Google Doodles on Republic Day : గణతంత్ర దినోత్సవం రోజు డూడుల్​తో ఆకట్టుకున్న గూగుల్.. దాని విశేషాలివే..-google doodles celebrate india s republic day with a beautiful illustration ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Google Doodles Celebrate India's Republic Day With A Beautiful Illustration

Google Doodles on Republic Day : గణతంత్ర దినోత్సవం రోజు డూడుల్​తో ఆకట్టుకున్న గూగుల్.. దాని విశేషాలివే..

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 26, 2023 09:00 AM IST

Google Doodles on India's Republic Day : గూగుల్ ప్రతి సంవత్సరం లాగానే.. ఈరోజు కూడా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. తన డూడుల్​తో మరోసారి ఆకట్టుకుంది. సైనికులను విస్తృతమైన కవాతుతో సత్కరిస్తుంది. దాని విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రిపబ్లిక్ డే స్పెషల్ డూడుల్ 2023
రిపబ్లిక్ డే స్పెషల్ డూడుల్ 2023

Google Doodles on India's Republic Day : గూగుల్ డూడుల్ నేడు భారతదేశ 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. నీలం-నేపథ్య దృష్టాంతం.. భారతదేశం కర్తవ్య పథాన్ని చూపుతుంది. రాష్ట్రపతి భవన్ వెలుపల సైనికులు కవాతు చేసే.. ఒక విశాలమైన మార్గాన్ని చూపుతుంది. భారతదేశ సంస్కృతిని, సైనిక శక్తిని చాటి చెప్పే డూడుల్​ ద్వారా ప్రతి సంవత్సరం.. జనవరి 26న గ్రాండ్ పరేడ్ చూపుతుంది గూగుల్.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ గూగుల్ డూడుల్‌ను కళాకారుడు పార్త్ కొతేకర్ గీశారు. గుజరాత్‌కు చెందిన ఈ కళాకారుడు డిజిటల్ ఇలస్ట్రేషన్‌లకు ప్రసిద్ధి చెందారు. అతను చేతితో కత్తిరించిన కాగితంతో పలు కళాఖండాలను తయారు చేసి.. పేరు గాంచారు. ఈరోజు గూగుల్​ డూడుల్​లో.. రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్, CRPF కవాతు బృందం, మోటార్‌సైకిల్ రైడర్‌లు ఉండేలా ప్లాన్ చేశారు. ప్రతి సంవత్సరం డూడుల్​లో కవాతును ప్రదర్శిస్తారు.

రాజ్యాంగం కోసం రెండున్నరేళ్లు

భారతదేశం 1947లో బ్రిటీష్ రాజ్ నుంచి స్వాతంత్య్రం పొందింది. అయితే దేశం జాతీయ స్వభావాన్ని రూపొందించిన భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి దాదాపు రెండున్నర ఏళ్లు పట్టింది. జనవరి 26, 1950న, భారతదేశం తనను తాను సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. భారతదేశ చట్టాలు, రాజ్యాంగాన్ని.. ప్రభుత్వం, ప్రజలు ఆమోదించారు.

భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది అంటే.. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పొడవైన రాజ్యాంగంగా అవతరించింది. దాని గురించి చర్చించి, పలు సర్దుబాటు చేసి.. సవరించారు. ఇది భారతదేశం ప్రజాస్వామ్య గణతంత్రంగా కొనసాగేలా చేసింది.

ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం నాడు.. భారతదేశం కోసం మరణించిన సైనికులను విస్తృతమైన పరేడ్ ద్వారా సత్కరిస్తుంది. దీనికి దేశ ప్రధాన మంత్రి, దేశ అధ్యక్షుడు, దేశ, విదేశీ ప్రముఖులు సహా ప్రజలు, విద్యార్థులు హాజరవుతారు. జాతీయ గీతం ప్లే అవుతున్నప్పుడు ఆకుపచ్చ భారత జెండాను ఎగుర వేస్తారు.

WhatsApp channel

సంబంధిత కథనం