జామ పండ్లను చాలా మంది ఇష్టంగా తింటారు. జామకాయలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో.. జామ ఆకులు(Guava Leaves) కూడా అంతే మేలు చేస్తాయి. వాటిని ఉపయోగించడం కారణంగా.. మనం చక్కటి ఆరోగ్యాన్ని(Health) సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు.. జామ ఆకుల్లో అనేక రకాల పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి. జుట్టు సమస్యల(Hair Problems) నుంచి కూడా బయటపడేందుకు జామ ఆకులు ఉపయోగపడతాయి.
జామ ఆకులు(Guava Leaves).. సూక్ష్మజీవులను నిరోధిస్తాయి. జామ ఆకులను నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తాగితే కడుపు నొప్పి పోతుంది. అతిసారం, డయేరియా వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి. జామ ఆకులను తినడం వలన దంతాలకు ఆరోగ్యంతో పాటు నోటిలోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. నోటిలో ఉండే పొక్కులు కూడా పోతాయి. నోటి దుర్వాసన(Mouth Smell)ను కూడా దూరం చేస్తాయి. జామ ఆకులతో టీ చేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ఇక జామ ఆకులతో జుట్టు సమస్యల నుంచి బయటపడొచ్చు. కొన్ని జామ ఆకులను లీటరు నీటిలో 20 నిమిషాలపాటు ఉడకబెట్టాలి. తర్వాత ఆ నీటిని దించాలి. గోరు వెచ్చని నీటిని జుట్టు కుదుళ్ల వరకూ అప్లై చేయాలి. ఇలా చేస్తే.. జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు తలెత్తవు. జుట్టు కుదుళ్ల దృఢంగా తయారు అవుతాయి. అలాగే జుట్టు నల్లగా అవుతుంది. జుట్టు మెరిసేందుకు జామ ఆకులతో చేసిన నీరు బాగా ఉపయోగపడుతుంది.
జుట్టుకే కాదు.. ఆరోగ్యానికి కూడా జామ ఆకులు చాలా మంచివి. వాటిని ఉపయోగిస్తే.. జలుబు, దగ్గు, నోటిపూత, పంటి నొప్పిలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. వీటిలో విటమిన్ సి(Vitamin C), యాంటి ఆక్సిడెంట్లు, ప్లవనాయిడ్స్, పొటాషియం, ఫైబర్ లాంటి పోషకాలు దాగి ఉంటాయి. జామ ఆకుల రసం తాగినా.. వాటితో టీ(Tea) తయారు చేసుకుని.. తాగినా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కరె స్థాయిలు అదుపులో ఉంటాయి.
ఫుడ్ తిన్నాక.. జామ ఆకుల టీ(Guava Leaves Tea)ని తాగితే చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంటాయి. టీని చాలా సులభంగా తయరు చేయోచ్చు. ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేసుకోవాలి. ఇందులో 4 జామ ఆకులను శుభ్రం చేసుకుని వేసుకోవాలి. ఈ నీటిని అర గ్లాస్ అయ్యే దాకా మరిగించాలి. ఆ తర్వాత వడకట్టాలి. ఇలా చేస్తే.. జామ ఆకుల టీ తయారు అవుతుంది.