Bakrid Special Recipes: షీర్ కుర్మా నుంచి మటన్ లివర్ గ్రేవీ వరకు బక్రీద్ స్పెషల్ రెసిపీలు ఇవిగో-from sheer kurma to mutton liver gravy here are bakrid special recipes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bakrid Special Recipes: షీర్ కుర్మా నుంచి మటన్ లివర్ గ్రేవీ వరకు బక్రీద్ స్పెషల్ రెసిపీలు ఇవిగో

Bakrid Special Recipes: షీర్ కుర్మా నుంచి మటన్ లివర్ గ్రేవీ వరకు బక్రీద్ స్పెషల్ రెసిపీలు ఇవిగో

Haritha Chappa HT Telugu
Jun 16, 2024 11:30 AM IST

Bakrid Special Recipes: ఈద్ ఉల్ అధా 2024, దీన్ని బక్రీద్ పండుగ అంటారు. ఈ పండుగ రోజున ముస్లిం సోదరులు టేస్టీ వంటకాలతో ఇల్లు ఘుమఘుమలాడిస్తారు. వారి చేసుకునే వంటకాల్లో కొన్ని రెసిపీలు ఇక్కడ ఇచ్చాము.

బక్రీద్ స్పెషల్ వంటకాలు
బక్రీద్ స్పెషల్ వంటకాలు (Pinterest)

బక్రీద్ పండుగను ప్రధాన ఇస్లామిక్ పండుగల్లో ఒకటి. ఇది ఇస్లామిక్ క్యాలెండర్లో పన్నెండవ నెల 10 వ రోజున వస్తుంది. భారత్లో ఈద్ ఉల్ అధాను జూన్ 17న, యూఏఈ, ఇతర అరబ్ దేశాల్లో జూన్ 16న నిర్వహించుకోనున్నారు. ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడు ఇస్మాయిల్ ను అల్లాహ్ కు విధేయతగా బలి ఇవ్వడానికి సిద్ధపడినందుకు గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారు. ఇది వార్షిక హజ్ యాత్ర ముగింపును అనుసరిస్తుంది. మేకలు, గొర్రెలు లేదా ఒంటెలు వంటి పశువులను బలి ఇవ్వడం వంటివి చేస్తారు. మటన్ బిర్యానీ, మటన్ కబాబ్స్, చికెన్ టిక్కాస్, షీర్ ఖుర్మా, ఖుర్మా, సెవియన్, కలేజీ వంటి సంప్రదాయ వంటకాలు బక్రీద్ పండుగలో ప్రధానమైనవి.

yearly horoscope entry point

బక్రీద్ కోసం రుచికరమైన వంటకాలు

మీ పండుగ అనుభవాన్ని మెరుగుపరచడానికి, పాక ఆనందం కోసం మీరు ప్రయత్నించాల్సిన కొన్ని ఆహ్లాదకరమైన వంటకాలు ఇక్కడ ఉన్నాయి:

1. షీర్ కుర్మా

(చెఫ్ సంజీవ్ కపూర్ రెసిపీ)

షీర్ కుర్మా రెసిపీ
షీర్ కుర్మా రెసిపీ (Pinterest)

షీర్ కుర్మా రెసిపీకి కావల్సిన పదార్థాలు

కండెన్స్ డ్ మిల్క్ - ఒక లీటరు

కొవ్వు తీయని పాలు - ఒక లీటరు

ఖర్జూరం - ఎనిమిది

యాలకుల పొడి - అర స్పూను

చక్కెర - అర కప్పు

నెయ్యి - పావు కప్పు

చిరోంజీ విత్తనాలు - రెండు స్పూన్లు

పిస్తా - గుప్పెడు

బాదం - ఎనిమిది

జీడిపప్పు - ఎనిమిది

గోధుమ వెర్మిసెల్లి పొడి - ఒక కప్పు

కొబ్బరి తురుము - పావు కప్పు

కుంకుమపువ్వు - రెండు రేకులు

విధానం:

1. నాన్ స్టిక్ పాన్ లో నెయ్యి వేడి చేయాలి. వెర్మిసెల్లి వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి.

2. తర్వాత అందులో కండెన్స్ డ్ పాలు, వెన్న తీయని పాలు , పంచదార వేసి బాగా మిక్స్ చేసి 2-3 నిమిషాలు ఉడికించాలి. అందులో 1/2 టీస్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపాలి.

3. తర్వాత అందులో చరోలి విత్తనాలు వేసి మిశ్రమం చిక్కబడే వరకు ఉడికించాలి. అందులోనే తరిగిన ఖర్జురాలు, బాదం, పిస్తా తరుగు, కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి.

4. తరిగిన పిస్తాలను పైన చల్లుకుని స్టవ్ కట్టేయాలి. అంటే షీర్ కుర్మా సిద్ధమైనట్టే.

2. షమీ కబాబ్

(చెఫ్ కునాల్ కపూర్ రెసిపీ)

షమీ కబాబ్
షమీ కబాబ్ (Chef Kunal Kapur)

షమీ కబాబ్ రెసిపీకి కావల్సినవి పదార్థాలు

బిర్యానీ ఆకులు - 3

యాలకులు - 3

మిరియాలు - రెండు స్పూన్లు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

లవంగాలు - ఆరు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

కారవే విత్తనాలు - ఒక స్పూను

జీలకర్ర - రెండు స్పూన్లు

ఎండు మిరపకాయలు - అయిదు

నెయ్యి - రెండు స్పూన్లు

బోన్ లెస్ మటన్ - అరకిలో

మటన్ నల్లి - రెండు

తరిగిన అల్లం - ఒక స్పూన్లు

తరిగిన వెల్లుల్లి - రెండు స్పూన్లు

పచ్చిమిర్చి - మూడు

పసుపు - అర స్పూను

ఉల్లిపాయలు - రెండు

శనగపప్పు - అరకప్పు

నీళ్లు - సరిపడినంత

పుదీనా ఆకులు - గుప్పెడు

గుడ్డు - ఒకటి

నెయ్యి - ఫ్రై చేయడానికి సరిపడా

తయారీ విధానం:

1. షమీ కబాబ్ కోసం ముందుగా షమీ మసాలా రెడీ చేయాలి.

2. కళాయిని స్టవ్ మీద పెట్టి బిర్యానీ ఆకులు, యాలకులు, మిరియాలు, , దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, కొత్తిమీర, షాహీ జీలకర్ర, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి.

3. వాటిని మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో నెయ్యి, బోన్ లెస్ మటన్, మటన్ నల్లీ, తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, తరిగిన ఉల్లిపాయలు, నానబెట్టిన శనగపప్పు, షామి మసాలా వేసి కలపాలి.

4. తర్వాత 3 నుంచి 4 నిముషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టాలి. 7 నుంచి 8 విజిల్స్ వరకు లేదా మటన్ బాగా ఉడికే వరకు ఉడికించాలి.

5. ఆవిరి పోయాక కుక్కర్ మూత తీసి నీరు ఉంటే అధిక వేడిపై ఉడికించి నీరు ఆవిరైపోయేలా చేయాలి.

6. మటన్ మెత్తగా మాష్ చేసుకోవాలి. మిక్సీలో వేసి ఒకసారి మెత్తగా రుబ్బితే సరిపోతుంది.

7. మటన్ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి కలపాలి. అలాగే పచ్చిమిర్చి తరుగు, ఒక గుడ్డు కొట్టి వేసి బాగా కలపాలి.

8. గుడ్డు వేసుకోవడం ఇష్టంలేకపోతే మానేయచ్చు.

9. ఇప్పుడు మటన్ మిశ్రమాన్ని చేత్తోనే కబాబ్ లా ఒత్తుకోవాలి.

10. స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి, దానిపై కబాబ్ ను ఉంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా సమానంగా వేయించాలి.

11. అంతే షమీ కబాబ్ రెసిపీల రెడీ అయినట్టే. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి.

