Garlic Prawns: వెల్లుల్లి రొయ్యల వేపుడు రెసిపీ ఇలా చేసి చూడండి, వదలకుండా ఊడ్చుకుని తినేస్తారు
Garlic Prawns: మీరు నాన్ వెజ్ లవర్ మీకోసం గార్లిక్ ప్రాన్స్ రెసిపీ ఇచ్చాము. ఇది చాలా రుచిగా ఉంటుంది. వెల్లుల్లి వేసి చేసే రొయ్యల వేపుడు ఇది అదిరిపోతుంది. రెసిపీ చాలా సులువు. ఒకసారి ప్రయత్నించండి.
రొయ్యలతో చేసే వంటకాలంటే ఇష్టమా? అందుకే మీకు ఈ వెల్లుల్లి రొయ్యల వేపుడు రెసిపీ కచ్చితంగా నచ్చుతుంది. ఇంట్లో వేడుకలు ఉంటే స్పెషల్ వంటకాలు ఉండాల్సిందే. ఇక్కడ మేము చెప్పిన గార్లిక్ రొయ్యలు ఫ్రై ట్రై చేసి చూడండి. చూస్తేనే నోరూరిపోతుంది. దీన్ని స్టార్టర్ లా తినవచ్చు. దీన్ని సైడ్ డిష్ లా కూడా తినవచ్చు. బిర్యానీ, బగారా రైస్ వంటి వాటితో ఈ రొయ్యల వేపుడు తింటే కాంబినేషన్ అదిరిపోతుంది. సాయంత్రం పూట ఆహ్లాదకరంగా ఉండటానికి ఇలాంటి స్టార్టర్లు తింటే యమ్మీగా అనిపిస్తుంది. మీకు మాంసాహారం తినడం ఇష్టం అయితే ప్రతిరోజూ చికెన్ వంటకాలు తిని విసుగ్గా అనిపిస్తే రొయ్యల వంటకాలు తినేందుకు ప్రయత్నించండి.
వెల్లుల్లి రొయ్యల వేపుడు రెసిపీకి కావాల్సిన పదార్థాలు
రొయ్యలు - ఒక కిలో
తరిగిన వెల్లుల్లి - రెండు స్పూన్లు
డార్క్ సోయా సాస్ - రెండు స్పూన్లు
నిమ్మరసం - రెండు స్పూన్లు
నల్ల మిరియాల పొడి - అర స్పూను
ఆలివ్ ఆయిల్ - రెండు స్పూన్లు
ఉల్లిపాయల తరుగు - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కసూరి మేథి - ఒక స్పూను
కారం - ఒక స్పూను
ఎండు మిర్చి పొడి - అర స్పూను
నీళ్లు - అర గ్లాసు
బటర్ - రెండు స్పూన్లు
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
వెల్లుల్లి రొయ్యల వేపుడు రెసిపీ
1. రొయ్యలు పరిశుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి. అందులో అర స్పూను ఉప్పు, ఒక స్పూను ఆయిల్, నిమ్మరసంట, మిరియాల పొడి వేసి బాగా కలపాలి.
2. రొయ్యలను ఒక అరగంట పాటూ మారినేట్ చేయాలి.
3. తరువాత స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేసి రొయ్యలను వేసి వేయించాలి. రొయ్యలను తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు అదే కళాయిలో ఒక స్పూను నూనె వేయాలి.
5. నూనె వేడెక్కా అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలను వేసి వేయించాలి.
6. అందులో కారం, ఎండుమిర్చి పొడి వేసి బాగా కలపాలి.
7. అందులో నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి.
8. అందులోనే బటర్ రెండు స్పూన్లు వేసి బాగా కలపాలి.
9. ఇఫ్పుడు రొయ్యలు వేసి బాగా కలపాలి.
10. ఇప్పుడు ఆ మిశ్రమంలోనే ఉప్పు, అర స్పూను మిరియాల పొడి, కొత్తిమీర తరుగు, కసూరి మేథి వేసి బాగా కలపాలి.
11. ఇది దగ్గరగా వేపుడులా అయ్యేదాకా ఉంచి తరువాత స్టవ్ కట్టేయాలి. అంతే టేస్టీ వెల్లుల్లి రొయ్యల వేపుడు రెడీ అయినట్టే
రొయ్యలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఎంత తిన్నా కూడా బరువు పెరగరు. పైగా వీటిని వండడం కూడా చాలా సులువు. ఎవరికైనా ఇవి బాగా నచ్చుతాయి.
టాపిక్