Petroleum Jelly: వాసెలిన్ ఉపయోగాలు తెలిస్తే చలికాలంలో మాత్రమే కాదు, అన్ని సీజనల్లోనూ కొని తెచ్చుకుంటారు!-from skin to clothes 10 ways to use petroleum jelly in your daily life ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Petroleum Jelly: వాసెలిన్ ఉపయోగాలు తెలిస్తే చలికాలంలో మాత్రమే కాదు, అన్ని సీజనల్లోనూ కొని తెచ్చుకుంటారు!

Petroleum Jelly: వాసెలిన్ ఉపయోగాలు తెలిస్తే చలికాలంలో మాత్రమే కాదు, అన్ని సీజనల్లోనూ కొని తెచ్చుకుంటారు!

Ramya Sri Marka HT Telugu
Jan 03, 2025 05:00 PM IST

Petroleum Jelly: పెట్రోలియం జెల్లీ(వాసెలిన్) చలికాలంలో చర్మం పొడిబారకుండా, పగుళ్లు రాకుండా ఉండేందుకు ఉపయెగపడుతుందుని అందరికీ తెలుసు. అయితే దీని గురించి చాలా మందికి తెలియని విషయాలేంటంటే.. మన డైలీ లైఫ్‌లో ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. తెలిస్తే షాక్ అవుతారు.

వాసెలిన్ ఉపయోగాలు తెలిస్తే చలికాలంలో మాత్రమే కాదు, అన్ని సీజనల్లోనూ కొని తెచ్చుకుంటారు!
వాసెలిన్ ఉపయోగాలు తెలిస్తే చలికాలంలో మాత్రమే కాదు, అన్ని సీజనల్లోనూ కొని తెచ్చుకుంటారు! (shutterstock)

శీతాకాలంలో చర్మం పొడి బారి పగుళ్లు రాకుండా ఉండేందుకు పెట్రోలియం జెల్లీని ఎక్కువగా ఉపయోగిస్తారు.ఇది చర్మాన్ని ఎల్లప్పుడూ మృదువుగా,హైడ్రేటెడ్ గా ఉంచుతుందినీ, చలికాలంలో వచ్చే ఇతర చర్మ సమస్యలను నయం చేస్తుందని నమ్ముతారు. పెట్రోలియం జెల్లీతో పొడిబారిన పగిలిన మోచేతులు, తొడలు వంటి శరీర భాగాలన్నీ మృదువుగా అందంగా మారతాయని అందరికీ తెలుసు. అయితే దీని గురించి తెలియని విషయాలు, ఉపయోగాలు చాలా ఉన్నాయి. అవేంటో తెలిస్తే కేవలం చలికాలంలో మాత్రమే కాకుండా అన్ని సీజన్లలోనూ దీన్ని ఉపయోగిస్తారు.

yearly horoscope entry point

1) కంటి కింద నల్లటి వలయాలకు:

కళ్ళ చుట్టూ చర్మంపై నూనె గ్రంథులు ఉండవు. అందుకే చాలా మందికి కంటి కింద సన్నని గీతలు, ముడతలు కనిపిస్తాయి. అలాంటి వారు రాత్రి పడుకునే ముందు కంటి కింద, కళ్ల చుట్టూ ఉండే చర్మంపై వాసెలిన్ ను పూసి, ఉదయం శుభ్రం చేయండి. ఇది కళ్ళ దగ్గర చర్మాన్ని మృదువుగా మరియు హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ముడతలను తొలగించడానికి సహాయపడుతుంది.

2) షూస్ పాలీష్ కోసం:

ఇంట్లో షూ పాలిష్ అయిపోతే షూస్ పై వాసెలిన్ అప్లై చేయండి. ఇది మీ షూస్ శుభ్రంగా, మెరిసేలా కనిపించేందుకు సహాయపడుతుంది.

3) కొత్త చెప్పులు లేదా బూట్ల దద్దుర్లు:

చాలా మందికి కొత్త చెప్పులు లేదా బూట్టు వేసుకోగానే దద్దుర్లు, బొబ్బలు వంటివి వస్తాయి. అలాంటి చర్మ సమస్యలు ఉన్నవారు వాటిని వేసుకునే మందు పాదాలకు పెట్రోలియం జెల్లీ రాసుకోండి. ర్యాషెస్ రమ్మన్నా రావు.