3. కలేజీ మసాలా

(చెఫ్ పంకజ్ భదౌరియా రిసిపి)

కలేజీ మసాలా (మటన్ లివర్ రెసిపీ)
కలేజీ మసాలా (మటన్ లివర్ రెసిపీ) (Pinterest)

కలేజీ మసాలా కావల్సిన పదార్థాలు

లివర్ - అరకిలో

ఉల్లిపాయలు - నాలుగు

అల్లం తరుగు - ఒక స్పూను

వెల్లుల్లి - 10 రెబ్బలు

పచ్చిమిర్చి - ఆరు

దాల్చినచెక్క - చిన్న ముక్క

యాలకులు - ఆరుగు

కారవే గింజలు - ఒక స్పూన్లు

లవంగాలు - 6

పెరుగు - అరకప్పు

పచ్చి బొప్పాయి పేస్ట్ - పావు స్పూను

కారం పొడి - ఒక స్పూను

జీలకర్ర పొడి - ఒక స్పూను

కారం - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు

నూనె - సరిపడినంత

తయారుచేసే విధానం:

1. మటన్ లివర్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. పచ్చి బొప్పాయి పేస్టు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.

3. ఒక గిన్నెలో పైన చేసిన పేస్టును, మటన్ లివర్, పెరుగు, పొడి చేసిన మసాలా దినుసులు, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. కనీసం 2 గంటల పాటు మ్యారినేట్ చేసి, ఫ్రిజ్ లో ఉంచాలి.

4. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి బంగారు గోధుమ రంగులోకి వేయించి స్టవ్ కట్టేయాలి. వాటిని చల్లార్చి కొద్దిగా నీటితో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

5. స్టవ్ మీద కళాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి.

6. మ్యారినేట్ చేసిన లివర్ ను వేసి వేయించాలి. నీళ్లన్నీ ఆవిరయ్యే వరకు వేయించాలి. చిన్న వేడి మీద ఉంచి లివర్ ముదురు రంగులోకి మారే వరకు వేయించాలి.

7. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్, 3-4 ముక్కలు పచ్చిమిర్చి, 1/4 కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. ఉపరితలంపై నూనె వచ్చే వరకు ఉడికించాలి. కసూరి మేథీ, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇగురులాగా అయ్యేవరకు ఉంచి తరువాత స్టవ్ కట్టేయాలి.

4. షాహీ తుక్డా

(చెఫ్ సంజీవ్ కపూర్ రెసిపీ)

షాహీ తుడ్కా
షాహీ తుడ్కా (Pinterest)

షాహీ తుడ్కా రెసిపీ కావాల్సిన పదార్థాలు

వైట్ బ్రెడ్ ముక్కలు - ఆరు

పాలు - నాలుగు కప్పులు

పంచదార - ముప్పావు కప్పు

యాలకుల పొడి - అర స్పూను

పిస్తా పప్పు - గుప్పెడు

నెయ్యి - రెండు స్పూన్లు

తయారుచేసే విధానం:

1. రబ్డీ తయారీకి నాన్ స్టిక్ పాన్ లో పాలు పోసి మరిగించాలి. అది చిక్కబడే వరకు కలుపుతూ ఉండండి.

2. తర్వాత అందులో పంచదార వేసి బాగా కలపాలి. యాలకుల పొడి వేసి కలియబెట్టి ఒక నిమిషం ఉడికించాలి. పిస్తాపప్పు వేసి బాగా కలపాలి. స్టవ్ కట్టేసి చల్లబరచాలి. రబ్జీ తయారైనట్టే.

3. మరో నాన్ స్టిక్ పాన్ లో కొద్దిగా నెయ్యి వేడి చేయాలి.

4. బ్రెడ్ ముక్కలను 4 సమాన భాగాలుగా కట్ చేయండి.

5. ఈ ముక్కలను వేడి నెయ్యిలో రెండు వైపుల నుంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

6. ఒక ప్లేట్ లో వేయించిన బ్రెడ్ ముక్కలను తీసుకోండి. పంచదార సిరప్ చల్లి పైన రబ్డీ వేయాలి. పైన పిస్తా చల్లాలి. అంతే రెసిపీ రెడీ అయనట్టే.

Whats_app_banner