Balcony Plants: మీ బాల్కనీని అందంగా మార్చే అద్భుతమైన 6 మొక్కల గురించి తెలుసుకోండి! వీటిని పెంచుకోవడం చాలా సులువు కూడా
Balcony Plants: మీ ఇంటి బాల్కనీని మరింత అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారా? ఇక్కడ మీరు పెంచుకోదగిన కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి. ఇవి అందమైన పూలను అందించడంతో పాటు వేలాడే తీగలతో చూసేవారిని చాలా ఆకర్షిస్తాయి.
ఇంటిని అందంగా, ఆకర్షణీయంగా మార్చడంలో మొక్కల పాత్ర చాలా ఉంటుంది. ఇంట్లో, ఇంటి పరిసరాల్లో మొక్కలను పెంచడంలో చుట్టుపక్కల గాలి, వాతావరణం రెండూ శుద్ది అవుతాయి. మొక్కలు గాలిలోని కాలుష్యాలను తొలగించి, ఆక్సిజన్ విడుదల చేస్తాయి. వీటిని ప్రతిరోజూ చూడటం, వాటితో సమయాన్నిగడపడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, మనసుకు ప్రశాంతత కలుగుతుంది. మరింత ఉత్సాహంగా, ప్రశాంతంగా పనులు చేసుకోగలుగుతాం.
కొన్ని రకాల మొక్కలు గాలిలో తేమను పెంచి, శ్వాసకోశ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇన్ని ప్రయెజనాలున్న మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకోవడం ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుంది. మీరూ కూడా మీ ఇంటి బాల్కనీలో అందమైన ఆరోగ్యకరమైన మొక్కలను పెంచుకోవాలనుకుంటే ఇక్కడ కొన్ని మొక్కల జాబితా ఉంది. ఇవి మీ బాల్కనీని మరింత అందంగా, ఆకర్షణీయంగా మారుస్తాయి.
మీ బాల్కనీని ఆకర్షణీయంగా మార్చడానికి ఎలాంటి మొక్కలు నాటాలి?
మీ ఇంటి బాల్కనీలు అందంగా ఉండటం కోసం మీరు పూలు, వేళ్ళు పుష్కలంగా ఉంటే మొక్కలను పెంచుకోవాలి. ఇవి
1. పోయిన్ శెట్టియా(Poinsettia Plant)
మీ ఇంటికి, బాల్కనీకి అందమైన రూపాన్ని ఇవ్వాలనుకుంటే ముందుగా మీరు తెచ్చుకోవాల్సిన మొక్క పోయిన్ శెట్టియా(Poinsettia). క్రిస్మస్ స్టార్ ఆకారంలో ఉండే ఆకులతో అందంగా కనిపించే ఈ మొక్క చూసేవారిని ఇట్టేఆకర్షిస్తుంది. ఈ మొక్కకు ఎరుపు, గులాబీ, నారింజ రంగు పూలు పూస్తాయి. మీరు రంగు కలిగిన పూల మొక్కలను పెంచుకున్నా కూడా ఇది మీ బాల్కనీని చాలా అందంగా మారుస్తుంది. పోయిన్ శెట్టియా మొక్కను పెంచడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు.
2. పాషన్‌ఫ్లవర్(Passion Flower Plant)
పాషన్ పూల మొక్క లేదా పాషన్ ఫ్లోరా చెట్టు అని పిలిచే ఈ మొక్కకు చాలా అందమైన పూలు పూస్తాయి. ఇది చాలా అరుదుగా కనిపించే మొక్క అయినందున దీన్ని పెంచుకోవడం వల్ల మీ బాల్కనీకి అందమైన, భిన్నమైన రూపం దక్కుతుంది. ఇది మీ ఇంటి బాల్కనీలో ఉంటే చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. ఇది ఊదా, పర్పుల్, తెలుపు రంగులలో పూలను కలిగి ఉంటుంది.
3. మల్లెచెట్టు(Jasmine Plant)
మల్లెపూట చెట్టు కేవలం అందమైన మొక్క మాత్రమే కాదు సువాసనభరితమైనది, ఆకర్షణీయమైనది కూడా. తీగలా పారే ఈ మొక్కను మీ ఇంటి బాల్కనీలో ఈజీగా పెంచుకోవచ్చు. మొదటి అంతస్తు నుండి కిందకు వేలాడుతూ ఉండేలా ఈ మొక్కను పెంచుకున్నారంటే మీ ఇంటికి అందమైన రూపాన్ని ఇస్తుంది. నేలమీద వ్యాపించి మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుతుంది.
4. శంఖపుష్పాలు(sangu Flower plant)
శంఖపుష్పాలు కూడా చాలా అందమైన, ఔషధ గుణాలను కలిగిన పూలను అందిస్తుంది. ముఖ్యంగా ఈ పూల రంగు మీ బాల్కనీని చాలా ఆకర్షణీయంగా మారుస్తుంది. ఈ పూల ఆకారం కూడా అందంగా ఉంటుంది. చూపరుల మనసును కచ్చితంగా లాగేస్తుంది.
5. క్లైంబింగ్ రోజ్(Climbing Rose Plant)
క్లైంబింగ్ రోజ్ అనేది వేర్లతో పెరిగే చిన్న గులాబీ మొక్క. దీనిని సంరక్షించడం చాలా కష్టం. దీనికి మంచి కమ్మీ లేదా కర్ర ఇచ్చి తీగను పెరగనివ్వాలి. ఇది మీ బాల్కనీలో చక్కటి వాతావరణాన్ని కల్పిస్తుంది. మీ బాల్కనీకి అందమైన ఎరుపు రంగును అద్దుతూ ఆకర్షణీయంగా మారుస్తుంది.
6. ఇంగ్లీష్ ఐవీ(English Ivy)
ఇంగ్లీష్ ఐవీ అనే ఈ మొక్కకు పూలు పూయవు. కానీ దీకికుంటే అపూరూపమై ఆకుపచ్చ ఆకులు అందమైన రూపాన్ని ఇస్తాయి. దాని ఆకారం కూడా విభిన్నంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ మొక్కను మీ బాల్కనీలో చక్కగా పెంచుకోవచ్చు. దీన్ని బాల్కనీలో వేలాడే కుండలో పెంచుకుంటే ఇది మరీ అందంగా కనిపిస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్