4) ఆభరణాల వల్ల కలిగే దద్దుర్లు నుండి రక్షణ:

కృత్రిమ, రోల్డ్ గోల్డ్ ఆభరణాలు ధరించిన తర్వాత కొందరికి చర్మంపై మంట, దురద, దద్దుర్లు వంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటి ఇబ్బంది ఉన్నవారు చెవి పోగులు, గొలుసులు ధరించే ముందు చెవికీ, మెడకూ వాసెలిన్ రాసుకుని వాటిని పెట్టుకోండి. ఇది మీ చర్మానికి రక్షణ పొరను ఏర్పరిచి దద్దుర్లు, దురద నుంచి రక్షిస్తుంది.

5) పీరియడ్ రాషెస్:

పీరియడ్స్ సమయంలో చాలా మందికి తొడల దగ్గర దద్దుర్లు వస్తాయి. అంతేకాదు సాధారణంగా లావుగా ఉన్నారికి కూడా చంకలు, తొడ భాగంలో ఒత్తుక్కుపోయి దద్దుర్లు వస్తాయి. అలాంటి వారు ప్రభావిత ప్రాంతంలో పెట్రోలియం జెల్లీని రాసుకుంటే చక్కటి ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజూ స్నానం చేసి రాగానే రాసుకోవడం వల్ల సమస్యలు రానే రావు.

6) నెయిల్ పాలిష్:

నెయిల్ పాలిష్ అప్లై చేసేటప్పుడు తరచుగా క్యూటికల్స్ లేదా గోరు అంచులపై కూడా అది అంటుకుంటుంది. అలా అంటకుండా మీరు పర్ఫెక్ట్ నెయిల్ పెయింట్ వేసుకోవాలనుకుంటే ముందుగా అంచులకు వాసెలిన్ అప్లై చేస్తే అది గోరు తప్ప మరెక్కడా అంటుకోదు.

7) హెయిర్ కలర్ నుండి రక్షించండి:

ఇంట్లో హెయిర్ కలర్ అప్లై చేసేటప్పుడు చేతులపై, నుదిటిపై లేదా చెవుల చుట్టూ పడుతుంది.ఈ రంగు రెండు మూడు రోజుల పాటు అలాగే కనిపిస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే హెయిర్ కలర్ అప్లై చేయడానికి ముందే చేతులకూ,తల చుట్టు పక్కల ప్రాంతాల్లో పెట్రోలియం జెల్లీని రాసుకోవాలి. ఇది రంగు అంటుకోకుండా ఆపుతుంది. అంటినా ఈజీగా శుభ్రమైపోతుంది.

8) మేకప్ మరకలను తొలగించండి:

మేకప్ వేసుకునేటప్పుడు కొన్ని సార్లు అది బట్టల మీద పడిపోతుంది. అలాగే మేకప్ వేసుకుని పడుకోవడం వల్ల అది బెడ్ షీట్, దుప్పటి లేదా దిండుపై మరకలు ఏర్పడతాయి. వీటిని సులభంగా తొలగించాలంటే ఉతికే ముందు మేకప్ పడిన చోట వాసెలిన్ రాసి రుద్దాలి. తరువాత ఉతకాలి. ఇలా చేయడం వల్ల మేకప్ మరకలన్నీ మాయం అయిపోతాయి.

9) జుట్టు ఎగరకుండా:

చాలా మందికి వెంట్రుకలు కుదురుగా ఉండవు. తరచూ గాలికి ఎగురుతూ హెయిర్ స్టైల్ ను చెడగొడతాయి. ఇలాంటి వారు వెంట్రుకలను పెట్రోలియం జెల్లీని అప్లై చేసుకోవచ్చు. ఇది జుట్టు ఎగరకుండా ఉంచడంతో పాటు ఆరోగ్యంగా మెరిసేలా తయారు చేస్తుంది.

10) పెర్ఫ్యూమ్ అప్లై చేయడానికి ముందు:

శరీరంలోని నిర్దిష్ట భాగాలకు పెర్ఫ్యూమ్ కొట్టుకునే ముందు వాసెలిన్ అప్లై చేయండి. తర్వాత పెర్ఫ్యూమ్ స్ప్రే చేయండి. ఇలా చేయడం వల్ల పెర్ ఫ్యూమ్ ఎక్కువ సేపు ఉండి, ఎక్కువ సేపు వాసన వస్తూనే ఉంటుంది.చర్మానికి ఎలాంటి హాని జరగదు.

Whats_app_banner