Idiyappam Breakfast । అల్పాహారంగా ఇడియప్పం.. దీనిని ఒకసారి తింటే అస్సలు విడిచిపెట్టం!-give a change to your routine breakfast try having idiyappam here is the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Give A Change To Your Routine Breakfast, Try Having Idiyappam, Here Is The Recipe

Idiyappam Breakfast । అల్పాహారంగా ఇడియప్పం.. దీనిని ఒకసారి తింటే అస్సలు విడిచిపెట్టం!

HT Telugu Desk HT Telugu
Mar 10, 2023 06:30 AM IST

Idiyappam Breakfast Recipe: ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ లోకి ఇడియప్పం తినిచూడండి, దీనిని తయారు చేసుకోవడం చాలా తేలిక, రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.

Idiyappam Recipe
Idiyappam Recipe (Pixabay)

మనం బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకున్నప్పుడు ఇడ్లీ, దోశ, పూరీ, వడ వంటి అల్పాహారాలు మనకు గుర్తుకొస్తాయి. ఇవి కాకుండా కొత్తగా ఏదైనా తినాలనుకుంటే ఏం చేయాలో ఏమీ తోచదు. ఆయితే కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల బ్రేక్‌ఫాస్ట్ మెనూ చూస్తే అక్కడ మరిన్ని కొత్త వంటకాలు కనిపిస్తాయి, అందులో ఇడియప్పం కూడా ఒకటి.

ఇడియప్పం కేరళకు చెందిన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. దీనిని నూల్ పుట్టు అని కూడా పిలుస్తారు. ఇది అక్కడ సాధారణంగా చేసుకునే అల్పాహారం. ఈ ఇడియప్పం చూడటానికి నూడుల్స్‌ను ఒకచోట ముద్దగా పోసినట్లు లేదా ఇడ్లీని నూడుల్స్‌గా విడగొట్టినట్లు అనిపిస్తుంది. అయితే ఇది కూడా బియ్యపు పిండితో చేసే ఒక అల్పాహారమే. మెత్తగా, మృదువుగా ఉండే ఈ ఇడియప్పంను చట్నీ లేదా కుర్మాతో తినవచ్చు. ఎంతో రుచికరంగా ఉంటుంది. అంతేకాదు ఇది పూర్తిగా శాకాహారం, గ్లూటెన్ రహిత వంటకం. ఇడియప్పం రెసిపీ ఇక్కడ చూసి, మీరూ ట్రై చేయండి.

Idiyappam Breakfast Recipe కోసం కావలసినవి

  • 1 కప్పు బియ్యం పిండి
  • 2 కప్పుల వరకు వేడి నీరు
  • 1/4 కప్పు తాజా తురిమిన కొబ్బరి (ఐచ్ఛికం)
  • 1/4 టీస్పూన్ ఉప్పు

ఇడియప్పం తయారీ విధానం

  1. ఇడియప్పం చేసేముందుగా ఇడ్లీ కుక్కర్ పాన్‌పై నూనె రాసి సిద్ధంగా ఉంచండి. అరటిఆకులను కూడా చతురస్రాకారంలో కట్ చేసి ఇడ్లీ అచ్చులపై ఉంచండి, నూనె చల్లండి.
  2. ఇప్పుడు బియ్యం పిండిని తీసుకొని దానిని లోతైన పెనంపై ఆవిర్లు వచ్చేంత వరకు వేగించండి,
  3. అనంతరం ఒక మిక్సింగ్ గిన్నెలోకి ఈ బియ్యం పిండిని తీసుకొని అందులో కొద్దిగా ఉప్పువేసి, కొన్ని వేడినీరు కలపండి. రొట్టెలకు చేసినట్లుగా మెత్తని పిండి ముద్దను చేయండి.
  4. ఇప్పుడు ఈ పిండిని ముర్కులు చేసుకునే మేకర్‌లో వేసి, నేరుగా ఇడ్లీ కుక్కర్ అచ్చులపై ఇడ్లీ సైజులో వేయండి. వీటిపైన తాజా కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు.
  5. అనంతరం మీడియం నుండి అధిక మంట మీద 9 నుండి 10 నిమిషాల పాటు ఇడియప్పమ్‌లను ఆవిరిలో ఉడికించండి. చేయండి. చివరగా ఇడియప్పమ్‌లను 1 నుండి 2 నిమిషాలు స్టీమర్ పాన్‌లో ఉంచండి.

అంతే, ఇడియప్పమ్‌ రెడీ.. మీకు నచ్చిన కూరతో తింటూ ఎంజాయ్ మాడి.

WhatsApp channel