Kids and Tea: పిల్లలకు ఏ వయసు నుంచి టీ, కాఫీ ఇవ్వవచ్చు? చిన్న వయసులో వాటిని తాగితే ప్రమాదమా?-from what age can tea and coffee be given to children is it dangerous to drink them at a young age ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kids And Tea: పిల్లలకు ఏ వయసు నుంచి టీ, కాఫీ ఇవ్వవచ్చు? చిన్న వయసులో వాటిని తాగితే ప్రమాదమా?

Kids and Tea: పిల్లలకు ఏ వయసు నుంచి టీ, కాఫీ ఇవ్వవచ్చు? చిన్న వయసులో వాటిని తాగితే ప్రమాదమా?

Haritha Chappa HT Telugu
Jan 30, 2025 10:21 AM IST

Kids and Tea: పిల్లలకు టీ, కాఫీలు ఇచ్చే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వారికి చిన్న వయసులోనే టీ లేదా కాఫీ తాగడం వల్ల పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

పిల్లలకు టీ లేదా కాఫీ ఏ వయసు నుంచి ఇవ్వవచ్చు?
పిల్లలకు టీ లేదా కాఫీ ఏ వయసు నుంచి ఇవ్వవచ్చు?

మనదేశంలో టీ, కాఫీలకు క్రేజ్ ఎక్కువ. ప్రతిరోజూ వీటిని తాగడంతోనే రోజును ప్రారంభిస్తారు. మన దేశ జనాభాలో సగానికి పైగా తమ రోజును ఒక కప్పు వేడి టీతో ప్రారంభిస్తారు. క్రమేపీ ఈ రోజుల్లో కాఫీ కూడా జనాలకు బాగా నచ్చేస్తోంది. ముఖ్యంగా నగరాల్లో నివసిస్తున్న యువత కాఫీ తాగేందుకు ఇష్టత చూపిస్తున్నారు. పెద్దలు కాఫీ లేదా టీ తాగడం పూర్తిగా సాధారణం. కానీ తమతో పాటూ తల్లిదండ్రులు ఇంట్లో ఉండే చిన్న పిల్లలకు టీ లేదా కాఫీ ఇస్తారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. అది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

yearly horoscope entry point

వైద్యులు కూడా టీ, కాఫీలు పిల్లలకు ఇవ్వవద్దని సలహా ఇస్తుంటారు. అయినా కూడా తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే టీ, కాఫీలు ఇచ్చేస్తూ ఉంటారు. దీనివల్ల వారి ఆరోగ్యాన్ని స్వయంగా మీరే చెడగొడుతున్నట్టు లెక్క. కాబట్టి పిల్లలకు ఏ వయసు నుంచి టీ, కాఫీలు తాగించవచ్చో తెలుసుకోండి.

పిల్లలకు ఏ వయసు నుంచి టీ ఇవ్వాలి?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు మీ బిడ్డకు టీ లేదా కాఫీ ఇవ్వాలనుకుంటే వారికి కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదుగుతున్న వయసులో వారికి టీ ఇవ్వకూడదు. టీ లేదా కాఫీలో ఉండే టానిన్లు, కెఫిన్ కారణంగా పిల్లల శరీరంలో కాల్షియం, ఇతర పోషకాల లోపం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పిల్లల ఎదుగుదలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఆ తర్వాత కూడా పిల్లలకు 18 ఏళ్ల వరకు కాఫీ లేదా టీని తక్కువ పరిమాణంలో ఇవ్వాలి.

తల్లిదండ్రులు చిన్న వయసులోనే తమ పిల్లలకు టీ లేదా కాఫీ ఇస్తారు. ముఖ్యంగా పిల్లల జలుబు సమయంలో వేడి వేడి టీ తాగితే పిల్లలకు ఉపశమనం లభిస్తుందని తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు. దీని వల్ల ఆరోగ్యం కన్నా హానే ఎక్కువగా ఉంటుంది. నిజానికి టీలో ఉండే 'టానిన్' పిల్లల దంతాలు, ఎముకలను బలహీనపరుస్తుంది. ఇది పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

కాఫీ గురించి చెప్పాలంటే , ఇందులో కెఫిన్ అధికంగా ఉంటుంది. ఇది పొట్ట సమస్యలను రెట్టింపు చేస్తుంది. ఎక్కువ కెఫిన్ తీసుకోవడం పిల్లల నిద్ర చక్రం కూడా దెబ్బతింటుంది. ఇది వారి పెరుగుదలను ప్రభావితం చేస్తుంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner