హనుమ జయంతికి మీ కొడుకుకు ఈ అందమైన పేర్లు పెట్టండి, ఆంజనేయుని ఆశీర్వాదంతో తేజస్సు, బుద్ధి పెరిగి అందరికంటే ముందుంటాడు!-give your son these beautiful names on hanuman jayanti and with the blessings of anjaneya he will grow in brilliance a ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  హనుమ జయంతికి మీ కొడుకుకు ఈ అందమైన పేర్లు పెట్టండి, ఆంజనేయుని ఆశీర్వాదంతో తేజస్సు, బుద్ధి పెరిగి అందరికంటే ముందుంటాడు!

హనుమ జయంతికి మీ కొడుకుకు ఈ అందమైన పేర్లు పెట్టండి, ఆంజనేయుని ఆశీర్వాదంతో తేజస్సు, బుద్ధి పెరిగి అందరికంటే ముందుంటాడు!

Ramya Sri Marka HT Telugu

మీ పిల్లాడికి పేరు పెట్టడానికి ఆలోచిస్తున్నారా.. హనుమ జయంతి రోజున ఆంజనేయుని ఆశీర్వాదంతో నిండిన ఈ పేర్లు పెట్టండి. భవిష్యత్‌లో మిగిలిన అందరి పిల్లల కంటే మెరుగ్గా, తేజస్సుతో వెలిగిపోతాడు. మీకోసం ఇక్కడ లేటెస్ట్ పేర్ల లిస్ట్ తీసుకొచ్చాం. చూసేయండి.

మీ కొడుకుకు హనుమంతుడి పేరు పెట్టాలనుకుంటున్నారా.. (Baby Hanumanji pinterest)

దేశవ్యాప్తంగా హిందువులంతా హనుమ జయంతి పండుగను ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ ఏడాది హనుమాన్ జన్మోత్సవం శనివారం ఏప్రిల్ 12న జరుపుకోనున్నారు. ఈ మేరకు ఆంజనేయుని అనుగ్రహం పొందాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. మరి కొందరు పరమ భక్తులు తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని పిల్లలకు ఆయన పేరును పెట్టుకోవాలనుకుంటారు. అయితే చాలా మందికి తాజాగానూ, ట్రెండీగానూ ఉండాలి. అదీ కాకుండా హనుమాన్ అర్థం వచ్చేలా పేరుండాలని కోరుకుంటారు. వారందరి కోసం ఇక్కడ ఓ లిస్ట్ రెడీ చేశాం ఓ లుక్కేసేయండి మరి.

బజరంగబలి పేరు మీద పిల్లలకు పేర్లు (హనుమంతుని పేరు మీద పిల్లలకు పేర్లు)

ఆంజనేయ -

హనుమంతుని మరో పేరు ఆంజనేయ. ఈ పేరు అర్థం 'అంజనీ కుమారుడు' (హనుమంతుని తల్లి పేరు అంజన). హనుమంతుని పేర్లలో ఉండే ఈ శక్తివంతమైన పేరు తల్లి ప్రేమను సూచిస్తుంది.

మారుతీ లేదా పవన్

హనుమంతుని మరో పేరు మారుతీ. దీనికి అర్థం 'గాలి కుమారుడు' (హనుమంతుడు గాలి దేవుని కుమారుడు). ఇదేకాకుండా పవన సుతుడు (పవన కుమారుడు) అనే పేరు కూడా ఉంది. దీనికి అర్థం వేగం, శక్తిని సూచిస్తుంది.

కపిశ

హనుమంతుని మరో పేరు కపిశ. దీని అర్థం కోతుల రాజు. ఈ పేరు నాయకత్వం, తెలివిని సూచిస్తుంది.

భజరంగ

ఇది హనుమంతుని ప్రసిద్ధమైన పేరు. ఉత్తరాధి, దక్షిణాది మొత్తంలో భజరంగ్ అనే పేరుతో హనుమంతుని పిలుచుకుని ఆరాధిస్తుంటారు. దీని అర్థం 'వజ్రం లాంటి శరీరం' (అత్యంత బలవంతుడు) అని. ఈ పేరు పిల్లలకు పెట్టడం వల్ల శారీరక, మానసిక శక్తిని అందుతుందని భావిస్తారు.

శూర

మీ కొడుకులో వీరత్వం చూడాలనుకుంటే, హనుమంతుని ఈ పేరు శూరను పెట్టండి. ఈ పేరుకు అర్థం వీరుడు.

అజేష్

అజేష్ అనే పేరు అర్థం చమత్కారంగా ఉండేవాడు, జీవితపు రుచిని ఆస్వాదించేవాడు అని భావం.

తేజస్

హనుమంతుని తేజస్ అనే పేరుతో కూడా పిలుస్తారు. తేజస్ అనే పేరు అర్థం ప్రకాశవంతమైన, తేజోభరితమైనది అని. ఈ పేరు పిల్లలకు పెట్టడం వల్ల వారి జీవితం కూడా అంతే ప్రకాశవంతంగా వెలిగిపోతుందట.

సంజీవన్

ఈ పేరు జీవితం, శక్తిని సూచిస్తుంది. ఇది సంజీవనిలా జీవితంలో కొత్త శక్తి, ఉత్సాహాన్ని తెస్తుంది.

హను

ప్రస్తుత ట్రెండ్‌కు సరిపడేలా షార్ట్‌గా ఉండే ఈ పేరు హనుమంతుడి పేరుకు క్యూట్ షార్ట్ కట్.

వాయుమాన్

వాయుదేవుని కుమారుడితో పాటు హనుమాన్ లోని చివరి రెండక్షరాలు కలిపితే వాయుమాన్.

మార్వాన్

మారుతి + హనుమాన్ పేర్లను కలిపితే వచ్చే మార్వాన్. ఇది కూడా ఆంజనేయుడి పేరే.

అంజి

ఆంజనేయుడి పేర్లు ఎన్ని ఉన్నా అంజి అనే పేరులో ఉన్న తేజస్సు మరో పేరులో లేదు. ఈ పేరు పెట్టుకున్న వారికి తిరుగుండదని భావిస్తారు. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే కాస్త మోడ్రన్ టచ్ ఇచ్చి అంజి అనే పదాన్ని ముందు చేర్చేయండి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం