Bombay Sandwich | సండే రోజున శాండ్‌విచ్‌‌తో బ్రేక్‌ఫాస్ట్, ఇలా చేసుకోండి ఫటాఫట్!-get bewitched this sunday morning with sandwich breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Get Bewitched This Sunday Morning With Sandwich Breakfast

Bombay Sandwich | సండే రోజున శాండ్‌విచ్‌‌తో బ్రేక్‌ఫాస్ట్, ఇలా చేసుకోండి ఫటాఫట్!

HT Telugu Desk HT Telugu
Jun 05, 2022 09:40 AM IST

సండే రోజున శాండ్‌విచ్ చేసుకుంటే ఎంతో సంతోషంగా తినాలనిపిస్తుంది. మీ కోసం ఇక్కడ రెండు రుచికరమైన శాండ్‌విచ్ రెసిపీలు అందించాం. ఫటాఫట్ పది నిమిషాల్లో సిద్ధం చేసుకుని, తీరిగ్గా తింటూ ఆస్వాదించండి

Sandwich
Sandwich (Pixabay)

ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్‌లు హడావిడిగా చేసేస్తాము. త్వరగా ఏదో ఒకటి తయారుచేసుకొని, త్వరత్వరగా తినేసి ఉరుకులు పెడతాం. ఇంట్లో స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే స్కూల్ వాహనం హారన్ మోగించగనే తినకుండా వెంటనే పరుగెత్తుతారు. ఆఫీసుకు లేట్ అవుతుందని అల్పాహారం సిద్ధం చేసి ఉన్నా తినకుండా వెళ్తారు. ఇలా చాలా సందర్భాల్లో బ్రేక్‌ఫాస్ట్‌‌ను సూపర్ ఫాస్ట్‌గా తినేయడమో లేకపోతే అసలే చేయకుండా వెళ్లడమో అవుతుంది. ఈరోజు ఆదివారం, కనీసం ఈ ఒక్కరోజైనా అల్పాహారాన్ని ఆప్యాయంగా తినండి. మీరు, మీ కుటుంబ సభ్యులంతా కలిసి ఒక కప్ కాఫీ తాగుతూ, మంచి మంచి కబుర్లు చెప్పుకుంటూ ఆదివారం ఉదయాన్ని అదరగొట్టండి.

మీకోసం చిటికెలో తయారు చేసుకునే సులభమైన సండే స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్‌ రెసిపీలు ఇక్కడ అందిస్తున్నాం. వీలైతే ట్రై చేయండి..

ఆమ్లెట్ శాండ్‌విచ్ కావాల్సినవి

  • 2 గుడ్లు
  • 1 తరిగిన ఉల్లిపాయ
  • 1 పచ్చి మిర్చి
  • 1/2 స్పూన్ మిరప పొడి
  • 1/2 స్పూన్ మిరియాల పొడి
  • రుచికి తగినంత

తయారీ విధానం

  1. ఒక గిన్నెలో రెండు గుడ్లు పగలగొట్టి విప్ చేయండి. ఇందులో తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం, మిరియాల పొడి, ఉప్పు వేయండి.
  2. ఇప్పుడు ఈ మిశ్రమం ఉండలు లేకుండా చిక్కగా, సమానంగా అయ్యేలా బాగా కలపండి.
  3. పాన్ వేడి చేసి కొద్దిగా నూనె పోసి ఆమ్లెట్ లాగా వేసుకోండి.
  4. మరోవైపు రెండు బ్రెడ్ ముక్కలకు వెన్నపూసి టోస్ట్ చేయండి.
  5. ఇప్పుడు ఈ టోస్ట్ చేసిన బ్రెడ్ ముక్కల మధ్యలో ఆమ్లెట్ పెడితే అదే ఆమ్లెట్ శాండ్‌విచ్.

బాంబే శాండ్‌విచ్‌ తయారీ విధానం

  1. రెండు బ్రెడ్ స్లైసులను తీసుకుని వాటిపై వెన్న పూయండి.
  2. ఆ తర్వాత ఒక బ్రెడ్ బ్రెడ్ స్లైస్‌ తీసుకొని దానిపై కొద్దిగా కొత్తిమీర చట్నీని పూయండి. ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేయండి.
  3. ఆపై దోసకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేయండి.
  4. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ పై సరిపడినంత ఉప్పు, చాట్ మసాలా చల్లుకోండి.
  5. ఇప్పుడు బ్రెడ్‌లను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా టోస్ట్ చేయండి.

అంతే బాంబే శాండ్‌విచ్‌ రెడీ అయినట్లే. ఇలా ఆమ్లెట్ శాండ్‌విచ్‌, బాంబే శాండ్‌విచ్‌ రెండూ సిద్ధం చేసుకోండి. వేడివేడిగా ఆరగించండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్