Ganga Dussehra 2023: గంగా దసర పండుగ ఎప్పుడు, ఎందుకు జరుపుకుంటారో తెలుసా?-ganga dussehra 2023 date history significance and celebration ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Ganga Dussehra 2023: Date, History, Significance And Celebration

Ganga Dussehra 2023: గంగా దసర పండుగ ఎప్పుడు, ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

HT Telugu Desk HT Telugu
May 29, 2023 07:50 PM IST

Ganga Dussehra 2023: గంగా దసర పండగ గురించి, దాని ప్రాముఖ్యత, చరిత్ర గురించి తెలుసుకుందాం.

గంగా దసర పండగ ప్రాముఖ్యత, చరిత్ర
గంగా దసర పండగ ప్రాముఖ్యత, చరిత్ర (AP Photo/Rajesh Kumar Singh)

గంగ దసర హిందువుల పర్వదినం. గంగానది భూమిని ఈ రోజునే వచ్చిందని నమ్మకం. జ్యేష్ట మాసంలో శుక్ల పక్షంలో పదవ రోజున ఈ పండగ జరుపుతారు. ఈ పండగ పదిరోజుల పాటూ జరుగుతుంది. పండగ ముందు తొమ్మిది రోజుల వేడుకలుంటాయి. గంగానది ఒడ్డున చేరి చాలా మంది భక్తులు ప్రార్థనలు చేస్తారు. గంగానది దీవెనలు తీసుకుంటారు.

ఏ రోజున గంగా దసర జరుపుకుంటారు?

ఈ సంవత్సరం గంగ దసర మే 30, మంగళవారం రోజున వస్తోంది. జ్యేష్ట మాసంలో శుక్లపక్షంలో పదో రోజు ఈ పండగ జరుపుకుంటారు. తొమ్మిది రోజుల వేడుకలు కలిపి మొత్తం పదిరోజుల పండగ ఇది.

చరిత్ర:

హిందూ పురాణాల ప్రకారం, భగీరథుడు తన పూర్వీకుల ఆత్మలను శుద్ధి చేసి వారికి మోక్షాన్ని ప్రసాదించాలని కోరుకున్నాడు. అయితే, అతను సహాయం కోసం బ్రహ్మదేవుడిని సంప్రదించినప్పుడు, బ్రహ్మ తనకి బదులుగా శివుడిని ప్రార్థించమని ఆదేశించాడు. శక్తివంతమైన గంగను భూమికి తీసుకురావడం ఒక భయంకరమైన పని అని వివరించాడు. భగీరథ రాజు ప్రార్థనల వల్ల శివుడు గంగానదిని భూమిమీదకు వచ్చేలా చేశాడు. ఇదే రోజును గంగా దసరాగా జరుపుకుంటారు. హిందూ పురాణాల్లో జరిగిన ఈ ముఖ్యమైన ఘట్టం ప్రాముఖ్యతను ఈ పండగ తెలియజేస్తుంది.

ప్రాముఖ్యత:

పాపాలను ప్రక్షాళన, శుద్ధి చేసే పవిత్ర నది గంగ అని నమ్మకం. దాని ప్రాముఖ్యత తెలియజేస్తూ ఈ పండగ గొప్పగా జరుపుకుంటారు. గంగా తీరవ వెంబడి భక్తులు ప్రార్థనలు చేస్తారు. గంగానది ఆశీర్వాదం కోసం పవిత్ర స్నానం ఆచరిస్తారు. పాపాలను ప్రక్షాళన చేయాలని వేడుకుంటారు. పూర్వ జన్మ పాపాల నుంచి కూడా విముక్తి పొందవచ్చని నమ్ముతారు. గంగా దసరా కోట్ల ప్రాణుల మనుగడకు కారణమైన గంగానది ప్రాముఖ్యత గుర్తుచేస్తుంది. భౌతిక జీవనాధారంగా, జీవనోపాధిగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక శుద్ధికి, మోక్షానికి చిహ్నంగా కూడా ఉంది గంగానది.

గంగా దసర వేడుకలు:

గంగా దసరా సందర్భంగా చాలా మంది భక్తులు ప్రయాగ, హరిద్వార్, రిషికేష్, వారణాసి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ముఖ్యంగా కాశీ క్షేత్రంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు విచ్చేసి పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. గంగా హారతిలో పాల్గొంటారు.

WhatsApp channel

టాపిక్