Hill Station For New Year 2025: న్యూ ఇయర్‌కి హిల్ స్టేషన్ వెళుతున్నారా..? బ్యాగు సర్దుకునే ముందు ఇవి తెలుసుకోండి
Hill Station For New Year 2025: హిల్ స్టేషన్లలో సమయం గడపడం చాలా మందికి ఇష్టం. న్యూ ఇయర్ సందర్భంగా హిల్ స్టేషన్‌కు వెళ్లి పార్టీ చేసేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకుని ఉంటారు. అయితే హిల్ స్టేషన్లకు వెళ్లే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.
న్యూ ఇయర్ వచ్చిందంటే చాలా మంది ట్రావెలింగ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా స్నేహితులు, ప్రేమికులు కొండ ప్రాంతాలు, మంచు ప్రదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. ఈ సారి న్యూ ఇయర్‌కు మీరు కూడా హిల్ స్టేషన్ వెళ్లేందుకు ప్లాన్ చేసినట్టయితే ఇది మీ కోసమే. హిల్ స్టేషన్లలో సమయాన్ని గడపడం వల్ల చాలా రకాల ప్రయోజనాలున్నాయట. అలాగే అక్కడకు వెళ్లే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయట. హిల్ స్టేషన్ ట్రిప్ కోసం బ్యాగు సర్దుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.
హిల్ స్టేషన్లకు వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
1. స్థలాలు, వాతావరణం చెక్ చేసుకోండి:
మీరు ఏ హిల్ స్టేషన్ కు వెళ్లాలి అనుకుంటున్నారో ముందుగా అక్కడి వాతావరణ పరిస్థితులను తెలుసుకొండి. అలాగే మీరు ఉంటున్న సమయంలో ఎలా మారనుందో కూడా తెలుసుకోండి. మీరు వెళ్లబోయే ప్రదేశం గురించి పూర్తి సమాచారాన్ని పొందండి. రోడ్ల పరిస్థితిని కనుగొని, అక్కడ అందమైన, సురక్షితమైన స్థలాల జాబితాను ఎంచుకుని ప్లాన్ చేసుకోండి.
2. ట్రెక్కింగ్ వంటివి చేయాలనుకుంటే..
హిల్ స్టేషన్లో ట్రెక్కింగ్ చేసే ప్లాన్ ఓ ఉంటే మీరు కాళ్లకు బొబ్బలు, పాదాల నొప్పిలు రాకుండా ఉండే ష్యూస్ తీసుకెళ్లండి. పర్వతాలు అధిరోహించే సమయంలో కొండ ప్రాంతంలో రోడ్లు కూడా బాగుండవు. వాటిని ఎక్కేందుకు బరువైన, సౌకర్యవంతమైన బూట్లు ధరించేలా ప్లాన్ చేసుకొండి.
3. గొడుగు లేదా రెయిన్ కోట్ :
పర్వతాలలో సీజన్‌తో పనిలేకుండా వర్షాలు కురుస్తాయి. కనుక అక్కడికి వెళ్లేముందు గొడుగు లేదా రెయిన్‌కోట్ తీసుకెళ్లడం మర్చిపోవద్దు. పర్వతాలలో తడవడం వల్ల జలుబు త్వరగా వస్తుంది. ఇది మీ ట్రిప్‌ను ఎంజాయ్ చేయకుండా చేస్తుంది.
4. ప్రథమ చికిత్స:
తలనొప్పి, జ్వరం, జలుబు, చర్మ అలెర్జీలు వంటి సమస్యలున్న వారు సాధారణ మందులతో కూడిన ప్రథమ చికిత్స వస్తు సామగ్రిని(ఫస్ట్ ఎయిడ్ కిట్) తీసుకెళ్లండి. అత్యవసర పరిస్థితుల్లో ఇది మీకు గానీ మీతో వచ్చిన వారికి గారీ సహాయం చేస్తుంది.
