Brain Teaser: చిత్రంలో ఏ కప్పు ముందుగా నిండుతుందో చెప్పండి? తెలివైన వారు మాత్రమే సాధించగలరు, అది కూడా ఏడు సెకన్లలో-guess which cup will be filled first in brain teaser only the wise can achieve it that too in seven seconds ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Brain Teaser: చిత్రంలో ఏ కప్పు ముందుగా నిండుతుందో చెప్పండి? తెలివైన వారు మాత్రమే సాధించగలరు, అది కూడా ఏడు సెకన్లలో

Brain Teaser: చిత్రంలో ఏ కప్పు ముందుగా నిండుతుందో చెప్పండి? తెలివైన వారు మాత్రమే సాధించగలరు, అది కూడా ఏడు సెకన్లలో

Haritha Chappa HT Telugu

Brain Teaser: బ్రెయిన్ టీజర్లు మన మేధస్సుకు సవాలు విసురుతాయి. ఇక్కడ ఇచ్చిన బ్రెయిన్ టీజర్ ను మీరు సాల్వ్ చేస్తే తెలివైన వారి జాబితాలోకి వస్తారు.

బ్రెయిన్ టీజర్

వందల ఏళ్ళుగా బ్రెయిన్ టీజర్లు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. వారి మెదడుకు, ఆలోచన శక్తికి సవాలు విసురుతున్నాయి. ఈ పజిల్స్ ను సాధించడం వల్ల సృజనాత్మక ఆలోచన, సమస్యా పరిష్కార సామర్థ్యం పెరుగుతాయి. అంతే కాదు కాలక్షేపం కూడా అవుతుంది. మీకు బ్రెయిన్ టీజర్లు అంటే ఇష్టం ఉంటే ఇక్కడ ఉన్న ఈ బ్రెయిన్ టీజర్ ను సాల్వ్ చేయండి. మీకు ఇచ్చే సమయం కేవలం 7 సెకన్లు మాత్రమే. ఈ ఏడు సెకన్లలోనే మీరు ఈ బ్రెయిన్ టీజర్ ను సాల్వ్ చేస్తే ప్రపంచంలోనే తెలివైన వారి చెంత చేరిపోతారు. ఎందుకంటే ఐక్యూ లెవెల్ 125 దాటిన వారు మాత్రమే ఈ బ్రెయిన్ టీజర్ ను ఏడు సెకన్లలో సాధించగలరు.

మీ ఐక్యూ లెవెల్ 125 దాటిందో లేదో తెలుసుకోవడానికి ఈ బ్రెయిన్ టీజర్ పరిష్కరించేందుకు ప్రయత్నించండి. ఇక్కడ ఇచ్చిన చిత్రంలో సాసర్ నుంచి టీ పడుతోంది. కింద నాలుగు టీ కప్పులు పెట్టి ఉన్నాయి. ఆ నాలుగు టీ కప్పుల్లో ఏ టీ కప్పు మొదట నిండుతుందో చెప్పాలి. అదే మీకు మేము విసిరే సవాలు.

బ్రెయిన్ టీజర్ జవాబు

ఏడు సెకన్లలోనే జవాబును కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. మీరు చాలా తెలివైన వారికే లెక్క మిగతా ఇక మిగతావారు ఈ బ్రెయిన్ టీజర్ లను ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోండి. మొదట టీ పడుతున్న మార్గాన్ని మీరు గమనించాలి. దాని ప్రవాహానికి ఎక్కడ అడ్డంకి ఉందో చూస్తే ఏ కప్పు మొదట నిండుగా ఉంటుందో తెలిసిపోతుంది. నాలుగో నెంబర్ కప్పు టీ చేరకుండా అడ్డంకి ఉంది. అలాగే 9వ నెంబర్ కప్పుకి కూడా టీ పడే అవకాశం లేదు. దానికి కూడా చివర్లో ట్యూబ్ మూసుకుపోయి ఉంది. అలాగే ఏడో నెంబరు కప్పులో కూడా టీ పడే అవకాశం లేదు. అది కూడా దారి మూసుకుపోయింది. ఆ ట్యూబులను మీరు నిశితంగా గమనిస్తే జవాబు అర్థం అయిపోతుంది. ఇక ఐదో నంబరే కప్పు మాత్రమే నిండుతుంది. కాబట్టి అదే జవాబు.

బ్రెయిన్ టీజర్ లను ఎందుకు పరిష్కరించాలి?

ఇలాంటి బ్రెయిన్ టీజర్ లను సాల్వ్ చేయడం వల్ల కాస్త సరదా కాలక్షేపం మాత్రమే కాదు, అది మీ అభిజ్ఞా ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపిస్తుంది. మీకు ఎన్నో మానసిక ప్రయోజనాలను అందిస్తుంది. మీ ఏకాగ్రతను, ఫోకస్‌ను పెంచుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. జీవితంలో మీకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు బ్రెయిన్ టీజర్‌లను సాల్వ్ చేస్తూ ఉండండి.