Ginseng benefits: ఇది ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా కొని తెచ్చుకోండి, ఇదొక అద్భుతమైన మూలిక
Ginseng benefits: ఆయుర్వేదంలో అద్భుతమైన మూలికల్లో జిన్సెంగ్ ఒకటి. కానీ దీని గురించి చాలా తక్కువ మందికే తెలుసు.
Ginseng benefits: ఆయుర్వేదంలో వినియోగిస్తున్న ప్రభావంతమైన మూలికల్లో జిన్సెంగ్ ఒకటి. ఇది ఒక పురాతనమైన ఔషధం. ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది. ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రాచీన కాలం నుంచి జిన్సెంగ్ ను ప్రత్యేకంగా వినియోగిస్తారు. కొరియన్లు కూడా జిన్సెంగును కచ్చితంగా తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. ఈ మొక్కలు పానాక్స్ జాతికి చెందినవి. వాటి వేర్లనే జిన్సెంగ్ అంటారు. వీటిని అరుదైన ఔషధంగా చెప్పుకోవచ్చు. ఆధునిక వైద్యంలో దీన్ని వినియోగించడం ప్రారంభించారు.
జిన్సెంగ్ వేర్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే పాలీ ఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ వంటివి ఉంటాయి. దీన్ని తినడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఏ, పొటాషియం వంటి పోషకాలు నిండుగా ఉంటాయి. శారీరక ఆరోగ్యాన్నే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా జిన్సెంగ్ కాపాడుతుంది. దీన్ని శతాబ్దాలుగా సంప్రదాయ వైద్యంలో వినియోగిస్తూ వస్తున్నారు. శరీరాన్ని ఒత్తిడి బారిన పడకుండా కాపాడడంలో దీనికి సాటి లేదు. రోజువారి ఆహారంలో జిన్సెంగును కలిపి తినడం చాలా ముఖ్యం.
జ్ఞాపకశక్తి పెరగడానికి, ఏకాగ్రతను పెంచడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి జిన్సెంగ్ ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే న్యూరో ప్రొటెక్టివ్ ప్రభావాలు మెదడును ఎల్లవేళలా కాపాడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. కాబట్టి శరీరంలో ఉండే ఇన్ఫ్లమేషన్‌ను ఇది తగ్గిస్తుంది. ఈ వేర్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
తీవ్రంగా అలసిపోయిన శరీరానికి శక్తి స్థాయిలను అందించడంలో జిన్సెంగ్ ముందుంటుంది. ముఖ్యంగా అథ్లెట్లు జిన్సెంగ్ ను కచ్చితంగా తీసుకోవాలి. ఈ మూలికను తీసుకోవడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని నమ్ముతారు. కొన్ని అధ్యయనాలు ప్రకారం జిన్సెంగ్‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయని తెలుస్తోంది. కాబట్టి డయాబెటిస్ బారిన పడినవారు ప్రతిరోజు జిన్సెంగ్ ను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.
జిన్సెంగ్ సప్లిమెంట్లు, క్యాప్సూల్స్, పొడి రూపంలో లభిస్తుంది. లేదా ఈ వేర్లను కొని ఎండబెట్టి పొడి చేసుకుని కూడా వాడుకోవచ్చు. జిన్సింగ్ పొడిని లేదా వేర్ల ముక్కలను టీలో వేసి మరగ కాచి వడకట్టి తాగినా మంచిదే. అశ్వగంధ తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు పొందుతారో అంతకుమించి ఈ జిన్సెంగ్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. లైంగిక సమస్యలను కూడా ఇది పరిష్కరిస్తుంది. ఆహారంలో భాగం చేసుకోవాలనుకునేవారు ఆయుర్వేద వైద్యుల సలహాను పాటించడం చాలా ముఖ్యం.
టాపిక్