5. స్నాక్స్ :
కొత్త చోటులో ఆహారాలు, వాటి రుచులు మీకు నచ్చకపోవచ్చు. తినకపోతే మీరు నీరసించి పోయి ట్రిప్ అంతా యాక్టివ్ గా ఉండలేరు. కనుక వెళ్లేముందు చాక్లెట్లు, బిస్కెట్లు, క్యాండీలు, వేఫర్లు, జ్యూస్ వంటి స్నాక్స్ ప్యాక్ చేసి తీసుకెళ్లండి.
6. పీరియడ్స్ కిట్‌ని తీసుకెళ్లండి:
మహిళలు తమతో ఎప్పుడూ మెన్స్ట్రువల్ హైజీన్ కిట్‌ను ప్యాక్ చేసుకోవాలి. పర్వతాలలో అత్యవసర పరిస్థితుల్లో ప్యాడ్‌లు మొదలైన మెన్‌స్ట్రువల్ కిట్‌లను పొందడం కష్టంగా ఉండవచ్చు. కాబట్టి వాటిని ఎల్లప్పుడూ మీతో తీసుకెళ్లండి.
7. వెచ్చని బట్టలు:
హిల్ స్టేషన్ సాధారణంగా ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది. కాబట్టి తేలికపాటి జాకెట్, విండ్‌షీట్, గ్లోవ్స్, మఫ్లర్, అదనపు సాక్స్‌లను ప్యాక్ చేసుకుని పెట్టుకోండి. మీరు పిల్లలతో ప్రయాణిస్తున్నట్లయితే, దుప్పట్లు, అదనపు ఉన్ని బట్టలు, సబ్బులు, షాంపూలు వంటి వాటిని మర్చిపోకుండా ప్యాక్ చేయండి. ఎందుకంటే పర్వతాలలో, చలి ఎప్పుడైనా పెరుగుతుంది. ఇది సమస్యలను కలిగిస్తుంది.
హిల్ స్టేషన్‌లలో గడిపితే చేస్తే కలిగే లాభాలు..
ఒత్తిడి, ఆందోళన..
పర్వతాలలో ప్రయాణం చేయడం, అక్కడ సమయం గడపటం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. పర్వతాలున్న ప్రదేశం ఎప్పుడూ నిశ్వబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ సమయం గడపటం వ్లల సాధారణ లైఫ్‌ను బ్రేక్ దొరికినట్లుగా ఫీలవుతారు. మనసుకు ప్రశాంతమైన భావం కలిగి ఒత్తిడి, ఆందోళన తగ్గి అంతర్గత శాంతిని పొందుతారు.
అభిజ్ఞా పనితీరు..
హిల్ స్టేషన్ల దగ్గర వాతావరణం ఎప్పుడూ తాజాగా, శుభ్రంగా ఉంటుంది. స్వచ్ఛమైన పర్వతాల మధ్య ఎప్పుడూ స్వచ్ఛమైన, కాలుష్య రహిత గాలి ఉంటుంది.దీన్ని పీల్చుకోవడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. ఊపిరితిత్తులు ఫ్రెష్ అయి రక్తప్రసరణ మెరుగువుతుంది. ఆక్సిజన్ సరఫరా పెరగడం వల్ల మానసిక స్పష్టత పెరుగుతుంది. అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. ఫోకస్ పెరుగుతుంది.
బహిరంగ కార్యకలాపాలు..
కొండ ప్రాంతాల్లో వాకింగ్ చేయడం వల్ల శారీరక శ్రమల ప్రయోజనాలు పొందవచ్చు. ట్రెక్కింగ్, హైకింగ్, మౌంటేన్ బైకింగ్ వంటివి చేయడం వల్ల శరీరం చురుకుగా మారుతుంది. అక్కడి ప్రకృతిలో నిమగ్నమవడం వల్ల శరీరానికి గొప్ప వ్యాయామం అంది గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.ఫీల్ గుడ్ హార్మోన్లు(ఎండార్ఫిన్లు)ను విడుదల చేస్తుంది.