Monotrophic diet: విరాట్ కోహ్లీ నుంచి దిశా పటానీ వరకు ఫాలో అయ్యేది మోనోట్రోఫిక్ డైట్‌నే, దీనితో మెరుపుతీగలా మారొచ్చు-from virat kohli to disha patani following a monotrophic diet can turn you into a lightning rod ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Monotrophic Diet: విరాట్ కోహ్లీ నుంచి దిశా పటానీ వరకు ఫాలో అయ్యేది మోనోట్రోఫిక్ డైట్‌నే, దీనితో మెరుపుతీగలా మారొచ్చు

Monotrophic diet: విరాట్ కోహ్లీ నుంచి దిశా పటానీ వరకు ఫాలో అయ్యేది మోనోట్రోఫిక్ డైట్‌నే, దీనితో మెరుపుతీగలా మారొచ్చు

Haritha Chappa HT Telugu
Nov 11, 2024 07:30 PM IST

Monotrophic diet: విరాట్ కోహ్లీ నుంచి అనుష్క శర్మ, దిశా పటానీ, వరకు సెలెబ్రిటీలు ప్రస్తుతం అనుసరించే డైట్… మోనోట్రోఫిక్ డైట్. ఏమిటీ డైట్? బరువు తగ్గడానికి ఇది ఎలా సహాయపడుతుంది.

మోనోట్రోపిక్ డైట్ అంటే ఏమిటి?
మోనోట్రోపిక్ డైట్ అంటే ఏమిటి?

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, దిశా పటానీ వంటి సెలెబ్రిటీలందరూ సన్నగా, చురుగ్గా కనిపిస్తారు. వారు ఏం తింటారన్న ఆసక్తి ఎక్కువమందిలో ఉంటుంది. ఈ సెలబ్రిటీలందరినీ ఆహారం, ఫిట్నెస్ గురించి ఎక్కువమంది అడుగుతూ ఉంటారు. ప్రస్తుతం ఈ సెలెబ్రిటీలందరూ ఫాలో అవుతున్న డైట్… మోనోట్రోఫిక్ ఆహారం. దీన్నే పాటిస్తూ ఎంతో మంది తమ అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు.

మోనోట్రోపిక్ డైట్ అంటే?

మోనోట్రోపిక్ డైట్ అంటే ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారాన్ని తీసుకుంటారు. కొన్ని రోజుల పాటూ ఆహారంలో ఎలాంటి మార్పులు చేయకుండా తీసుకుంటారు. ఇది బోరింగ్ గా అనిపించవచ్చు కానీ ఇది ఫిట్ గా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఈ రకమైన డైట్ మంచి ఫలితాలను అందించంది కూడా.

బరువు తగ్గాలనుకుంటే

మీరు బరువు తగ్గాలనుకుంటే, మోనోట్రోపిక్ డైట్ చాలా సహాయపడుతుంది. ఈ ఆహారంలో, కొన్ని రోజులు లేదా వారాల పాటు ఒకే ఆహారాన్ని లేదా ఒక రకమైన ఆహారాన్ని తినండి. ఇది బరువు తగ్గడాన్ని సులభం చేస్తుంది. మోనో డైట్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే అందులో స్థూల పోషకాలను సులభంగా చేర్చుకోవచ్చు. దాదాపు ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారం తింటానని అనుష్క శర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆమె ఇడ్లీ, సాంబారును అల్పాహారంలో కచ్చితంగా తింటుంది. ఇడ్లీ పులియబెట్టిన ఆహారం, ఇది గట్ ఆరోగ్యానికి మంచిది. సాంబార్ కాయధాన్యాలు, కూరగాయలను కలిపి వండే వంటకం. దీని వల్ల ప్రోటీన్ తో పాటు ఇతర విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. కాబట్టి ఒకేరకమైన ఆహారాన్ని కొన్ని రోజులు లేదా నెలల పాటూ తినడం వల్ల పోషకాహారలోపం రాకుండా ఉంటుంది.

మోనో డైట్ ప్రయోజనాలు

మీకు తక్కువ సమయం ఉండే ఇలా ఒకరకమైన ఆహారాన్ని సులభంగా వండేసుకోవచ్చు. ఈ డైట్ పాటించాలనుకుంటే మీరూ ప్రతిరోజూ ఏమి తినాలి, ఎంత తినాలి అనేది ముందే నిర్ణయించుకోవాలి. ఎంత తినాలో, ఏం తినాలో కూడా ముందే నిర్ణయించుకోవాలి.

  • ఈ మోనోట్రోపిక్ డైట్ పాటించడం వల్ల కేలరీలను లెక్కించడం, భాగాలను నియంత్రించడం సులభం చేస్తుంది.
  • మోనో డైట్ పాటించడం వల్ల జీర్ణక్రియ సులభం అవుతుంది. జీర్ణ వ్యవస్థ సజావుగా పనిచేస్తుంది.
  • శరీరంలోని విషాలను, వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ బాగుంటే టాక్సిన్స్ శరీరం నుంచి బయటికి పోతాయి.

ఈ ప్రక్రియల వల్ల బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఎందుకంటే మీరు తక్కువ కేలరీల ఆహారాన్ని తినడం ప్రారంభిస్తే, ఇది వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

- ఎనర్జీ లెవెల్ రోజంతా మెయింటైన్ అవుతుంది. ఒకే ఆహారాన్ని కొన్ని రోజుల పాటు తింటే జీర్ణక్రియ బాగుంటే మరింత ఎనర్జిటిక్ గా ఫీలవుతారు.

అయితే, మోనోట్రోఫిక్ డైట్ కూడా కొన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి.

మోనోట్రోఫిక్ డైట్ వల్ల కలిగే నష్టాలు

- మోనోట్రోఫిక్ ఆహారం కారణంగా, చాలాసార్లు బలహీనత, మల బద్ధకం కూడా వస్తాయి. ఇది వ్యాయామాన్ని ప్రభావితం చేస్తుంది.

వాస్తవానికి ఒకే ఆహారాన్ని తినడం వల్ల చాలాసార్లు ఇతర సూక్ష్మ, స్థూల పోషకాల లోపం ఏర్పడుతుంది. కాబట్టి మోనో డైట్ ను కొన్ని లేదా రెండు వారాల పాటు పాటించి ఆ తరువాత ఆపాలి. మళ్లీ కొన్ని రోజుల విరామం తరువాత మొదలుపెట్టాలి. తద్వారా శరీరంలో ఎలాంటి పోషకాలకు కొదవ ఉండదు.

Whats_app_banner