వేసవి కాలంలో చల్లని పానీయాలకు గిరాకీ ఎక్కువగానే ఉంటుంది. ఈ సీజన్‌లో చాలామంది తమ దాహాన్ని తీర్చుకోవడానికి శరబత్, పన్నీర్ సోడా, ఐస్ టీ వంటివి అధికంగా తాగుతుంటారు. అయితే, కాఫీ ప్రియులకు మాత్రం చల్లని కోల్డ్ కాఫీ ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. ఐస్, పాలు, కాఫీతో తయారు చేసుకునే ఈ పానీయం ఎంతో రుచికరంగా ఉంటుంది. ఐస్డ్ కాఫీ, కోల్డ్ బ్రూ, చాక్లెట్ కోల్డ్ కాఫీ ఇలా అనేక రకాలుగా దీన్ని తయారు చేసుకోవచ్చు.
అయితే చాలా మంది బాధపడే విషయం ఏంటంటే.. కోల్డ్ కాఫీని ఎన్ని సార్లు ట్రై చేసినా కెఫె స్టైల్ రుచి రాదు. మీరు కూడా ఇదే ఫీలింగ్ తో ఉన్నట్లయితే ఇకపై మీకా బాధ ఉండదు. ఈ సారి కోల్డ్ కాఫీని తయారు చేసటప్పుడు ఇక్కడున్న చిట్కాలను పాటించారంటే.. కెఫే లాంటి కోల్డ్ కాఫీ టేస్ట్ దిగిపోతుందంతే. ఇందుకోసం మీ పాటించాల్సిన సీక్రెట్ టిప్స్ ఏంటో చూసేద్దాం రండి.
కోల్డ్ కాఫీ రుచిగా ఉండాలంటే, దానిని బాగా బ్లెండ్ చేయడం చాలా అవసరం. మీ దగ్గర కాఫీ బ్లెండర్ లేకపోతే, షేకర్ లేదా హ్యాండ్ విస్క్‌ను ఉపయోగించవచ్చు. పాలు, కాఫీ మిశ్రమం నుంచి నురుగు వచ్చే వరకు బాగా కలపాలి.
సాధారణంగా కోల్డ్ కాఫీని పాలు, ఐస్, కాఫీ పొడితోనే తయారు చేస్తారు. కానీ కెఫే లాంటి రుచి కోసం, కొద్దిగా చాక్లెట్ సిరప్‌ను కలపాలి. ఇదే కెఫై స్టైల్ సీక్రెట్.
కెఫేలో కోల్డ్ కాఫీ చాలా చిక్కగా ఉంటుంది. ఇంట్లో చేసినప్పుడు పలుచగా వస్తుంది. ఎందుకంటే వాళ్లు బ్లెండ్ చేసేటప్పుడు కొద్దిగా వెనీలా ఐస్ క్రీమ్‌ను కలపుతారు. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి.
కోల్డ్ కాఫీకి మరింత మంచి రుచి రావాలంటే, పాలను ముందుగా కాసేపు ఫ్రిజ్‌లో ఉంచండి. అవి కొద్దిగా గడ్డకట్టిన తర్వాత కాఫీ కోసం ఉపయోగించండి. బ్లెండ్ చేసేటప్పుడు కొన్ని ఐస్ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి.