగలగొట్టాడు. అతని చేతులను గమనించండి. మట్టి మరకలు ఉన్నాయి. అలాగే ఆ కుండీకి కూడా కాస్త చేతుల అచ్చులు పడ్డాయి. మట్టి మరకలు ఉన్నాయి. కాబట్టి మూడో వ్యక్తి ఆ కుండీని పగలగొట్టిన వ్యక్తి. ఇలాంటి బ్రెయిన్ టీజర్లు ఎప్పుడు ఇచ్చినా కూడా మీరు అక్కడున్న పరిస్థితులను, దుస్తులను వారి పరిసరాలను గమనిస్తూ ఉండాలి. అప్పుడే దీనికి సమాధానాలను కనిపెట్టగలరు.
పరిశీలన నైపుణ్యాలు పెంచుకోవడానికి ఇలాంటి బ్రెయిన్ టీజర్లు ఎంతో ఉపయోగపడతాయి. మనస్తత్వ శాస్త్రవేత్తలు కూడా బ్రెయిన్ టీజర్ లను అప్పుడప్పుడు సాల్వ్ చేయమని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇది మెదడు సంబంధిత ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. పరధ్యానం వంటివి రాకుండా నిరోధిస్తుంది. సూక్ష్మమైన వస్తువులను అంశాలను కూడా గుర్తించే శక్తిని ఇస్తుంది. తార్కికంగా ఆలోచించే శక్తిని మెదుడుకు అందిస్తుంది. అలాగే బ్రెయిన్ టీజర్ ను సాధించాలంటే కళ్ళు, మెదడు కలిసి పని చేయాలి. కళ్ళు చూసిన విషయాన్ని మెదడు విశ్లేషిస్తుంది. కాబట్టి ఈ రెండూ కలిసి పనిచేసి అద్భుతంగా పరిశీలనా నైపుణ్యాలను పెంచుతాయి. కాబట్టి ఇలాంటి బ్రెయిన్ టీజర్లను సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండండి.
సంబంధిత కథనం