Friday Motivation: విజయం ఒక గమ్యం కాదు ప్రయాణం, జీవితాంతం సాగుతూనే ఉంటుంది
Friday Motivation: విజయం పొందాలంటే వ్యక్తి జీవితాంతం ప్రయాణం చేయాల్సిందే అంటున్నారు మోటివేషనల్ స్పీకర్ గౌర్ గోపాల్ దాస్. అయినా జీవితం గురించి మరిన్ని స్ఫూర్తివంతమైన వివరాలను అందించారు.
సన్యాసిగా మారిన ఇంజనీర్ గౌర్ గోపాల్ దాస్. తనదైన మార్గంలో లోతైన అంతర్దృష్టితో జీవితాన్ని మార్చే స్ఫూర్తివంతమైన ప్రసంగాలను ఇవ్వడంలో ఈయన దిట్ట. మోటివేషనల్ స్పీకర్ గౌడ్ గోపాల్ దాస్ మీ జీవితాన్ని మార్చే స్ఫూర్తివంతమైన ప్రసంగాన్ని అందించారు. ఆయన రచించిన ది జర్నీ హోమ్ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో అమ్ముడైంది. మనుషుల్లో మార్పును తెచ్చేందుకు స్ఫూర్తిని రగిలించేందుకు ఆయన ఎన్నో సెమినార్లు, వర్క్ షాప్ లో నిర్వహించారు. ఇప్పుడు జీవితం గురించి స్ఫూర్తివంతమైన వివరాలను అందించారు.
మిమ్మల్ని మీరు మార్చుకోండి
ఎప్పుడూ ఇతరులను లోపాలను ఎంచుతూ ఉంటాం. ఇతరుల్లో ఈ విషయాలు మారాలని కోరుకుంటాం. గోపాల్ దాస్ చెబుతున్న ప్రకారం ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఇతరులను మార్చే కన్నా మీరు మారడమే సులువు. మీరు కాకుండా మీ అంచనాలను ఇతరులు ఎవరు అందుకోలేరు. మీలోని లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దడానికి మీరే బాధ్యత వహించాలి. ఇతరులను నిందించడం మానేయండి. ఇతరులను మార్చలేరనే వాస్తవాన్ని అంగీకరించండి.
ఆనందం అనేది నగదు రూపంలోనూ, విలాసవంతమైన కార్ల రూపంలోనూ పొందలేమని.. అది ఆత్మసంతృప్తికి చెందినదని అంటున్నారు గోపాల్ దాస్. భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవడానికి వర్తమానంలో జీవించడం ఎంతోమంది మరిచిపోతున్నారని చెబుతున్నారు. ఆనందంగా ఉండాలనుకునేవారు వర్తమానంలోనే తమకున్న దాంతోనే సంతృప్తిగా జీవించాలని చెబుతున్నారు.
విజయం గమ్యం కాదు ప్రయాణం
చాలామంది విజయం అనేది ఒక చివరి స్టాప్ అనుకుంటారు. విజయం అనేది గమ్యం కాదు, ప్రయాణం. జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. మీకు ఎదురయ్యే విజయాలు చెక్ పాయింట్లు మాత్రమే. జీవితాంతం విజయవంతంగా నడవాలంటే మీరు ప్రయాణం చేస్తూనే ఉండాలి.
మార్పు ప్రతి ఒక్కరి జీవితంలో అనివార్యం. మీకు ఎదురవుతున్న ప్రతి మార్పును ఎదుర్కొంటూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే. మార్పును స్వీకరించడం నేర్చుకోండి. దానితోనే సరిపెట్టుకోండి. సమయానికి అనుగుణంగా ముందుకు సాగండి.
సేవ చేయడంలో ఎక్కువ ఆనందం దక్కుతుంది. మీ ప్రతిభను ఇతరుల మంచి కోసం ఉపయోగించి చూడండి. రెట్టింపు ఆనందం వస్తుంది. సమాజానికి ప్రయోజనం చేకూర్చే వాటిని సృష్టించడం ద్వారా మీ ప్రతిభా సామర్థ్యాలను ఉత్తమంగా మార్చుకోవచ్చు.
జీవితంలో మీరు సృష్టించే బంధాలు మీ తల్లిదండ్రులు, మీ తోబుట్టువులు, స్నేహితులు, భార్య మీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు. మీ జీవిత నాణ్యతను మెరుగుపరచాలంటే వారితో అనుబంధాలు కూడా మెరుగుపరుచుకోవాలి. వారితో ప్రేమగా ప్రవర్తించండి. ప్రతిరోజు వారిని పలకరించండి.