ఎండలో తిరిగొచ్చినవారికి ఇలా పుదీనా డ్రింక్ చేసి ఇవ్వండి, ప్రాణం లేచొస్తుంది-give this mint drink to someone who has just returned from the sun know the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఎండలో తిరిగొచ్చినవారికి ఇలా పుదీనా డ్రింక్ చేసి ఇవ్వండి, ప్రాణం లేచొస్తుంది

ఎండలో తిరిగొచ్చినవారికి ఇలా పుదీనా డ్రింక్ చేసి ఇవ్వండి, ప్రాణం లేచొస్తుంది

Haritha Chappa HT Telugu

వేసవిలో శరీరానికి చలువ చేసే ఆహారాలు చాలా ముఖ్యం. ముఖ్యంగా ఎండల్లో ద్రవాహారాన్ని అధికంగా తీసుకోవాలి. వేడికి గురైతే అనారోగ్యం చేసే అవకాశం ఉంది. ఎండలో తిరిగి వచ్చిన వారికి పుదీనా పానీయం ఇలా చేసి ఇవ్వండి. వారు వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు.

పుదీనా డ్రింక్ రెసిపీ (shutterstock)

వేసవిలో అకస్మాత్తుగా ఇంటికి అతిథులు వస్తే వారికి కూల్ డ్రింక్స్ ఇస్తారు. కూల్ డ్రింక్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎండలో వచ్చినవారికి శరీరానికి చలువ చేసే పానీయాన్ని ఇవ్వాలి. ఇక్కడ మేము పుదీనా రిఫ్రెష్ డ్రింక్ రెసిపీ ఇచ్చాము. దీని రుచి అద్భుతంగా, చాలా రిఫ్రెష్ గా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరచడానికి కూడా సహాయపడుతుంది.

పుదీనాలో కూలింగ్ గుణాలున్నాయి. ఇది వేసవిలో శరీరాన్ని లోపలి నుండి చల్లబరుస్తుంది. కాబట్టి ఇంట్లో ఎండ నుంచి బయటకు వచ్చిన వారికి ఈ డ్రింక్ బాడీ హీట్ ను కంట్రోల్ చేయడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని తయారు చేయడం చాలా సులభం. రెసిపీని నోట్ చేసుకోండి.

పుదీనా డ్రింక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

తాజా పుదీనా ఆకులు - ఒక కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

పంచదార - పావు స్పూను

నిమ్మరసం - రెండు స్పూన్లు

ఐస్ క్యూబ్స్ - మూడు

స్ప్రైట్ లేదా సోడా - ఒక గ్లాసు

పుదీనా పానీయం రెసిపీ

  1. ముందుగా పుదీనా ఆకులను శుభ్రం చేసి మిక్సీ జార్ లో వేయాలి.
  2. అందులో పంచదార వేసి బాగా కలుపుకోవాలి.
  3. ఒక గ్లాసులో పుదీనా ఆకుల మిశ్రమాన్ని వేయాలి. అందులో నిమ్మరసం, ఉప్పు వేసి కలపాలి.
  4. అందులో సోడా లేదా స్పైట్ వేయాలి.
  5. వాటిలో ఐస్ క్యూబ్స్ కూడా వేయాలి. అంతే టేస్టీ పుదీనా పానీయం రెడీ అయినట్టే.

అతిథులు హఠాత్తుగా ఇంటికి వస్తే అక్కడ వారికి కూల్ డ్రింక్స్ కన్నా ఈ పుదీనా పానీయాన్ని ఇవ్వండి. ఇది చాలా రుచిగా ఉండడమే కాదు శరీరానికి ఎంతో చలువ చేస్తుంది.

గ్లాసులో సర్వ్ చేసేటప్పుడు పానీయాన్ని కొద్దిగా గార్నిష్ చేసుకుంటే మంచిది. గ్లాసు నోట్లో కొద్దిగా నిమ్మరసం వేసి బ్లాక్ సాల్ట్ తో గార్నిష్ చేసి ఆ తర్వాత పానీయాన్ని సర్వ్ చేయాలి. ఇలా చేయడం వల్ల సింపుల్ డ్రింక్స్ కూడా ప్రత్యేకం అవుతాయి.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం