Gongura Egg Curry: గోంగూర ఎగ్ కర్రీ ఇలా వండారంటే ఒక స్పూను ఇగురు కూడా మిగలదు, అంత రుచిగా ఉంటుంది-gongura egg curry recipe in telugu know how to make this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gongura Egg Curry: గోంగూర ఎగ్ కర్రీ ఇలా వండారంటే ఒక స్పూను ఇగురు కూడా మిగలదు, అంత రుచిగా ఉంటుంది

Gongura Egg Curry: గోంగూర ఎగ్ కర్రీ ఇలా వండారంటే ఒక స్పూను ఇగురు కూడా మిగలదు, అంత రుచిగా ఉంటుంది

Haritha Chappa HT Telugu
Nov 09, 2024 03:30 PM IST

Gongura Egg Curry: కోడి గుడ్డు కూరను ఒకసారి గోంగూరతో కలిపి వండి చూడండి. రుచి మాములుగా ఉండదు. గోంగూర ఎగ్ కర్రీ రెసిపి ఇక్కడ ఇచ్చాము.

గోంగూర ఎగ్ కర్రీ రెసిపీ
గోంగూర ఎగ్ కర్రీ రెసిపీ

గోంగూర కోడిగుడ్డు రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవే. ఇక ఈ రెండు కలిపి కాస్త స్పైసీగా కర్రీలాగా వండితే రుచి అదిరిపోతుంది. సింపుల్ గోంగూర ఎగ్ కర్రీ రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఫాలో అయిపోండి. దీని రుచి మీకు ఎంతో నచ్చుతుంది. ఎక్కువ అన్నంలో కూడా కలవడం దీని స్పెషాలిటీ. పైగా దీన్ని వండడం కూడా చాలా సులువు. గోంగూర ఎగ్ కర్రీ రెసిపి తెలుసుకోండి.

గోంగూర ఎగ్ కర్రీ రెసిపీకి కావలసిన పదార్థాలు

కోడిగుడ్లు - నాలుగు

గోంగూర ఆకులు - రెండు కట్టలు

నూనె - రెండు స్పూన్లు

ఉల్లిపాయలు - రెండు

పచ్చిమిర్చి - నాలుగు

పసుపు - అర స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు - అర స్పూన్

టమాటాలు - రెండు

కారం - అర స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

జీలకర్ర పొడి - ఒక స్పూను

గరం మసాలా - ఒక స్పూను

గోంగూర ఎగ్ కర్రీ రెసిపి

1. కోడిగుడ్లను ముందే ఉడకబెట్టి పొట్టు తీసి పైన గాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు గోంగూరను శుభ్రంగా ఆకులను ఏరి శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. లేదా నూనెలో కాసేపు మగ్గించి పేస్ట్ ఇలా చేసుకున్న టేస్టీ గానే ఉంటుంది.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

4. ఆ నూనెలో కోడిగుడ్లను వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

5. తర్వాత లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి వేయించాలి.

6. అలాగే జీలకర్రను కూడా వేసి వేయించుకోవాలి.

7. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి అవి రంగు మారేవరకు వేయించాలి.

8. నిలువుగా కోసమే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి.

9. తర్వాత టమోటో ముక్కలను వేసి పైన మూత పెట్టి అవి మెత్తగా ఇగురులాగా ఉడికే వరకు ఉడికించాలి.

10. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి.

11. ఇప్పుడు కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి.

12. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి.

13. ఇగురుకు సరిపడా నీరుని వేసుకోవాలి.

14. తర్వాత ఉడికించిన కోడిగుడ్లను కూడా వేసి స్టవ్ మీద మూత పెట్టి పది నిమిషాల పాటు వదిలేయాలి.

15. ఇది మొత్తం చిక్కగా గ్రేవీ లాగా అయ్యే వరకు ఉంచాలి.

16. పైన కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే టేస్టీ గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయినట్టే.

గోంగూర కోడిగుడ్లు ఈ రెండిట్లోనూ పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. గోంగూరలో ఉండే పుల్లదనం మనకు విటమిన్ సి ని అందిస్తుంది. ఇక కోడిగుడ్డు సంపూర్ణ ఆహారంతో సమానం. ఇది తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. శరీరానికి కావాల్సిన ఎన్నో విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అందుతాయి.

Whats_app_banner