Ghee Coffee: డీజే టిల్లూ వేసుకున్నట్లు కాఫీలో నెయ్యి వేసుకుని తాగితే నిజంగా బరువు తగ్గుతారా, వాస్తవమిదే!
Ghee Coffee: కాఫీలో నెయ్యి వేసుకుని తాగడం ట్రెండ్ ఏమో కానీ, దాని వల్ల ప్రయోజనాలు కూడా నెవర్ ఎండ్. ముఖ్యంగా మలబద్దకం ఉన్న వాళ్లకు, జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఈ టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలు అదంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే చదివేయండి మరి!

శరీరంలో కలిగే అనేక అనారోగ్య సమస్యలకు మూలం మలబద్దకం. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి మీరు చాలా టెక్నిక్స్, మెడిసిన్స్ వినియోగించి ఉంటారు. వాటన్నిటి కంటే సులువైనది, తక్కువ ధరలో అయిపోయేది, అనేక ప్రయోజనాలను అందించేది ఈ నెయ్యి కాఫీ. పేగుల్లో ల్యూబ్రికెంట్ మాదిరిగా మారి మల విసర్జన సాఫీగా జరగడానికి కారణమవుతుంది. అంతేకాకుండా దీనిని రోజు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయట.
నెయ్యి కాఫీ:
కాఫీలో ఒక స్పూన్ నెయ్యి లేదా వెన్న వేసుకోవడాన్ని నెయ్యి కాఫీ అంటారు. ఇలా తాగడం వల్ల నెయ్యిలో ఉండే మృదుత్వం కూడా కాఫీలో కనిపిస్తుంది. అంతేకాకుండా ఫ్లేవర్ మారి అద్భుతమైన సువాసన వెదజల్లుతుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగై, మలబద్దకం సమస్య రాకుండా చేస్తుంది.
నెయ్యిలో ఉండే బ్యూటరిక్ యాసిడ్‌తో పేగుల్లో ఆరోగ్యం
నెయ్యిలో బ్యూటిరిక్ యాసిడ్ అధిక మొత్తంలో ఉంటుంది. దీని కారణంగా కాలనాసైట్స్ ఎక్కువగా అంది పేగుల్లో బౌల్ మూమెంట్స్ కు కారణమవుతుంది. ఆ విధంగా మల విసర్జన సాఫీగా జరుగుతుందట.
మలబద్దకంపై కాఫీ పనితీరు
కాఫీ తీసుకోవడం వల్ల కాలనిక్ మోటర్ పనితీరు మెరుగవుతుంది. కాఫీలో ఉండే కెఫైన్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలను తగ్గిస్తుంది. ఈ విధంగా కాఫీ తాగిన వారిలో మల విసర్జన చేయడానికి ఎక్కువ సమయం పట్టదు.
మల విసర్జన సాఫీగా జరిగేందుకు:
మలబద్దకం ఉన్నవారు కాఫీలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల, సులువుగా మల విసర్జన చేయగల్గుతారు. గంటల తరబడి బాత్రూంలలో కూర్చోవాల్సిన అవసరం ఉండదు కూడా. అప్పటికే పేరుకుపోయి ఉన్న వ్యర్థాలను బయటకు పంపేయడంతో జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగవుతుంది.
నెయ్యి కాఫీని ఎప్పుడు, ఎలా తీసుకోవాలంటే:
ఉదయాన్నే పరగడుపున కాఫీ తాగాలనుకునే వారు అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కలుపుకుని తాగేయండి. సాధ్యమైనంత వరకూ బ్లాక్ కాఫీలో నెయ్యి వేసుకుని తాగడానికే ప్రయత్నించండి. ఒకవేళ మీకు కాఫీలో ఉండే కెఫైన్ సరిపడదని అనిపిస్తే, దానికి బదులుగా హెర్బల్ టీ కలుపుకుని అందులో నెయ్యి వేసుకోండి. మీకు మలబద్దకం సమస్య కనిపించకుండా పోతుంది.
దీని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్
కాఫీలో నెయ్యి వేసుకుని తాగడం వల్ల మలబద్దకం సమస్య పోతుంది. ఆ విషయం పక్కకుపెడితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయట.
కేలరీలు ఎక్కువ
నెయ్యిలో ఉండే కేలరీలతో పాటు కాఫీలో ఉండే కేలరీలు కూడా కలవడంతో ఎక్కువ కేలరీలు శరీరంలోకి చేరిపోతాయి. ఫలితంగా బరువు పెరిగే అవకాశం ఉంది.
కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగడం
నెయ్యిలో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్స్ లో డెన్సిటీ లిపోప్రొటీన్ (LDL)ను పెంచుతాయి. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.
జీర్ణక్రియలో ఆటంకం
కొందరిలో జీర్ణక్రియ సాఫీగా జరగకపోవడం కనిపించొచ్చు. అంటే విరేచనాలు, కడుపు ఉబ్బరం వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పాలు తీసుకోవడం వల్ల ముందుగానే ఆరోగ్య సమస్యలు వచ్చే వారు నెయ్యి కాఫీ తీసుకోకపోవడమే బెటర్.
సంబంధిత కథనం