Childrens day speech Telugu: బాలల దినోత్సవానికి ఇలా స్ఫూర్తివంతంగా ప్రసంగించండి, సింపుల్ చిల్డ్రన్స్ డే స్పీచ్‌లు ఇవిగో-give an inspirational speech on childrens day here are simple childrens day speeches ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Childrens Day Speech Telugu: బాలల దినోత్సవానికి ఇలా స్ఫూర్తివంతంగా ప్రసంగించండి, సింపుల్ చిల్డ్రన్స్ డే స్పీచ్‌లు ఇవిగో

Childrens day speech Telugu: బాలల దినోత్సవానికి ఇలా స్ఫూర్తివంతంగా ప్రసంగించండి, సింపుల్ చిల్డ్రన్స్ డే స్పీచ్‌లు ఇవిగో

Haritha Chappa HT Telugu
Nov 13, 2024 11:30 AM IST

Childrens day speech: చిల్డ్రన్స్ డే వచ్చిందంటే బాలలకు పండగే. ఆ రోజున పిల్లల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే పిల్లలు బాలల దినోత్సవం సందర్భంగా ప్రసంగించాల్సి రావచ్చు. ఇక్కడ మేము కొన్ని సింపుల్ స్పీచ్‌లను ఇచ్చాము.

బాలల దినోత్సవం స్పీచ్
బాలల దినోత్సవం స్పీచ్ (Pixabay)

పిల్లలంటే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కు ఎంతో ప్రేమ. అందుకే పిల్లలంతా ఆయన్ను చాచా నెహ్రూ అని పిలిచేవారు. ఆయన జన్మ దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది నవంబర్ 14న బాలల దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. బాలలకు ప్రేమను, సంరక్షణను, నాణ్యమైన విద్యను ఇవ్వడమే ఈ బాలల దినోత్సవ ముఖ్య ఉద్దేశం. ఈ బాలల దినోత్సవం సందర్భంగా స్కూళ్లల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పోటీలు ఎన్నో జరుగుతాయి. అలాగే పిల్లలు బాలల దినోత్సవం సందర్భంగా ప్రసంగించాల్సి వస్తుంది. పిల్లలకు అర్థమయ్యేలా, సులువుగా నేర్చుకునేలా ఇక్కడ కొన్ని చిల్డ్రన్స్ డే స్పీచ్ లను అందించాము.

చిల్డ్రన్స్ డే స్పీచ్‌లు తెలుగులో

 

1. ప్రతి ఒక్కరికీ నమస్కారం.

ఈరోజు మనం బాలల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇది పిల్లలను ఉత్సాహపరచడానికి, వారిని గౌరవించటానికి అంకితం చేసిన రోజు. పిల్లలను ఎంతో ప్రేమించే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జ్ఞాపకార్థం ఈ బాలల దినోత్సవం మనమందరం వైభవంగా నిర్వహించుకుంటున్నాం. ఈ ప్రత్యేకమైన రోజున ప్రతి పిల్లలకు ప్రేమ, గౌరవం, వారు భవిష్యత్తులో ఎదగడానికి అవకాశాలు ఇవ్వాలని గుర్తుంచుకోండి. వారి కలలను నిజం చేసేందుకు పెద్దలుగా మీ వంతు సాయాన్ని చేయాలని గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.

2. అందరికీ గుడ్ మార్నింగ్.

ఈరోజు మనం బాలల దినోత్సవాన్ని ఎంతో ఆనందంగా నిర్వహించుకుంటున్నాం. ప్రతి ఏడాది నవంబర్ 14న ఈ దేశానికి పిల్లలే పునాది అని నమ్మిన మన మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూను మనం స్మరించుకుంటాము. పిల్లలు వికసించాల్సిన మొగ్గలని జవహర్ లాల్ నెహ్రూ నమ్మేవారు. అందుకే వారికి సురక్షితమైన, సంతోషకరమైన భవిష్యత్తును ఇవ్వాలని వారు ఆనందకరమైన వాతావరణంలో పెరగాలని ఆయన భావించేవారు. అందుకే పిల్లల కోసం ఆయన జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవంగా మార్చారు. నా ప్రియమైన స్నేహితులకు నేను చెప్పేది ఒకటే... ఈ ప్రపంచం మీ కోసం ఎన్నో అవకాశాలను దాచి ఉంచింది. మీరు మీ భవిష్యత్తును ఈ దేశంలో ఎంతో చక్కగా నిర్మించుకోగలరు. ప్రతి బిడ్డ భవిష్యత్తు కోసం పెద్దలంతా పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

3. పిల్లలకు ఈ బాలల దినోత్సవం ఎంతో ముఖ్యమైనది. ఇది వారి గుర్తింపుకు చిహ్నం. వారు ఈ ప్రపంచంలో ఎంతో ముఖ్యమైన వారిని తెలియజేసేందుకు ఈ బాలల దినోత్సవం ప్రతి ఏడాది వస్తుంది. పిల్లలే దేశ భవిష్యత్తుకు కీలకమని నమ్మిన భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. రాజ్యాంగం కల్పించిన ప్రతి హక్కును పిల్లలకు అందించే బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజానిదే. పిల్లలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎదగడానికి, నేర్చుకునే సామర్థ్యాలను పెంపొందించడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. నేటి పిల్లలే రేపటి దేశానికి నిజమైన శక్తి రూపాలు. వారికి విద్య అవకాశాలు సృష్టించాల్సిన బాధ్యత నేటి పెద్దలకు ఉంది. ప్రతి బిడ్డ కలలు కనే ప్రపంచాన్ని మీరు ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.

4. నా ప్రియమైన స్నేహితులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీ గురించే మాట్లాడాలనుకుంటున్నాను. మీరంతా పెద్దగా కలలు కనండి. ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండండి. ఆసక్తిని, ఏకాగ్రతను ఏమాత్రం విడనాడకండి. పెద్దలపట్ల దయ, గౌరవం, కరుణను కలిగి ఉండండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఈ ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చే శక్తి నేటి పిల్లలు రేపటి పౌరులైన మనకే ఉంది. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను. నేటి పిల్లలను పోషించే, రక్షించే బాధ్యత మీదే. మీరు ఆ వాగ్దానాన్ని మాకు ఇవ్వాలి. బాలల దినోత్సవం అనేది పిల్లల కలలకు మద్దతు ఇవ్వడమే, వారిని కాపాడటమే, వారి జీవితాలకు అవకాశాలతో నిండిన భవిష్యత్తును మార్గదర్శకత్వం చేయడమే. మీరు మీ బాధ్యతను గుర్తుంచుకొని నడుస్తారని కోరుకుంటూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.

5. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మన మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు. అతను పిల్లల పట్ల ఎంతో గొప్ప ఆప్యాయతను చూపించేవారు. బాలల దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, సమాజంలో పిల్లల ప్రాముఖ్యతను చెప్పే సందర్భం. నేటి పిల్లలు రేపు యువతగా మారాక వారిపైన ఈ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందుకే ఈరోజు విద్య, ఆరోగ్యం ప్రతి బిడ్డకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. పిల్లల నేపథ్యంతో సంబంధం లేకుండా వారి సంరక్షణలో కలలను కాపాడే బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులదే. పిల్లలకు మంచి ప్రపంచం సృష్టించి ఇస్తే... వారు మరిన్ని ఘనతలు సాధించే అవకాశం ఉంటుంది. ఈ బాలల దినోత్సవంనాడు పిల్లలందరినీ నేను ఒకటే కోరుతున్నాను... మీరు ఒకరి పట్ల ఒకరు దయతో ఉండండి. ఒకరికొకరు సహాయం చేసుకోండి. అందరం కలిసి ఎదుగుదాం. ఈ దేశాన్ని ముందుకు నడిపిద్.దాం నా స్నేహితులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.

Whats_app_banner