జెస్టేషనల్ డయాబెటిస్: గర్భిణీ స్త్రీలకు వచ్చే నిశ్శబ్ద ముప్పు ఇది, దీన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఇలా చేయండి-gestational diabetes this is the silent threat to pregnant women heres what you can do to keep it under control ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  జెస్టేషనల్ డయాబెటిస్: గర్భిణీ స్త్రీలకు వచ్చే నిశ్శబ్ద ముప్పు ఇది, దీన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఇలా చేయండి

జెస్టేషనల్ డయాబెటిస్: గర్భిణీ స్త్రీలకు వచ్చే నిశ్శబ్ద ముప్పు ఇది, దీన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఇలా చేయండి

Haritha Chappa HT Telugu

గర్భం ధరించిన స్త్రీలలో కొన్నిసార్లు జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ సమస్య వచ్చిన తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. రక్తపోటు నుండి హృదయ సంబంధ సమస్యల వరకు జెస్టేషనల్ డయాబెటిస్ వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో ఇక్కడ వివరించాము.

జెస్టేషనల్ డయాబెటిస్ (Shutterstock)

జెస్టేషనల్ డయాబెటిస్ మెల్లిటస్ (జిడిఎం) అనేది గర్భధారణ సమయంలో మహిళల్లో వచ్చే వ్యాధి. ఈ డయాబెటిస్ వచ్చిన గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరిలో ప్రసవం తరువాత ఈ డయాబెటిస్ అదుపులోకి వచ్చేస్తుంది. కానీ కొందరికి మాత్రం అది టైప్ 2 డయాబెటిస్ గా మారి జీవితాంతం కొనసాగుతుంది.

జెస్టేషనల్ డయాబెటిస్ వల్ల తల్లికి, పుట్టబోయే బిడ్డకు కూడా ఎన్నో ఆరోగ్య ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి జాగ్రత్తలు గర్భిణీలు తెలుసుకోవాలి.

ముంబైలోని డయాబెటిస్ & వెల్నెస్ క్లినిక్ యొక్క డయాబెటాలజిస్ట్, ఫిజీషియన్ డాక్టర్ శుభశ్రీ పాటిల్ హెచ్టి లైఫ్‌స్టైల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం జెస్టేషనల్ డయాబెటిస్ అనేది నిశ్శబ్ద ముప్పుగా పనిచేస్తుంది. రక్తపోటు, అంటువ్యాధులు, హృదయ సంబంధ సమస్యలు వంటి పరిస్థితులను ఇది తీవ్రతరం చేస్తుంది. ఇది చివరికి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. అందుకే జెస్టేషనల్ డయాబెటిస్ విషయంలో అవగాహనను పెంచాల్సిన అవసరం ఉంది.

జెస్టేషనల్ డయాబెటిస్ రావడానికి కారణాలు

గర్భధారణ సమయంలో గర్భిణీ వయస్సు, ఊబకాయం,అధిక బరువు పెరగడం, డయాబెటిస్ కుటుంబ చరిత్ర వంటివన్నీ కూడా జెస్టేషనల్ డయాబెటిస్ కు కారణం అవుతాయి. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఉన్నవారు కూడా జెస్టేషనల్ డయాబెటిస్ ను ప్రేరేపించే ప్రమాద కారకాలుగా వైద్యులు చెబుతున్నారు.

తల్లిలోని ప్లాసెంటా దగ్గర హార్మోన్ల కారణంగా ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. దీని వల్ల కూడా జెస్టేషనల్ డయాబెటిస్ వస్తుంది. ఇది తల్లి జీవక్రియ ఒత్తిడితో కూడి ఉంటుంది. డయాబెటిస్ అదుపులో లేకపతే ఇది హైపర్గ్లైసీమియాకు దారితీస్తుంది.

మాతాశిశు మరణాలతో ఎలా ముడిపడి ఉంది?

జెస్టేషనల్ డయాబెటిస్ వల్ల ప్రీ ఎక్లాంప్సియా బారిన పడే అవకాశం ఉంది. సిజేరియన్ చేయాల్సిన పరిస్థితిని పెంచుతుంది. కొంతమందికి డెలివరీ అయిపోగానే తగ్గుతుంది. ఇది శస్త్రచికిత్స అనంతర సమస్యలు, ప్రసవానంతర రక్తస్రావం, పేలవమైన గ్లైసెమిక్ నియంత్రణ కారణంగా అంటువ్యాధులకు దారితీస్తుంది.

కొన్ని సందర్భాల్లో హృదయ సంబంధ సమస్యలు ప్రసూతి మరణానికి దారితీయవచ్చు. జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్న మహిళలకు సరిగ్గా నిర్వహించకపోతే గర్భధారణ సంబంధిత మరణాల ప్రమాదం మూడు రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

నివారణ చిట్కాలు

  1. అధిక ప్రమాదం ఉన్న మహిళల్లో ప్రారంభ స్క్రీనింగ్ మొదటి మూడు నెలల్లోనే చేయించుకోవాలి.

2. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.

3. శారీరక శ్రమ పెంచుకోవాలి.

4. ఇన్సులిన్ నిత్యం వాడుతూ ఉండాలి.

జెస్టేషనల్ డయాబెటిస్ నిశ్శబ్దంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒక్కోసారి దాని పరిణామాలు ప్రాణాంతకం కావచ్చు. ప్రసూతి మరణాలను అరికట్టడానికి ప్రారంభ రోగ నిర్ధారణ, ప్రసవానంతర సంరక్షణ చాలా అవసరం.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.