Sabudana Tea Recipe । సాబుదాన టీ ఎప్పుడైనా తాగారా? వేడిలో మిమ్మల్ని చల్లబరిచే రెసిపీ ఇదిగో!-from sabudana tea to apple tea checkout some refreshing tea recipes here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sabudana Tea Recipe । సాబుదాన టీ ఎప్పుడైనా తాగారా? వేడిలో మిమ్మల్ని చల్లబరిచే రెసిపీ ఇదిగో!

Sabudana Tea Recipe । సాబుదాన టీ ఎప్పుడైనా తాగారా? వేడిలో మిమ్మల్ని చల్లబరిచే రెసిపీ ఇదిగో!

HT Telugu Desk HT Telugu

Sabudana Tea Recipe: ఐస్‌డ్ టీలో అనేక ఫ్లేవర్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఇంట్లోనే తయారు చేసుకోగల కొన్ని ఐస్‌డ్ టీ సులభమైన రెసిపీలను అందిస్తున్నాము.

Sabudana Tea Recipe (istcok)

Refreshing Tea Recipes: నైరుతి కనుచూపు మేరలో ఉందనిపిస్తున్న వేసవి వేడి మాత్రం వీడటానికి మొండికేస్తుంది. ఈ వేడి నుంచి ఉపశమనం పొందాలంటే, చల్లటి అనుభూతి కలిగించే ఐస్‌డ్ టీ తాగాలి. సాయంత్రం చాలా మంది ఒక కప్పు టీ తాగాలని కోరుకుంటారు. ఈ ఐస్‌డ్ టీలు మీకు టీ తాగిన ప్రభావాలను కలిగించటమే కాకుండా ఎండలో ఒక రిఫ్రెషింగ్ పానీయంగా ఉంటుంది.

ఐస్‌డ్ టీలో అనేక ఫ్లేవర్స్ ఉంటాయి. సాబుదానతో కూడా మీరు టీ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంట్లోనే తయారు చేసుకోగల కొన్ని ఐస్‌డ్ టీ సులభమైన రెసిపీలను అందిస్తున్నాము.

యాపిల్ ఐస్‌డ్ టీ రెసిపీ

  • 1-2 తాజా యాపిల్స్‌ను తీసుకుని, ముక్కలుగా కోయండి, విత్తనాలు తీసేయండి.
  • తరువాత, ఒక పాన్‌లో నీరు పోసి అందులో యాపిల్ ముక్కలు, నీరు, చక్కెర, దాల్చిన చెక్క, టీ బ్యాగ్‌లను ఉంచి మరిగించండి.
  • అన్నీ బాగా కలిసిన తర్వాత మిశ్రమాన్ని బాగా కలిపి, వడకట్టండి.
  • ఆపై ఫ్రిజ్ లో ఉంచి చల్లబరచండి, తరువాత బయటకు తీసి ఒక గ్లాసులో పోసుకోండి.
  • యాపిల్ ఐస్‌డ్ టీ రెడీ, కొన్ని పుదీనా ఆకులు, నిమ్మకాయ, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేసుకోండి.

కారామెల్ బోబా ఐస్‌డ్ టీ/ సాబుదానా టీ రెసిపీ

కావలసిన పదార్థాలు:

  • చక్కెర 4 టేబుల్ స్పూన్లు
  • టీ పొడి 4 tsp
  • సబుదానా 1/4 స్పూన్

సాబుదాన టీ తయారీ విధానం:

  1. ఒక బాణలిలో నీళ్లు, టీ ఆకులు వేసి మరిగించాలి, చల్లారనివ్వాలి
  2. మరో బాణలిలో పంచదార వేసి పంచదార పాకం చేయాలి.
  3. అందులో మరిగించిన టీ, కొన్ని నానబెట్టిన టపియోకా ముత్యాలు/ సగ్గుబియ్యం వేయాలి
  4. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసులో తీసుకొని అందులో, ఐస్ ముక్కలు, పాలు వేసి కలపండి.

మాచా ఐస్‌డ్ లాటే రెసిపీ

కావలసిన పదార్థాలు:

  • 1 స్పూన్ మాచా పౌడర్
  • 80 ml వేడి నీరు
  • 25 గ్రాముల బ్రౌన్ షుగర్ సిరప్
  • 150 ml పాలు
  • కొన్ని ఐస్ ముక్కలు

మాచా ఐస్‌డ్ లాటే తయారీ విధానం

  1. ఒక గిన్నెలో మాచా పౌడర్, నీరు వేసి బాగా కలపాలి
  2. ఒక గ్లాసు తీసుకుని, దానిని మంచుతో నింపి, బ్రౌన్ షుగర్ మిశ్రమాన్ని పోయాలి
  3. ఆపైన పాలు పోసి, దానిపై మాచా మిశ్రమం కలపండి

మాచా ఐస్‌డ్ లాటే రెడీ. చల్లగా సర్వ్ చేయండి.

సంబంధిత కథనం