Uric Acid: శరీరంలోని యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ ఆయుర్వేద డ్రింక్‌‌తో సాధ్యమే, ఎప్పుడు తాగాలంటే-ginger tea is an ayurvedic drink that reduces uric acid in the body and has many benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Uric Acid: శరీరంలోని యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ ఆయుర్వేద డ్రింక్‌‌తో సాధ్యమే, ఎప్పుడు తాగాలంటే

Uric Acid: శరీరంలోని యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ ఆయుర్వేద డ్రింక్‌‌తో సాధ్యమే, ఎప్పుడు తాగాలంటే

Haritha Chappa HT Telugu

శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగినప్పుడు కీళ్లనొప్పులతో పాటు అనేక సమస్యలు శరీరాన్ని చుట్టుముడతాయి. యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంచేందుకు ప్రతిరోజూ అల్లం టీ తాగడం అలవాటు చేసుకోవాలి. అల్లం టీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

యూరిక్ ఆమ్లం తగ్గించుకునే చిట్కాలు ఇవిగో (Shutterstock)

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగే సమస్య ఈకాలంలో ఎక్కువగా ఉంది. దీని వల్ల కీళ్ల నొప్పులు బాధిస్తూ ఉంటాయి. యూరిక్ ఆమ్లం శరీరంలోని వ్యర్థ పదార్థం. ఇది ఆహారంలో ఉండే ప్యూరిన్ కారణంగా ఉత్పత్తి అవుతుంది. శరీరంలో అధిక యూరిక్ ఆమ్లం ఉత్పత్తి అయితే దాన్ని కిడ్నీలు ఫిల్టర్ చేయలేవు. దీంతో అవి స్ఫటికాల రూపంలో కీళ్ళలో పేరుకుపోవడం ప్రారంభిస్తుంది.

అందుకే శరీరంలో యూరిక్ ఆమ్లం అధికంగా ఉండే కీళ్ల నొప్పులు వేధిస్తాయి. యూరిక్ ఆమ్లం ఎక్కువైపోతే ఆర్థరైటిస్ తో పాటు అనేక ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అందువల్ల, శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ పరిమాణాన్ని తగ్గించడం అవసరం. ఇందుకోసం కొన్ని నేచురల్ ఆయుర్వేద వస్తువులను కూడా ఆశ్రయించవచ్చు. యూరిక్ ఆమ్లాన్ని సహజంగా తగ్గించడంలో సహాయపడే ఆయుర్వేద పానీయాల గురించి ఇక్కడ ఉంది.

గుగ్గల్ తో

గుగ్గల్ లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని అనేక రకాల ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తారు. గుగ్గుల్ సహాయంతో శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ ను కూడా తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదంలో పెయిన్ రిలీవర్ గా పిలిచే గుగ్గల్… కీళ్ల వాపు, నొప్పిని తగ్గించడానికి పనిచేస్తుంది. గుగ్గుల్ కషాయం తాగడం వల్ల శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ ను నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది.

గిలోయ్

గిలోయ్ ను యాంటిపైరెటిక్ హెర్బ్ గా పిలుస్తారు. దాని వందలాది ప్రయోజనాలతో పాటు, ఇది శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక వ్యక్తికి అధిక యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే, అతను తన దినచర్యలో గిలోయ్ ఆకుల తాజా రసం లేదా గిలోయ్ టీని చేర్చాలి. ఇది యూరిక్ యాసిడ్ ను నేచురల్ గా తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

అల్లం టీ యూరిక్ యాసిడ్ ను నియంత్రిస్తుంది

అల్లంలో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉండే అల్లం తినడం వల్ల వాపు, నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నీటిలో 4-5 నిమిషాలు మరిగించి, ఆపై ఒక కప్పులో వడకట్టండి. ఇప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం పిండాలి. అల్లం హెర్బల్ టీ రెడీ.

దాల్చిన చెక్క టీ

దాల్చినచెక్క టీ శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్కలో ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్కతో తయారు చేసిన హెర్బల్ టీ తాగడం వల్ల శరీరంలో పెరిగిన యూరిక్ యాసిడ్ ను చాలా వరకు నియంత్రించవచ్చు.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం