Galentines Day: అమ్మాయిల కోసం గాలెంటైన్స్ డే వచ్చేసింది, ఈరోజు కచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే-galentines day is here for girls today is a must celebrate ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Galentines Day: అమ్మాయిల కోసం గాలెంటైన్స్ డే వచ్చేసింది, ఈరోజు కచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే

Galentines Day: అమ్మాయిల కోసం గాలెంటైన్స్ డే వచ్చేసింది, ఈరోజు కచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే

Haritha Chappa HT Telugu
Published Feb 13, 2025 06:00 AM IST

Galentines Day: వాలెంటైన్స్ డే గురించి అందరికీ తెలుసు. మరి గాలెంటైన్స్ డే గురించి తెలుసా? ఇది అమ్మాయిలు మాత్రమే చేసుకునే వేడుక. అది కూడా తమ స్నేహితురాళ్లతోనే.

హ్యాపీ గాలెంటైన్స్ డే
హ్యాపీ గాలెంటైన్స్ డే (Pixabay)

వాలెంటైన్స్ డే గురించి ఎక్కువమంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు వస్తుంది గాలెంటైన్స్ డే. ఇది కేవలం అమ్మాయిల కోసమే. అమ్మాయిలు ఈరోజు ఈ దినోత్సవాన్ని వేడుకలు నిర్వహించుకోవాలి... అది కూడా తమ స్నేహితురాళ్ళతో. ఈ గాలెంటైన్స్ డే అమ్మాయిలు వారి స్నేహితులతో ఎంజాయ్ చేయడానికి పుట్టుకొచ్చిన ప్రత్యేక దినోత్సవం వాలెంటైన్స్ డే ప్రేమికులకు అంకితం చేస్తే... గాలెంటైన్స్ డే అమ్మాయిలు తమ స్నేహితురాళ్లకు అంకితం చేసే పండుగ.

జీవితంలో స్నేహితులంటే ఆడా మగా ఇద్దరూ వస్తారు. కానీ ఒక అమ్మాయికి ఇంకొక అమ్మాయితో స్నేహం చేస్తే ఉన్నంత కంఫర్ట్, ఆనందం అబ్బాయితో చేస్తే ఉండదు. అమ్మాయిలకు ఎంతైనా తమ స్నేహితురాల్లో ప్రత్యేకమే. అందుకే అలాంటి వారి కోసమే ఏర్పాటయింది గాలెంటైన్స్ డే.

గాలెంటైన్స్ డేను మీ జీవితంలో మీ కష్టసుఖాల్లో తోడున్న స్నేహితురాళ్ళతో నిర్వహించుకోవాలి. మీ చెడు రోజుల్లో, ఎత్తుపల్లాల్లో మీతో పాటు నిలిచిన స్నేహితురాళ్లకు బహుమతులను ఇవ్వండి. వారితో సంతోషంగా గడపండి.

గాలెంటైన్స్ డే ఎప్పుడు?

ప్రతి సంవత్సరం గాలెంటైన్స్ డే ప్రేమికులు రోజుకి ఒక రోజు ముందు వస్తుంది. అంటే ఫిబ్రవరి 13న వస్తుంది. వాలెంటైన్స్ వీక్ లో ఏడవ రోజు కిస్ డే. ఈ కిస్ డే రోజునే గాలెంటైన్స్ డే నిర్వహించుకుంటారు.

గాలెంటైన్స్ డే ఎలా నిర్వహించుకోవాలి?

ఈ రోజు ఎలా ఎంజాయ్ చేయాలన్నదానికి ఒక పద్ధతి, ప్రణాళిక అవసరం లేదు. మీ ప్రాణ స్నేహితురాలితో మీకు నచ్చిన విధంగా గడపవచ్చు. డిన్నర్లకు వెళ్లొచ్చు. గ్రాండ్ సర్ ప్రైజ్ ఇవ్వచ్చు. ఐస్ క్రీమ్ తింటూ హాయిగా మాట్లాడుకోవచ్చు. సినిమాలకు వెళ్లొచ్చు. ఏదైనా ఈరోజు అమ్మాయిలు తమ స్నేహితురాలతో మాత్రమే గడపాలి.

ఎప్పుడు మొదలైంది?

గాలెంటైన్స్ డే చరిత్రలో లెస్లి నోప్ గురించి చెప్పుకోవాలి. ఈమె ఒక అమెరికన్ నటి. ఈ గాలెంటైన్స్ డేకు ఎక్కువ ప్రాచుర్యం ఇచ్చింది. ఆమె అమెరికా సీరియల్ నటించేది. తొలిసారి నటిస్తున్న ఆ సీరియల్ లో ఈ గాలెంటైన్స్ డే గురించి మొదటి సారి చూపించారు. ఆ సీరియల్‌లో వాలెంటైన్స్ డే కి ముందు లెస్లీ నోప్ తన స్నేహితురాళ్లతో కలిసి గాలెంటైన్స్ డే పార్టీని ఏర్పాటు చేస్తుంది. అందులో కేవలం మహిళా స్నేహితుల మాత్రమే వస్తారు. అప్పుడు ఇది మనరోజు అని ప్రకటిస్తుంది. అక్కడున్న మహిళలంతా ఎంతో సంతోషిస్తారు. అలా అమెరికన్ సీరియల్ ఎపిసోడ్ నుంచి గాలెంటైన్స్ డే పుట్టింది.

బాలీవుడ్ లో కరీనా కపూర్ కూడా తన బెస్ట్ ఫ్రెండ్స్ తో గాలెంటైన్స్ డే ను నిర్వహించుకుంటారు. ఆమె బెస్ట్ ఫ్రెండ్ వ్యాపారవేత్త భార్య అయినా నటాషా పూనావాలా. వీళ్ళిద్దరూ కలిసి గాలెంటైన్స్ కు ఎంజాయ్ చేసేందుకు బయటకి వెళుతూ ఉంటారు.

సాధారణ అమ్మాయిలు కూడా ఈ గాలెంటైన్స్ డేను తమ స్నేహితురాళ్ళతో ఆనందంగా గడిపేందుకు ప్రయత్నించాలి. జీవితంలోని ప్రతి క్షణాన్ని మధురంగా మార్చుకోవాలి.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం