Lakshmi devi Babygirl Names: మీ ఇంటి ఆడపిల్లకు ఈ లక్ష్మీదేవి పేర్లను పెట్టండి, వారికంతా మంచే జరుగుతుంది
Lakshmi devi Babygirl Names: లక్ష్మీదేవిని అదృష్టానికి, సంపదకు అధిదేవతగా పిలుస్తారు. ఇంట్లో పుట్టిన ఆడపిల్లలకు లక్ష్మీదేవి పేరు పెట్టాలని ఎంతోమంది మొక్కుకుంటారు. ఇక్కడ మేము కొన్ని లక్ష్మీదేవి పేర్లను ఇచ్చాము. మీకు నచ్చిన వాటిని మీ ఆడపిల్లలకు పెట్టుకోవచ్చు
Lakshmi devi Babygirl Names: ఇంట్లో సంపద వెల్లివిరియాలన్నా, ఆర్థికంగా కలిసి రావాలన్న లక్ష్మీదేవిని పూజించాల్సిందే. ఆ శ్రీ మహా విష్ణువు భార్య లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలోని ఎన్నో రకాల దురదృష్టాలు తొలగిపోతాయని అంటారు. ఆమె జీవితంలో కావలసిన అన్ని సౌకర్యాలను, విలాసాలను, డబ్బును అందిస్తుందని నమ్ముతారు. అందుకే లక్ష్మీదేవికి భక్తులు ఎక్కువ. ఇంట్లో ఆడపిల్ల పుడితే చాలు... ఆ అమ్మాయికి లక్ష్మీదేవి పేరు కలిసొచ్చేలా పెట్టాలని అనుకుంటారు. ఆధునిక కాలంలో అందమైన లక్ష్మీదేవి పేర్లను ఇక్కడ మీకు ఇచ్చాము. ఇవి ఆధునికంగానూ, కొత్తగానూ, చక్కగాను ఉంటాయి. మీ ఇంటి ఆడపిల్లకు ఇందులో మీకు నచ్చిన పేరును ఎంపిక చేసి పెట్టండి. వాటి అర్థాలను కూడా మేము ఇక్కడ ఇచ్చాము.
అదితి
ఈ పేరుకి అర్థం సూర్యుని వంటి తేజస్సు గల అమ్మాయి అని.
అననయా
ఈ పేరుకు అర్థం ఆమె దయతో కూడిన అమ్మాయి అని.
అంబుజా
అంబుజా అనే పేరుకు అర్థం కమలం నుండి వికసించిన లక్ష్మీదేవి అని.
భాగ్యశ్రీ
పుట్టుకతోనే ఆమె స్వయంగా అదృష్టవంతురాలు అని చెప్పడానికి ఈ పేరును వాడతారు.
దీత్య
అందరి ప్రార్థనలకు సమాధానం ఇచ్చే లక్ష్మీదేవి అని అర్థం.
ధృతి
దృఢ సంకల్పం, ధైర్యానికి శక్తి స్వరూపిని అని అర్థం.
ఈషాని
ఈషాని అంటే శ్రీమహావిష్ణువు భార్య అని అర్థం.
క్షీరస
క్షీరస అంటే పాలసముద్రంలో నివసించే లక్ష్మీదేవి అని అర్థం.
లోహిత
కెంపుల వంటి ప్రకాశవంతమైన ముఖం కలిగిన లక్ష్మీదేవి అని అర్థం.
మానుషి
మానుషి అంటే దయగల లక్ష్మీదేవి అని అర్థం.
నందిక
ఎప్పుడు సంతోషంగా ఉండే అమ్మాయి అని అర్థం.
నారాయణి
విష్ణువులో సగభాగమైన లక్ష్మీదేవి అని అర్థం.
ప్రమాత్మిక
ప్రతి చోటా ఉండే దేవత అని అర్థం.
శాన్వి
అందరూ అనుసరించే చక్కని గుణం కల వ్యక్తి అని అర్థం.
శుచి
స్వచ్ఛమైన హృదయం కల అమ్మాయి అని అర్థం.
శ్రియా
మంచి గుణముకల వ్యక్తి అని అర్థం.
శ్రీజ
కీర్తి సంపద కలిగిన వ్యక్తి అని అర్థం.
శ్రిదా
అందం, బలం, సౌభాగ్యం కలిగిన లక్ష్మీదేవి అని అర్థం.
సుదీక్ష
ప్రతి పనిని ఆరంభించడంతోనే విజయవంతం చేసే వ్యక్తి అని అర్థం.
సుప్రసన్న
ఇప్పుడు సంతోషంగా, సంతృప్తిగా జీవించే వ్యక్తి అని అర్థం.
విభా
విభా అంటే నిత్యం ప్రకాశించే వ్యక్తి అని అర్థం.
వసుధ
అందరికీ దానాలు ధర్మాలు చేసే ధర్మదేవత అని అర్థం.
పైన ఇచ్చిన పేర్లలో మీకు నచ్చిన పేరుని మీ అమ్మాయికి పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి పేరు పెట్టుకోవాలని చాలామంది మొక్కుతూ ఉంటారు. అలాంటివారు ఈ పేర్లలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసి మీ ఇంటి ఆడపిల్లకు పెట్టుకోండి. ఆ లక్ష్మీదేవి మీకు అన్ని రకాలుగా కరుణాకటాక్షాలను అందిస్తుంది.
టాపిక్